Wednesday, December 31, 2025

సంగారెడ్డిలో రాష్ట్రీయ బసవదల్ జిల్లా కమిటీ ఏర్పాటు -పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారం

 

సంగారెడ్డి, డిసెంబర్ 31 (SNM MEDIA):తెలంగాణ రాష్ట్ర రాష్ట్రీయ బసవదల్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు శంకర్ పాటిల్, అనిల్ పాటిల్‌ల ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రీయ బసవదల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరమ పూజ్య ద్వితీయ మహిళ జగద్గురు బసవధర్మ పీట అధ్యక్షులు డాక్టర్ గంగా మాతాజీ హాజరై, కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రాష్ట్రీయ బసవదల్ పాలకవర్గ సభ్యులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా అధ్యక్షులుగా సిహెచ్ శరణ్ ప్రసాద్, ఉపాధ్యక్షులుగా బి. నాగుల్, జనరల్ సెక్రటరీగా సూర్యకాంత్, ట్రెజరర్‌గా ఎన్. యశ్వంత్ కుమార్ నియమితులయ్యారు. అలాగే జాయింట్ సెక్రటరీలుగా వీరిశెట్టి, జి. శివకుమార్, సెక్రటరీగా మహేష్ బాధ్యతలు చేపట్టారు. ముఖ్య సలహాదారులుగా భీమాని మల్లప్ప, బి. శివకుమార్, ఏ. శేఖర్‌లను నియమించారు. ఈ సందర్భంగా డాక్టర్ గంగా మాతాజీ మాట్లాడుతూ బసవధర్మ సూత్రాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లే దిశగా కమిటీ సభ్యులు కృషి చేయాలని సూచించారు. సమాజ సేవ, ఐక్యత, నైతిక విలువల పరిరక్షణలో రాష్ట్రీయ బసవదల్ పాత్ర మరింత బలోపేతం కావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బసవదల్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tuesday, December 30, 2025

ఎస్‌జీజీఎఫ్ రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థికి సర్టిఫికెట్ ప్రదానం -యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం – ఎస్‌జీజీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు


సంగారెడ్డి, డిసెంబర్ 29 (SNM NEWS): వికారాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఎస్‌జీజీఎఫ్ అండర్–17 బాయ్స్ ఫుట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న కేంద్రీయ విద్యాలయ ఎద్దు మైలారం పాఠశాల విద్యార్థి గడ్డమీది సాయి సిద్ధార్థ గౌడ్‌కు సంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ, పీడీ శ్రీనివాసరావు చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ క్రీడపై మాట్లాడిన ఎస్‌జీజీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రతిభావంతమైన యువ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహకారం అందిస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు.

Sunday, December 21, 2025

సంగారెడ్డి లో నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో గంజి మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్ష

సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): పనికి ఆహార పథకం పేరు లో నుండి మహాత్మా గాంధీ పేరు ను తొలగించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం చర్యను నిరసిస్తూ ఆదివారం  సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గంజి మైదాన్ గాంధీ విగ్రహం వద్ద దీక్ష కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథి గా టిజిఐసిసి  చైర్మెన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతి పిత మహాత్మా గాంధీ పేరు తొలగించాలానే కుట్ర చేస్తున్నారని అన్నారు.  దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన వెక్తి మహాత్ముడు గాంధీ ని అవమానించిన బీజేపీ ని ప్రజలు క్షేమించరని అన్నారు. దేశ స్వాతంత్య్రం లో ఒక్క బీజేపీ నాయకుడు పాల్గొనలేదు అన్నారు. బీజేపీ ప్రభుత్వం గాడ్సే ఆశయాలతో ముందుకు సాగుతుంది. అన్నారు.  ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బుచ్చి రాములు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, బొంగుల రవి, ప్రవీణ్, నర్సింహారెడ్డి, మహేష్, తాహిర్, కసిని రాజు, నవాజ్, ఆరిఫ్, బాబు, తదితరులు పాల్గొన్నారు. 

కోటిపల్లి సర్పంచ్ స్వామిపై దాడిని ఖండించిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మడుపతి సంతోష్ స్వామి

సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు  జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపతి సంతోష్ స్వామి ,సమాజం నాయకులు తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ.. స్వామి పై దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేసి శిక్ష వేయించాలి  అధ్యక్షుడు సంతోష్ కుమార్ స్వామి డిమాండ్ చేశారు. 

దాడిలో గాయపడిన ఆయనకు వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర, సంగారెడ్డి జిల్లా జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరుపున జిల్లా ఎస్పీ కార్యాలయము ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి,బసవలింగం స్వామి,శిశిధర్ స్వామి ,శివప్రసాద్ స్వామి,మఠం శివకుమార్ స్వామి,నగేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Friday, December 19, 2025

మధుమేహ వ్యాధిగ్రస్తులు కుంకుమ పువ్వు

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS): ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసు ఏదంటే టక్కున గుర్తొచ్చేది కుంకుమపువ్వు. ఈ పువ్వు ఉత్పత్తికి సాగు చేసే విధానం కారణంగా, కుంకుమపువ్వు ధర అత్యధికంగా ఉంటుంది. నిజానికి.. ఇతర మసాలా దినుసుల కంటే కుంకుమపువ్వు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ. అవేంటో తెలుసుకుందాం.. కొన్నిసార్లు కోపం రావడం, కొన్నిసార్లు ఏడవడం.. ఇలాంటి మానసిక కల్లోలం తరచుగా రావడం అస్సలు మంచిది కాదు. ఈ పరిస్థితిలో కుంకుమపువ్వు సహాయం తీసుకోవచ్చు. కుంకుమపువ్వు మనస్సును ఆరోగ్యంగా ఉంచుతుందని, డిప్రెషన్‌ లక్షణాలను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆందోళనను తగ్గించడంలోనూ కుంకుమ పువ్వు సహాయపడుతుంది. కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కుంకుమపువ్వు తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఆహారంలో కుంకుమపువ్వును తప్పక తీసుకోవాలి. ముఖ్యంగా కుంకుమపువ్వు మహిళల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రీ-మెన్‌స్ట్రువల్‌ సిండ్రోమ్‌ సమస్యకు కుంకుమపువ్వు మేలు చేస్తుంది. అంటే రుతుక్రమం రాకముందే కలిగే మానసిక, శారీరక ఆనారోగ్యాన్ని కుంకుమపువ్వు దూరం చేస్తుంది. కాలు నొప్పి, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలను నియంత్రిస్తుంది. రోజూ కుంకుమపువ్వు కలిపిన టీ లేదా పాలు తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. కుంకుమపువ్వు ఆకలిని అణిచివేసి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ మసాలాలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఊబకాయాన్ని నివారిస్తాయి. జీవక్రియ రుగ్మతలను తొలగిస్తాయి. కుంకుమపువ్వు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. కుంకుమపువ్వులోని యాంటీఆక్సిడెంట్‌ కంటెంట్‌ కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

అడపాదడపా ఉపవాసం చేస్తున్నారా.?

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS): ఇంటర్మీటెంట్‌ ఫాస్టింగ్‌(అడపాదడపా ఉపవాసం) వల్ల గుండె జబ్బులు వస్తాయని, స్ట్రోక్‌ వస్తుందని గత నాలుగైదు రోజులుగా ఎన్నో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మనం ఆహారాన్ని తీసుకున్న వెంటనే నోట్లో నుంచే జీర్ణక్రియ అనేది ప్రారంభమవుతుంది. లాలాజలంలో టయలిన్‌ అనే ఎన్‌జైమ్‌ ఉంటుంది. మన జీర్ణాశయంలో 4 గంటల పాటు ఉండి అక్కడ జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌.. కాలేయం నుంచి వచ్చే కాలేయ రసాలు బైల్‌ యాసిడ్స్‌, క్లోమం నుంచి వచ్చే ఎన్‌జైమ్‌లు అన్ని కూడా ఈ ఆహారంతో కలుస్తాయి. ఈ ప్రాసెస్‌ అంతా జరగడానికి జీర్ణాశయం నుంచి మన ఆహారం బయటకు వెళ్లడానికి 6 గంటల సమయం పడుతుంది. జీర్ణాశయం నుంచి ఆహారం కిందకు వెళ్తేనే మరలా మనకు ఆకలి వేసినట్టు అనిపిస్తుంది. కానీ అక్కడే మనం పప్పులో కాలేస్తాం. అసలైన జీర్ణ వ్యవస్థ.. అసలైన ఆహారం జీర్ణం కావడం 6 గంటల తర్వాతే ప్రారంభమవుతుంది. దీనిని ఇంటర్‌ డైజెస్టివ్‌ ఫేస్‌ అని అంటారు. ఈ ఆహారం జీర్ణకోశం నుంచి కిందకు వెళ్లిన తర్వాత దాదాపు 3 మీటర్ల పొడుగున ఉండే చిన్న ప్రేగుల ద్వారా వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన ఆహారంలో ఉన్న పదార్థాల్ని గ్లూకోజ్‌ గానూ ప్రోటీన్‌ లాగానే విభజించి వాటిని చిన్న ప్రేగులలో ఉన్న విల్లై ద్వారా అబ్సార్బ్‌ చేసుకొని అవి మరలా బ్లడ్‌లో కలిసి లివర్‌కు వెళ్లి కొంత స్టోర్‌ అయ్యి మనకు శక్తిని ప్రసాదిస్తాయి. తరువాత మిగిలిన వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగులోకి వెళ్లి వీలైనంత నీటిని పీల్చుకొని విసర్జన జరుగుతుంది. ఇలా జీర్ణం కావడానికి మొత్తం 24 గంటల సమయం పడుతుంది. మన శరీరానికి కావలసిన శక్తిని ప్రసాదించేది ఇంటర్‌ డైజెస్టివ్‌ ఫేస్‌ అనే 16 గంటల సమయమే.. మనం చాలామంది జీర్ణకోశంలో ఆహారం ఉంటేనే మనకి శక్తి వస్తుంది అని అనుకుంటాం అది తప్పు. మరి ఈ మధ్య కాలంలో ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేస్తే హార్ట్‌ స్ట్రోక్స్‌ వస్తాయంటూ వైరల్‌గా మారింది. దీన్ని వైద్యులు కొట్టిపారేశారు. చైనాలో ఓ 200 మందికి ఫోన్‌ చేసి ప్రశ్నలడిగి, అవే ప్రశ్నలు అమెరికాలో ఉండే 200 మందికి అడిగి ఇక గుండె జబ్బులు వస్తాయి అంటున్నారని.. కానీ వాస్తవానికి దీనికి ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు జతపరచలేదని.. ఇది ఒక బేసిక్‌ స్టడీ మాత్రమే కానీ దీనికి ఎటువంటి ప్రామాణికత లేదంటున్నారు. బాగా గమనించినట్లయితే చాలా జంతువులు, పక్షులు అన్నీ కూడా ఒక పూటనే తింటాయని.. మనుషుల మాదిరి చాలాసార్లు తినవంటున్నారు. తక్కువసార్లు తినడం వల్ల జీర్ణ వ్యవస్థకు కొంచెం గ్యాప్‌ ఇవ్వడం వల్ల పేగులలో ఆహారం బాగా జీర్ణమయ్యి ఇంకా బాగా శరీరంలోకి అబ్సార్బ్‌ అవుతుంది అంటున్నారు. అందుకే ఇంటర్మిటెంట్‌ ఫాస్టింగ్‌ అనేది నిజంగా ఫాస్టింగ్‌ కాదని మామూలుగా చేయాల్సిన పనే అంటున్నారు. అది కాకపోతే మనం ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకున్నాం. శరీర నిర్మాణంలో జీర్ణాశయం అనేది ఒక స్టోరేజ్‌ పాయింట్‌. పాత కాలంలో ఆహారం సదా దొరకదు. కాబట్టి మనకు జీర్ణాశయం అనేది పరిణామ క్రమంలో డెవలప్‌ అయింది. అనగా మనం ఆహారాన్ని ఒకేసారి తీసుకొని దానిని నిదానంగా కిందికి పంపిస్తూ జీర్ణం జరగడానికి అలవాటు పడిపోయాం.  


బార్లీ వాటర్‌ తాగడం నేర్చుకోండి

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS): రోజూ బార్లీ వాటర్‌ తాగడం వల్ల వివిధ రకాల వ్యాధులను దూరం చేసుకోవచ్చు. అవసరమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. బార్లీలో నీటిలో కరిగే, కరగని ఫైబర్‌, విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, మెగ్నీషియం, జింక్‌, కాపర్‌ మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బార్లీ నీరు మూత్రనాళం, మూత్రాశయం వంటి ప్రాంతాలలో ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. బార్లీ వాటర్‌లోని మూత్రవిసర్జన లక్షణాలు దీనికి సహాయపడతాయి. యూరినరీ ట్రాక్ట్‌ ఇన్ఫెక్షన్‌ విషయంలో ఇన్ఫెక్షన్‌ తగ్గించేందుకు రోజూ బార్లీ వాటర్‌ తాగండి. బార్లీ నీటిలో అధిక మొత్తంలో ఫైబర్‌ ఉంటుంది. ఇది మంచి జీర్ణక్రియ, పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది. బార్లీలో ఉండే ఫైబర్‌ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎందుకంటే పీచు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచే అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. బార్లీలో ముఖ్యంగా బీటా-గ్లూకాన్‌ అని పిలిచే ఒక రకమైన కరిగే ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. బార్లీ వాటర్‌లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అనేక వ్యాధులను దూరం చేస్తాయి. బార్లీ నీటిలో తక్కువ గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెరగకుండా చేస్తుంది. మధుమేహం ఉన్న వ్యక్తులలో స్థిరమైన గ్లూకోజ్‌ స్థాయిలను నిర్వహించడానికి బార్లీ నీరు సహాయపడుతుంది. బార్లీ నీటిలో ఉండే పోషకాలు మూత్రపిండాలు, కాలేయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయని కొన్ని అధ్యయనాలు నివేదించాయి. ఇది కిడ్నీలో రాళ్లు మరియు మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను కూడా నివారిస్తుంది.

నిద్రలేమికి చెక్‌ పెట్టే ఆహారాలు?

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS):నిద్రలేమి కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి, అధిక రక్తపోటు, బలహీనమైన జ్ఞాపకశక్తి ఇంకా అలాగే దృష్టి లేకపోవడం వంటి సమస్యలకు ఖచ్చితంగా దారి తీస్తుంది.సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల చిరాకు, అలసట ఇంకా అలాగే మానసిక కల్లోలం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులని చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం నిద్రలేమి సమస్యకి చాలా ఈజీగా చెక్‌ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.యాపిల్స్‌లో ఫైబర్‌, నేచురల్‌ షుగర్స్‌ ఉంటాయి, ఇవి మన శరీరంలో బ్లడ్‌ షుగర్‌ని మెయింటెయిన్‌ చేయడానికి సహాయపడతాయి. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది.బొప్పాయిలో విటమిన్‌ సి, ఇ, ఫోలేట్‌ , పొటాషియం పుష్కలంగా ఉంటాయి. పొటాషియం కండరాలను రిలాక్స్‌ చేస్తుంది. ఇందులో పాపైన్‌ అనే ఎంజైమ్‌ కూడా ఉంటుంది, ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియ వల్ల నిద్ర కూడా మెరుగుపడుతుంది. నారింజ అనేది యాంటీ ఆక్సిడెంట్లకు పెట్టింది పేరు. అలాగే ఇందులోని విటమిన్‌ సి నిద్రలేమి నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఒత్తిడిని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతంది.అలాగే విటమిన్‌ సి పుష్కలంగా ఉండే కివిలో సెరోటోనిన్‌ ఇంకా పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడానికి, నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి.అలాగే చెర్రీలు కూడా నిద్రలేమి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. వీటిలోని మెలటోనిన్‌ అనే హార్మోన్‌, నిద్ర చక్రాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మంచి నిద్రకు ఈ హార్మోన్‌ చాలా అవసరం. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.అరటిపండ్లు విటమిన్‌ బి6, మెగ్నీషియం వంటి పోషకాలను కలిగి ఉండటం వల్ల నిద్రలేమి నుండి ఉపశమనం కలిగిస్తుంది.  

థైరాయిడ్‌ తగ్గాలంటే ఇవి తినాల్సిందే?

 

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS):ఈ రోజుల్లో చాలా మందిని కూడా ఎంతగానో వేధిస్తున్న సమస్య థైరాయిడ్‌.ఈ సమస్య ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంది.ఇది తీవ్రమైన జీవనశైలి వ్యాధి, ఇది చాలా కాలంగా సరైన ఆహారం ఇంకా నిశ్చల జీవనశైలిని అనుసరించడం వల్ల మహిళల్లో ఎక్కువగా వస్తుంది.పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైన, చాలా ప్రయోజనకరమైన పానీయం. అందుకే ఖచ్చితంగా ప్రతిరోజూ కూడా పసుపు పాలు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న ఈ పానీయం థైరాయిడ్‌ గ్రంథి వాపును ఎంతో తగ్గిస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత కూడా మెరుగుపడుతుంది.చమోమిలే టీ, గ్రీన్‌ టీ, అల్లం టీ, ఫెన్నెల్‌, జీలకర్ర, ఆకుకూరల వంటి కొన్ని హెర్బల్‌ టీలు తాగడం థైరాయిడ్‌ మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి శరీరంలో హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇంకా అంతేకాకుండా, ఇది ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అలాగే ఆకుకూరల రసంలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిలో చాలా ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల శరీరంలోని రక్తహీనత తొలగిపోయి రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. అదనంగా, అవి థైరాయిడ్‌ పనితీరును మెరుగుపరచడంలో లక్షణాలను మెరుగుపరచడంలో సహాయపడతాయి.బీట్‌రూట్‌, క్యారెట్‌ జ్యూస్‌లో విటమిన్‌ ఎ, బి, సి, ఐరన్‌, ఫోలిక్‌ యాసిడ్‌తో పాటు లైకోపీన్‌, ఫైటోన్యూట్రియెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ జ్యూస్‌ తాగడం వల్ల థైరాయిడ్‌ గ్రంధికి అవసరమైన పోషణ అందుతుంది. దాని పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఎన్నో ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉన్న మజ్జిగ ప్రేగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ప్రోబయోటిక్‌ గా ఉపయోగపడుతుంది. ఇది ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. థైరాయిడ్‌ పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.

మైగ్రేన్‌ తగ్గిపోవాలంటే..?


హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS): మైగ్రేన్‌ తగ్గిపోవాలంటే క్రమంగా కెఫిన్‌ తీసుకోవడం ఖచ్చితంగా తగ్గించాలి.ఎల్లప్పుడూ కూడా హైడ్రేటెడ్‌ గా ఉండాలి. అలాగే ఖచ్చితంగా ఎలక్ట్రోలైట్‌ బ్యాలెన్స్‌ను మైంటైన్‌ చేస్తూ ఉండాలి.ఇంకా అలాగే యోగా వంటి వ్యాయామాలు అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా సమయానికి నిద్రపోవాలి.అధిక ఉష్ణోగ్రతలు గాలి నాణ్యతను మరింత దిగజార్చుతాయి. ఇది కాలుష్యం, అలెర్జీ కారకాలకు దారితీస్తుంది. కొంతమందికి ఈ వాతావరణ మార్పు సైనస్‌ తలనొప్పిని ప్రేరేపిస్తుంది. మైగ్రేన్‌ పరిస్థితులను తీవ్రతరం చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. మైగ్రేన్‌ రిస్క్‌ తగ్గాలంటే కొన్ని ఆహారాలు, పానీయాలు మానుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కార్బోనేటేడ్‌ డ్రిరక్స్‌, ఎనర్జీ డ్రిరక్స్‌ ఇంకా కాఫీ మైగ్రేన్‌లను తీవ్రతరం చేస్తాయి. కొంతమందికి వేసవిలో మైగ్రేన్‌లు ఎక్కువ అవుతాయి. ఇది ప్రధానంగా అధిక ఉష్ణోగ్రత, తేమ, పగటిపూట సూర్యరశ్మికి గురికావడం వంటి కారణాల వల్ల జరుగుతుంది. కెఫీన్‌ కొందరిలో మైగ్రేన్‌లను మరింత తీవ్రతరం చేస్తుంది. కెఫిన్‌ కలిగిన పానీయాల వినియోగం వల్ల మైగ్రేన్‌లు, తేలికపాటి నిర్జలీకరణంపై ప్రత్యక్ష ప్రభావం వల్ల తలనొప్పి రావచ్చు. సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ లేదా పెస్టిసైడ్స్‌లోని కొన్ని రసాయనాలు వాటి బలమైన సువాసనల కారణంగా మైగ్రేన్‌ బాధితులలో తలనొప్పిని ప్రేరేపిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వేసవి కాలంలో తలనొప్పులు రావడానికి ప్రధాన కారణం ఉష్ణోగ్రతలు పెరగడమే అంటున్నారు వైద్యులు. డీహైడ్రేషన్‌ మైగ్రేన్‌లకు కారణమవుతుంది. విపరీతమైన వేడి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. మీరు ఉపశమనం కోసం మాత్రను తీసుకునే ముందు మీ శరీరం బాగా హైడ్రేట్‌ అయ్యిందని నిర్ధారించుకోండి. అప్పుడు నీరు పుష్కలంగా తాగాలి. ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోకుండా ఉండటానికి నిమ్మకాయ నీటిలో ఉప్పు కలుపుకుని తాగితే మంచిది.మైగ్రేన్‌ సమస్య చాలా మందిని కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతుంది. వేసవి కాలంలో మైగ్రేన్‌ బాధితుల సంఖ్య పెరుగుతుందని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. వేసవి కాలంలో మైగ్రేన్లు మరింత తీవ్రమవుతాయి కాబట్టి ఖచ్చితంగా పైన పేర్కొన్న జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించండి.


బేబీ కార్న్‌ ఉపయోగాలు...

హైదరాబాద్, డిసెంబర్‌ 19 (SNM NEWS):సాధారణంగా మనం స్వీట్‌ కార్న్‌, మొక్కజొన్నలు వంటివి చూస్తూనే ఉన్నాము. అయితే బేబీ కార్న్‌ అనేది కూడా చాలా రుచికరమైనవే.. ఇవి పూర్తిగా ఆకులతో చుట్టబడినట్టుగా ఉంటాయి. పురుగుమందుల ప్రభావం కూడా పెద్దగా ఉండదు.. బేబీ కార్న్‌ లో ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్స్‌, క్యాల్షియం, విటమిన్‌ ,ఐరన్‌ వంటివి చాలా సమృద్ధిగా లభిస్తాయి. ఇందులో ఎలాంటి కొవ్వు లేకుండా ఫైబర్‌ కంటెంట్‌ మాత్రమే పుష్కలంగా లభిస్తుంది. ఇందులో కూడా చాలా తక్కువ క్యాలరీలు కలిగి ఉంటుంది. దీనివల్ల గుండె ఆరోగ్యంగా ఉండేలా సహాయపడుతుంది. బేబీ కార్న్‌ అనేది యాంటీ ఆక్సిడెంట్‌ పవర్‌ హౌస్గా పిలుస్తారు. ఇది రోగనిరోధక వ్యవస్థను సైతం వెంటనే అందించడానికి సహాయపడతాయి. బేబీ కార్న్‌ మంచి ఆరోగ్యాన్ని కూడా కాపాడడానికి అవసరమైన సమయాలలో విటమిన్స్‌ ఖనిజాలు కూడా అందిస్తాయి. బేబీ కార్లలో డయాబెటిస్‌ ఉన్న వ్యక్తులకు తినడం వల్ల రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిలను కూడా పెరగకుండా చేస్తుంది. జీర్ణ క్రియ సమస్యలతో ఇబ్బంది పడేవారు.. ఇది ఒక దివ్య ఔషధంలా పనిచేస్తుంది. బేబీ కార్న్ల ఎక్కువగా ఫైబర్‌ కంటెంట్‌ ఉండడం వల్ల జీర్ణక్రియలో సహాయపడతాయి. సాధారణ ప్రేగు కదలికలను కూడా ప్రోత్సహించడానికి అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ బేబీ కార్న్‌ చాలా మంచిది. బేబీ కార్న తినడం వల్ల చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందట. ఇందులో విటమిన్‌-%ష% పుష్కలంక లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు చర్మ కణాలను సైతం పునరుద్ధరించడానికి ఉపయోగపడతాయి.. చర్మం మృదువుగా కనిపించిన కొలెస్ట్రాల్‌ తగ్గాలంటే వీటిని తినాల్సిందే. ఇందులో ఉండేటువంటి ఫైబర్‌ కొలెస్ట్రాలను సైతం తగ్గించడానికి ఉపయోగపడుతుందట. బేబీ కార్న్‌ లో కెరోటి నాయుడులు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. బేబీ కార్న్‌ లో పొటాషియం మరియు ఫైబర్‌ కలయిక ఉండటం వల్ల రక్తపోటును కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.

సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

 

సంగారెడ్డి, డిసెంబర్‌ 19 (SNM NEWS): సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ గాయత్రి, డాక్టర్ పరుశురాం, డాక్టర్ విష్ణు, ఇన్‌చార్జి నర్సింగ్ తేజ సిస్టర్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ సందేశాన్ని అందరికీ పంచుతూ, సేవా భావనతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని వైద్యులు వెల్లడించారు.

Thursday, December 18, 2025

జి హెచ్ ఎం సి పరిధిలో విలీనమైన ప్రాంతాల ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24శాతం హెచ్ ఆర్ ఏ వర్తింపజేయాలి -జిల్లా కలెక్టర్‌కు పిఆర్ టియు టి ఎస్ వినతి

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS):

సంగారెడ్డి జిల్లా పరిధిలో జి హెచ్ ఎం సి లో నూతనంగా విలీనమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 24 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ ఆర్ ఏ) వర్తింపజేయాలని కోరుతూ పిఆర్ టియు టి ఎస్ సంగారెడ్డి జిల్లా శాఖ గౌరవ జిల్లా కలెక్టర్ ఎ.ప్రావీణ్య కి వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 27 మున్సిపాలిటీలను జి హెచ్ ఎం సి పరిధిలోకి విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీలు జి హెచ్ ఎం సి పరిధిలోకి వచ్చాయని పిఆర్ టియు టి ఎస్ జిల్లా అధ్యక్షులు ఎ.మాణయ్య తెలిపారు. జి హెచ్ ఎం సి పరిధి విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో, 8 కిలోమీటర్ల పరిధిలో విలీనమైన గ్రామాలు, పట్టణాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని మూల వేతనంపై 24 శాతం హెచ్ ఆర్ ఏ తో పాటు అర్హులైన వారికి సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ (సి సి ఏ) కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఎ.ప్రావీణ్య, అంశాన్ని సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. స్టేజ్-2 అధికారులకు అందుతున్న అతి తక్కువ రెమ్యునరేషన్ అంశాన్ని తమ దృష్టికి తీసుకురాగా, వారికి అదనంగా రూ.1,000 చెల్లించనున్నట్లు కూడా కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రతినిధ్య కార్యక్రమంలో పటాన్‌చెరు మండల శాఖ అధ్యక్షులు ఎం.విఠల్ రెడ్డి, రామచంద్రాపురం మండల శాఖ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, అమీన్‌పూర్ మండల శాఖ అధ్యక్షులు ఆనంద్, జిన్నారం మండల శాఖ ప్రధాన కార్యదర్శి పవన్ రాజ్, రాష్ట్ర బాధ్యులు త్రిశూల్, మొగులయ్య, బ్రహ్మ ఋషి, రామకృష్ణారెడ్డి, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

చట్టబద్ద ఉపాధి హమి పని హక్కును హరించే రోజ్ గార్ బిల్లు ను ఉపసంహరించుకోవాలి -డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

 

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 ను రద్దు చేసే ఉద్దేశంతో ప్రతిపాదించిన  వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025' (విజి బి రామ్ జి) ను నరెగా సంఘర్ష్ మోర్చా,డిబిఎఫ్ లు  తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్  జాతీయ కార్యదర్శి పి.శంకర్ చెప్పారు.శుక్ర వారం నాడు సంగారెడ్డి లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ కార్మికులతో గానీ, కార్మిక సంఘాలతో గానీ ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ప్రవేశపెట్టిన ఈ బిల్లు, చట్టబద్ధమైన హక్కుల ఆధారిత వ్యవస్థను, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి జవాబుదారీతనం లేని బడ్జెట్ పరిమితులతో కూడిన ఒక సాధారణ పథకంగా మార్చేస్తుందన్నారు.ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసహంహరించుకొవాలని డిమాండ్ చేశారు.. కేంద్రానికి మితిమీరిన విచక్షణాధికారం.నరేగ  అనేది డిమాండ్ ఆధారితమైనది. సార్వత్రికమైనదని  అంటే, గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరికైనా పని కల్పించాల్సిన బాధ్యత చట్టం కల్పిస్తుందన్నారు.. కానీ, కొత్త విబి జి రామ్ జీ బిల్లులోని సెక్షన్ 5(1) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే నైపుణ్యం లేని పని చేయడానికి ముందుకొచ్చే కుటుంబాలకు 125 రోజులకు తగ్గకుండా గ్యారెంటీ పనిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని దీనర్థం ఒకవేళ కేంద్రం ఏదైనా ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతంగా  నోటిఫై చేయకపోతే ఆ ప్రాంత ప్రజలకు పని హక్కు ఉండదన్నారు. ఇది సార్వత్రిక ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై నడిచే ఒక సాధారణ పథకంగా దిగజార్చుతుందన్నారు. విబి జి రామ్ జి  బిల్లు అనేది సంస్కరణ కాదు, దశాబ్దాల పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల తిరోగమన్నారు. చట్టబద్ధమైన హక్కును తొలగించి కేంద్రం నియంత్రణలో బడ్జెట్ పరిమితులతో  నిఘా నీడలో నడిచే ఒక పథకంగా మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తోందన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, 73వ రాజ్యాంగ సవరణను అవమానించడమేనని, ఇది అధికారాన్ని కార్మికులు, గ్రామ సభలు, రాష్ట్రాల చేతుల్లోంచి లాక్కుని కేంద్రం చేతుల్లో పెడుతుందన్నారు. నరేగ సంఘర్ష్ మోర్చా ,డిబిఎఫ్ విబిజి రామ్ జి బిల్లు, 2025ను ఏకగ్రీవంగా తిరస్కరిస్తోందన్నారు. దీనిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి సంఘాల అనుమతి లేకుండా యంజిఎన్అర్ జిఎ ను రద్దు చేసే లేదా మార్చే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని, గ్రామీణ కార్మికుల జీవనోపాధికి మూలస్తంభమైన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి, ఈ ఏకపక్ష నిర్ణయాలను ప్రతిఘటించాలని మేము అన్ని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి మహిళ విభాగం రాష్ట్ర  అధ్యక్షురాలు ఆర్.లక్ష్మీ,  సామాజిక కార్యకర్తలు బంగారయ కృష్ణ,గీత, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కారించాలి -టిజెయు జిల్లా అధ్యక్షులు ఎం.గిరి


సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సమాజానికి కళ్లూ, చెవులుగా వ్యవహరించే జర్నలిస్టులు నేడు అనేక సమస్యల మధ్య పని చేస్తున్నారని  జర్నలిస్టుల సమస్యలు పరిష్కరంచటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం సరైయిoది కాదని తెలంగాణ జెర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.గిరి పేర్కొన్నారు. గురువారం టి జె యు నూతన కమిటీ జిల్లా కలెక్టర్ కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జెర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడంలో విఫలమవుతున్నాయని తెలిపారు.రాష్ట ప్రభుత్వo  ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేది జెర్నలిస్టులే నన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధుల సమస్యలు పరిష్కారమైతేనే పారదర్శక, బాధ్యతాయుత పాలన సాధ్యమవుతుందిని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ (టీజెయు) సంగారెడ్డి జిల్లా కమిటీ జర్నలిస్టుల సమస్యలపై తక్షణ జోక్యం చేసి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం  సమర్పించా మని పేర్కొన్నారు..ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలు, పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోరువ చూపకపోవడం విచారకరమన్నారు.  ప్రభుత్వ అధికారుల పనితీరును నిత్యం ప్రజలకు తెలియజేస్తున్నారు. జర్నలిస్టులు భద్రతా లోపం, ఆర్థిక అస్థిరత, ఆరోగ్య సమస్యలు, ప్రభుత్వ అధికారుల సహకారం  లభించటం లేదన్నారు. జెర్నలిస్ట్ సమస్యల లేమితో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లాబ్ ఉన్నా జెర్నలిస్టలకు ప్రయోజనo లేదన్నారు. గడిచిన 20 ఏండ్ల నుంచి ఏ ఒక్క జెర్నలిస్ట్ ఉపయోగపడలేదన్నారు. వేంటనే జెర్నలిస్టులకు ఉపయోగ పడేలా చెర్యలు చేపట్టాలన్నారు. ఒకే వర్గం ఆధిపత్యం లో ఉండటం సరి కాదన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చెర్యలు చేపట్టాలని కోరడం జరిగిందన్నారు.జర్నలిస్టులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, జర్నలిస్టు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, నివాస స్థలాల కేటాయింపు, వెంటనే కల్పించాలన్నారు.నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ వంటి కీలక డిమాండ్లను ప్రస్తావించారు. నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రెస్ క్లబ్ చైర్మన్ సమర్థంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని వెంటనే తగిన చెర్యలు చేయట్టాలని పేర్కొన్నారు. అక్రిడేషన్  కమిటీ లో టి జె యు యూనియన్ అవకశాo కల్పించాలన్నారు.  జర్నలిస్టుల సమస్యలు కేవలం సంక్షేమ సదుపాయాలకు మాత్రమే పరిమితం కాకుండా, వారి వృత్తి గౌరవం, ఆత్మగౌరవానికి సంబంధించినవని టీజెయు స్పష్టం చేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే అది పరోక్షంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా వార్తలు రాయాలంటే వృత్తి భద్రత అత్యంత కీలకమని పేర్కొంది.అందుకే జిల్లా యంత్రాంగం ఈ వినతిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సంగారెడ్డి జిల్లా టీజెయు కమిటీ చేసిన ఈ ప్రయత్నం జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తయని ప్రభుత్వ చెర్యలు కూడిన పాలన, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక. అప్పుడు మాత్రమే ప్రజల తరఫున నిలబడే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని టీజెయు కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు నిజంగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడానికి, జిల్లా కలెక్టర్ వెంటనే   స్పందించి చెర్యలు చేపపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ (టీజెయు), సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శివకుమార్ పోచగౌడ్ మహేష్ గౌడ్ కార్య వర్గ సభ్యులు రాజేష్, గణేష్ జావీద్ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ నిర్మూలన పై కళా ప్రదర్శన సాంస్కృతిక సారథి కళాజాత

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య  ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని విజయలక్ష్మి  పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో కళా ప్రదర్శన నిర్వహించారు. చదువు యొక్క ప్రాముఖ్యత, డ్రగ్స్, మూఢనమ్మకాల నిర్మూలన, పచ్చదనం పరిశుభ్రత వంటి తదితర అంశాలపై కళారూపాలతో అవగాహన కల్పించారు. యువత విద్యార్థులు గంజాయి డ్రగ్స్ వంటి ద్రవ్యాలకు అలవాటు పడకూడదని తెలిపారు. డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్ధాలను వివరించారు. విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రుల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చదువు వలన సమాజంలో మంచి గుర్తింపు హోదా గౌరవం లభిస్తాయని వివరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని అన్నారు. అప్పుడే అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటారని తెలియజేశారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని సూచించారు. బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలని కోరారు. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ హెపటైటిస్ వంటి జబ్బులు రాకుండా ఉండాలంటే గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చడం వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కళాకారులు ఎ. సునీల్ కుమార్, డి. రమేష్, ఎస్. మల్లేష్, జి. బిక్షపతి, బి. నవీన్ కుమార్, ఎన్. రవిందర్, పి. సంధ్య పాల్గొన్నారు.

ఉపాధి హామీని నిర్వీర్యం చేసే బిల్లును రద్దు చేయాలి -సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు

 


సంగారెడ్డి ప్రతినిధి, డిసెంబర్ 18 (SNM NEWS):
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం - 2005ను నిర్వీర్యం చేస్తూ తీసుకువచ్చిన వీబీ-జిఆర్ఎఎంజి- 2025 (197) బిల్లును తక్షణమే రద్దు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 19, 20 తేదీల్లో ప్రతి గ్రామంలో బిల్లు ప్రతులను దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.నేడు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 'వికసిత్ భారత్-2047' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త బిల్లు అమలులోకి వస్తే.. ఉపాధి హామీ చట్టం తలలేని మొండెంలా మారుతుందని తీవ్రంగా విమర్శించారు. పనిదినాలను 125 రోజులకు పెంచుతున్నట్టు చెప్పి, 60 రోజులు పనులపై నిషేధం విధించడం ద్వారా కార్మికులను మోసం చేస్తున్నారని, ఇప్పటి వరకు ఉపాధి హామీ నిధుల్లో కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం వాటా ఉండేదని, కొత్త బిల్లులో రాష్ట్రాలపై 40 శాతం భారం మోపడం ద్వారా చట్టాన్ని ఎత్తివేయాలన్న ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పనులను నాలుగు విభాగాలుగా చేసి కోట్ల రూపాయల పనులను యంత్రాలు, కాంట్రాక్టర్లకు అప్పగించడమే ఈ బిల్లుకు అసలైన ఉద్దేశమని విమర్శించారు. కేంద్రం నిర్ణయించిన వేతనాల కంటే రాష్ట్రాల్లో ఎక్కువ వేతనాలు ఉంటే అవే కనీస వేతనాలుగా ఉండాలన్న నిబంధనను కొత్త బిల్లులో రద్దు చేశారని, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వేతనాలు పెంచే విధానాన్ని తొలగించారని పేర్కొన్నారు.. ఆధార్, బయోమెట్రిక్, ఏఐ, జీపీఎస్లలను చట్టబద్ధం చేయడం ద్వారా పేదలను ఉపాధి హామీ నుంచి తప్పించాలన్న ప్రయత్నమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు పంచాయతీలకు ఉన్న ప్రధాన పాత్రను తొలగించి, అన్ని అధికారాలను కేంద్రానికి కట్టబెట్టడం, సోషల్ ఆడిట్ను కూడా మనుషులు కాకుండా టెక్నాలజీతో చేయాలనడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల భూముల అభివృద్ధి, కాలనీలు, నివాస ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడిన ఉపాధి హామీ నిధుల ప్రస్తావన కూడా కొత్త బిల్లులో లేకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామాల్లో ఉపాధి పనిదినాలు తగ్గిపోవడంతో పేదలు జీవించలేని పరిస్థితి నెలకొందని, ఉన్న ఉపాధిని కూడా హరించే ఈ బిల్లును పూర్తిగా రద్దు చేసి, పాత చట్టాన్నే కొనసాగించాలని డిమాండ్ చేశారు.


సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన లింగంపల్లి సర్పంచ్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ సర్పంచ్ ఇర్ఫాన్ పటేల్ శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండుతూ వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్‌కు సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా గ్రామాభివృద్ధికి సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్. వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్, విఠల్, మసుధ్, ముజీప్, మాజీ వైస్ ఎంపీపీ బాబా పటేల్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆఫ్సార్, సంపత్, మతిన్, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.

కంబాలపల్లిలో తొట్టెల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి – కరుణశ్రీ దంపతుల రెండవ కుమార్తె తొట్టెల కార్యక్రమం శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్తో కలిసి హాజరై శిశువుకు ఆశీస్సులు అందజేసి, శ్రీహరి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నారి ఆయురారోగ్యాలతో పెరిగి కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీహరి కుటుంబం సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ తొట్టెల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ద గొల్ల మల్లమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, వార్డు సభ్యులు ఖలీల్, అనసూయ, బాబు, అంజిరెడ్డి, అలాగే శ్రీశైలం, మల్లేశం, పాండు, జానీ మియా తదితర గ్రామ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి డా. అల్లాని కిషన్ రావు పేరు పెట్టాలి -తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఇరిగిజ్జ మురళీ కృష్ణ డిమాండ్

 

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్‌చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అల్లాని కిషన్ రావు  సేవలను గుర్తిస్తూ, నూతనంగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆయన పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి, జనం బాట – సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఇరిగిజ్జ మురళీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్‌చేరు అంటే పరిశ్రమలు, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కోసం న్యాయస్థానాల దాకా పోరాడి, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్ జి టీ) తీర్పు ద్వారా పరిశ్రమల నుంచి సి ఎస్ ఆర్ నిధులు సాధించడంలో దివంగత డా. అల్లాని కిషన్ రావు కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన నిరంతర పోరాట ఫలితంగానే వందల కోట్ల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో పటాన్‌చేరు ప్రాంతంలో నూతన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. పటాన్‌చేరు ప్రాంతంలోనే జన్మించిన డా. అల్లాని కిషన్ రావు పదవి, పేరు కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం నిజాయితీగా పోరాడిన మచ్చలేని నాయకుడని మురళీ కృష్ణ అన్నారు. అలాంటి వ్యక్తి పేరును ఆస్పత్రికి పెట్టడం ద్వారా ఆయన సేవలకు తగిన గౌరవం లభించడమే కాకుండా, రాబోయే తరాలకు ప్రజల కోసం పోరాడితే మార్పు సాధ్యమనే సందేశం అందుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పటాన్‌చేరు ప్రజల తరపున  కల్వకుంట్ల కవిత  సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయగా, తెలంగాణ జాగృతి నాయకులు కలెక్టర్‌ను కలిసి ఆ లేఖను స్వయంగా అందజేశారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ ప్రతిపాదనను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్ మిశ్రా, బస్తెపురం పోచయ్య, మేధావుల ఫోరం నాయకులు రెడ్డిబోయిన భిక్షపతి పాల్గొన్నారు.

డిసెంబర్ 21న జరుగనున్న జాతీయ మెగా లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి..

సంగారెడ్డి ప్రతినిధి (SNM NEWS): ఈ నెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్-అదాలత్ ను ఊదేశించి జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడవచ్చు అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, రాజీ కుదుర్చుకోవడం ద్వారా ఇరు వర్గాలు గెలుపొందినట్లు అవుతుంది అన్నారు. ఈ నెల 21 ఆదివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించడం జరిగింది.  ఎస్.హెచ్.ఓ లు, కోర్ట్ డ్యూటి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు,  వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం అన్ని కేసులలో ఇరువర్గాల సమ్మతితో రాజీపడేలా చూడాలని అన్నారు.  సైబర్ నేరాలకు సంభందించి, సైబర్ మోసగాళ్ల చేతిలో  బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరగా భాదితులకు అందే విధంగా చూడాలని, 25 వేల రూపాయల కంటే తక్కువ డబ్బు కోల్పోయిన కేసులలో లోక్-అదాలత్ ద్వారా ఫిర్యాదు తీసుకొని, ఎఫ్ఐఆర్ లేకుండానే రీఫండ్ ప్రక్రియా చేయాలని అధికారులకు సూచించడం జరిగింది.  ఈ నెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం అయ్యేలా అధికారుల నుండి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు భాద్యత యుతంగా వ్యవహరించి, రాజీ పడదగిన అన్ని కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలన్నారు.

చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం, మంటలు ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 18 (SNM NEWS): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న 52 అంతస్తుల భారీ భవనం కన్స్ట్రక్షన్ సైట్‌లో గురువారం  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం పక్కనే కన్స్ట్రక్షన్ కూలీల కోసం ఏర్పాటు చేసిన షెడ్‌లలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కన్స్ట్రక్షన్ సైట్‌లో నివసిస్తున్న కూలీల షెడ్‌లలో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ శాఖ అధికారులు అప్రమత్తమై మూడు ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పే క్రమంలో మరికొన్ని సిలిండర్లు పేలినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం మూడు సిలిండర్లు పేలినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రమాద సమయంలో కూలీలందరూ పనులకు వెళ్లి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.



Wednesday, December 17, 2025

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన నూతన సర్పంచ్ లు

సంగారెడ్డి, డిసెంబర్ 17 (SNM NEWS): గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇరిగిపల్లి గ్రామ సర్పంచ్ సుప్రియ - సతీష్, గుంతపల్లి సర్పంచ్ అనంత రెడ్డి లు  ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చంతో సత్కరిచి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు... రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి విజేందర్ రెడ్డి ఆర్.వెంకటేశ్వర్లు, పీ.నర్సింలు ,మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, సందీప్, జలంధర్ , పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య


సంగారెడ్డి, డిసెంబర్ 17 (SNM NEWS): జిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవ్వడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అంకితభావంతో పనిచేసిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది, పోలీస్ శాఖ, రవాణా శాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల అధికారుల సహకారం అభినందనీయమని తెలిపారు. అలాగే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా సహకరించిన  అభ్యర్థులు, మీడియా ప్రతినిధులకు శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు కలెక్టర్  కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య పండుగగా నిలిచిన గ్రామ పంచాయతీ ఎన్నికలనువిజయవంతంగా పూర్తిచేయడంలో అందరి సహకారం కీలకమైందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఇంద్రేశంలో కార్యక్రమాల సమాచారం కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడం లేదు: ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి

 

పటాన్ చెరు, డిసెంబర్ 17 (SNM NEWS): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులకు కమిషనర్, అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని పటాన్ చెరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మున్సిపల్ కమిషనర్, అధికారులు ఎలాంటి సమాచారం అందించడం లేదని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారంతో ప్రజలకు సరైన సమాచారం చేరడంలో అంతరాయం కలుగుతుందని, అలాగే ప్రజాప్రతినిధుల పాత్రను తగ్గించినట్లుగా భావించాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, అధికారులు భవిష్యత్తులో ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో జరిగే కార్యక్రమాలకు సంబంధిత నాయకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని మన్నె లక్ష్మి డిమాండ్ చేశారు.

ఢిల్లీ టూర్ విజయవంతంగా ముగించుకుని వచ్చిన సంగారెడ్డి జిల్లా బిసి జేఏసీ బృందం

సంగారెడ్డి డిసెంబర్ 16 (SNM NEWS):  బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు తెలంగాణబీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్  కృష్ణయ్య  ఢిల్లీలో బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ భవన్లో గల అంబేద్కర్ ఆడిటోరియంలో 10  డిసెంబర్  రోజున సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి సంగారెడ్డి నుండి బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడు, అధ్యక్షతన వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, కో కన్వీనర్ సుధాకర్ గౌడ్, ఇట్టి సమాజంలో పాల్గొన్నారు.  ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు నాగరాజు అంబిక లక్ష్మీనారాయణ,  బీరంమస్తాన్ రావు, సత్యనారాయణ, రవిచంద్ర , పాల్గొని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సంఘీభావం తెలిపారు పార్లమెంటు ప్రైవేట్ బిల్లు పెట్టడానికి ఆమోదం తెలిపారు ప్రభు గౌడ్ మాట్లాడుతూ బీసీలకు42 శాతం రిజర్వేషన్ కచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమూలన బీసీల దక్కాల్సిన ఫలాలుదక్కడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో బీసీలకు సరియైన రిజర్వేషన్ ఇవ్వని కారణంగా సాయి ఈశ్వర చారి అనే సంగారెడ్డి యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నాడని ఆయన కుటుంబానికి ఎవరు దిక్కు అని ప్రశ్నించారు, ఇకపై యువకులు ఎలాంటి బలిదానాలు చేసుకోకూడదని కోరారు, సాయి ఈశ్వర చారి కుటుంబానికి కోటి రూపాయలు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగి ఇవ్వాలని అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన  బిసి జేఏసీ సమావేశంలో పాల్గొన్నవారు.  బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడు, వైస్ ఛైర్మన్ కుమ్మరి సాయిలు, వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, సుదర్శన్ గౌడ్, కో కన్వీనర్లు రాగులపల్లి లక్ష్మి, సుధాకర్ గౌడ్, నాగరాణి యాదవ్,  వడ్లలత మానస లతగౌడ్,  ఎం కొండయ్య, పాండ్ రంగం, గౌలిఈశ్వర్, శ్రీనివాస్, రాందాస్, నాగభూషణం, నాయి సుభాష్ రామ్ చందర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, December 16, 2025

రూ.118కోట్ల విద్యుత్ బకాయిలు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయమూర్తి..!

 


సంగారెడ్డి, డిసెంబర్ 16 (SNM NEWS): గీతం డీమ్డ్ యూనివర్సిటీ బకాయిలపై తెలంగాణ విద్యుత్శాఖ అధికారులపై హైకోర్టు మండిపడింది. సామాన్యులు రూ.1000 బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా.. ఎందుకు వసూలు చేయలేదంటూ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్  బకాయిలపై తెలంగాణ విద్యుత్శాఖ అధికారులపై హైకోర్టు మండిపడింది. సామాన్యులు రూ.1000 బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా.. ఎందుకు వసూలు చేయలేదంటూ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి హైదరాబాద్లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని ఎస్పీడీసీఎల్ నోటీసులు పంపింది. 2008 నుంచి ఇప్పటి వరకు రూ.118కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదంటూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఎస్పీడీసీఎల్ నోటీసులను గీతం యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, యూనివర్సిటీ దాఖలు చేసిన జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్ 2008 నుంచి బిల్లులు చెల్లించకపోవడంతోపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు రూ.1000 బిల్లు కట్టకపోతేనే కరెంట్ కనెక్షన్ను తొలగిస్తున్నారని.. అలాంటిది యూనివర్సిటీకి మాత్రం ఎందుకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించారని ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని.. సూపరింటెండెంట్ ఇంజినీర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. పిటిషన్పై విచారణను వాయిదా వేసింది.

*డాకూర్ గ్రామ ఉప సర్పంచ్‌గా పెద్దగొల్ల మురళి


 సంగారెడ్డి, డిసెంబర్ 16 (SNM NEWS): సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ గ్రామంలో ఉప సర్పంచ్ పదవికి పెద్దగొల్ల మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ సభ్యులు  మురళిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మురళి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన మాజీ జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తానని, డాకూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాకూర్, మాజీ సర్పంచ్ శంకరయ్య తమ్మల శీను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

నూతన సంవత్సర వేడుకలపై పోలీస్ మార్గదర్శకాలు – భద్రత అవసరమా? కఠినత అతిగా మారుతోందా?



- శాంతిభద్రతల పేరుతో నియంత్రణల పెరుగుదల

- పౌర స్వేచ్ఛ–ప్రజా భద్రత మధ్య సమతుల్యత అవసరం

- నిబంధనలు పాటించాలా? లేక భయ వాతావరణం సృష్టించాలా?

డెస్క్, డిసెంబర్ 16 (SNM NEWS):నూతన సంవత్సరం వేడుకలు అంటే ఉత్సాహం, ఆనందం, కొత్త ఆశల ప్రారంభం. కానీ ప్రతి ఏడాది డిసెంబర్ 31 దగ్గరపడగానే పోలీస్ మార్గదర్శకాలు, ఆంక్షలు, హెచ్చరికల జాబితాలు ముందుకు వస్తున్నాయి. స్టార్ హోటళ్లు, పబ్‌లు, క్లబ్బులు, రెస్టారెంట్లకు అనుమతులు, సీసీటీవీలు, శబ్ద నియంత్రణ, మద్యం పరిమితులు, డ్రంక్ డ్రైవింగ్ హెచ్చరికలు – ఇవన్నీ భద్రత కోసమేనని పోలీసులు చెబుతున్నారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఒకటే: ఇవన్నీ నిజంగా ప్రజల భద్రత కోసమేనా? లేక కఠినత అతిగా మారుతోందా? ప్రజా భద్రత ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత. గతంలో జరిగిన ప్రమాదాలు, డ్రంక్ డ్రైవింగ్ కేసులు, మహిళలపై నేరాలు, అల్లర్లు చూసినప్పుడు పోలీసుల అప్రమత్తత అర్థవంతమే. ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు అవసరమే. ఈ కోణంలో చూస్తే శబ్ద నియంత్రణ, సీసీటీవీ పర్యవేక్షణ, మత్తు పదార్థాలపై కఠిన చర్యలు సమంజసంగానే కనిపిస్తాయి.

కానీ సమస్య అక్కడ మొదలవుతోంది. నిబంధనలు భద్రత కోసం కాకుండా, భయాన్ని సృష్టించే స్థాయికి చేరితే పరిస్థితి మారుతుంది. ప్రతీ వేడుకను అనుమానంతో చూడటం, ప్రతి పౌరుడిని నేరస్థుడిలా భావించడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరమా అనే ప్రశ్న తలెత్తుతుంది. “రాత్రి 10 తర్వాత శబ్దం లేదు”, “1 గంట తర్వాత అన్నీ మూసివేయాలి”, “ప్రతి అడుగుకి కేసు” అన్న భావన ప్రజల్లో ఉత్సవ భావనను చంపేస్తోంది. ఇంకా ఒక ముఖ్యమైన అంశం ఆర్థిక ప్రభావం. హోటళ్లు, పబ్‌లు, ఈవెంట్ మేనేజర్లు ఈ నిబంధనల వల్ల భారీ నష్టాలను ఎదుర్కొంటున్నారు. ముందస్తు అనుమతులు, భద్రతా సిబ్బంది, సాంకేతిక ఏర్పాట్లు – ఇవన్నీ చిన్న, మధ్యస్థ వ్యాపారాలకు భారంగా మారుతున్నాయి. పెద్ద సంస్థలు తట్టుకోగలిగినా, చిన్న వ్యాపారాలు మాత్రం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇది ఉపాధి అవకాశాలపై కూడా ప్రభావం చూపుతోంది.

డ్రంక్ డ్రైవింగ్‌పై కఠిన చర్యలు అవసరమే. కానీ అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సమాంతరంగా ఉండాలి. “మద్యం తాగితే కేసు” అనే హెచ్చరిక సరిపోదు; సురక్షిత రవాణా సదుపాయాలు, క్యాబ్ సేవలు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రాత్రివేళల్లో అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఇది శిక్ష విధించే పాలనగా మాత్రమే మిగిలిపోతుంది.మహిళల భద్రత అంశంలో షీ టీమ్స్, పర్యవేక్షణ అవసరం. కానీ అదే సమయంలో మహిళలు కూడా స్వేచ్ఛగా వేడుకల్లో పాల్గొనే వాతావరణం ఉండాలి. భద్రత పేరుతో అనవసర జోక్యాలు, వేధింపులు జరిగితే, అది రక్షణ కాదు నియంత్రణగా మారుతుంది. భద్రత అనేది స్వేచ్ఛను కాపాడాలి, దాన్ని కుదించకూడదు.

ఇక్కడ సమతుల్యత కీలకం. ప్రజా భద్రత–పౌర స్వేచ్ఛ మధ్య సమతుల్యతే మంచి పాలనకు ప్రమాణం. కఠినత అవసరమైన చోట ఉండాలి, కానీ సాధారణ పౌరుడిని శత్రువులా చూడకూడదు. పోలీస్ శాఖ ప్రజలకు భద్రతా భాగస్వామిగా ఉండాలి, శిక్ష విధించే యంత్రాంగంగా మాత్రమే కాదు.నూతన సంవత్సరం వేడుకలు ఒక్కరోజు ఆనందం మాత్రమే కాదు; సమాజ మానసిక ఆరోగ్యానికి కూడా అవసరం. నియంత్రణలు అవసరమే కానీ అవి వివేకంతో ఉండాలి. భద్రతను సాధించాలంటే నిబంధనలు మాత్రమే కాదు, నమ్మకం కూడా అవసరం. ఆ నమ్మకాన్ని నిర్మించడమే నిజమైన ప్రజాస్వామ్య భద్రత.

మూడవ విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య



సంగారెడ్డి, డిసెంబర్ 16 (SNM NEWS):

జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.మూడవ విడతలో జిల్లాలోని కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, న్యాల్కల్, సిర్గాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మండలాల్లోని 234 సర్పంచ్ స్థానాలకు గాను 27 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అలాగే 1960 వార్డు మెంబర్ స్థానాలకు గాను 422 వార్డులు ఏకగ్రీవం కాగా, ఒక వార్డులో సింగిల్ నామినేషన్ అభ్యర్థి ఉపసంహరణ చేసుకున్న కారణంగా 1537 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మూడవ విడత ఎన్నికలు జరగనున్న 8 మండలాల్లో మొత్తం 2,25,483 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 1,13,019 మంది పురుషులు, 1,12,456 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని ఆమె వివరించారు. పోలింగ్ నిర్వహణకు గాను  1769 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు 2477 మంది పోలింగ్ అధికారులు (POలు), 2762 మంది ఓపిఓ లు, 8 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు, 351 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వివరాలు: కల్హేర్ మండలం – కల్హేర్ జడ్‌పీహెచ్‌ఎస్.

కంగ్టి మండలం – తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కళాశాల

మనూర్ మండలం – జడ్‌పహెచ్ హైస్కూల్

నాగల్ గిద్ద మండలం – జిల్లా పరిషత్ హై స్కూల్

నారాయణఖేడ్ – ప్రభుత్వ డిగ్రీ కళాశాల

నిజాంపేట్ మండలం – నిజాంపేట్ జడ్‌పీహెచ్‌ఎస్

సిర్గాపూర్ మండలం – ఎంపీడీవో కార్యాలయం

న్యాల్కల్ మండలం – ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైతు వేదిక లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని, పారదర్శక ఎన్నికలకు సహకరించాలని  కలెక్టర్   కోరారు.

Monday, December 15, 2025

పి.ఎం.ఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేసిన కంది మల్లేష్


 


సదాశివపేట, డిసెంబర్ 15 (SNM న్యూస్): 
సదాశివపేట పట్టణంలోని పీఎంఆర్ క్యాంపు కార్యాలయంలో కంది గ్రామానికి చెందిన మన్నే మల్లేష్ తన మిత్రులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ని కలిసి వారిని శాలువాతో సన్మానించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు. ఇట్టి సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ పి. ఎం. ఆర్ జనం మెచ్చిన నాయకుడని, వారు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని, రాబోయే రోజుల్లో మా నాయకునికి మంచి అవకాశాలు రావాలని మేమందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తామన్నారు. ఇట్టి కార్యక్రమంలో కంది గ్రామస్థులు పాల్గొన్నారు.

Thursday, December 11, 2025

వర్నిలో ఆటో బతుకుల రాష్ట్ర సభ

 


నిజామాబాద్, డిసెంబర్ 10 (SNM న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగమైన విషయమై నిరంకుశ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా, వర్నిలో ఆటో బతుకుల రాష్ట్ర సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తీసుకువచ్చిన ఉచిత బస్సు వలన తమ బతుకులు ఎలా చిద్రమయ్యాయో తెలుపుతూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2023 లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన, ప్రత్యేక ఆటో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ను కేటాయించాలి. సంవత్సరానికి కాకుండా ప్రతి నెల ఆటో డ్రైవర్లకు 12 వేల రూపాయలను అందించాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఆర్థిక నష్టపరిహారాన్ని అందజేయాలి అలాగే కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ కార్యదర్శి అధ్యక్షులు మంద రవి కుమార్, ఉపాధ్యక్షులు చోటు భాయ్ (దస్తగిర్), రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుడాల సాయిలు పాల్గొన్నారు. వారితో పాటు సాదిక్, జాన్ ,రఫీక్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, December 10, 2025

ఒక్క అవకాశం ఇవ్వండి వెంకటాపూర్ సర్పంచ్ అభ్యర్థి కౌవులే యాదగిరి

సంగారెడ్డి, డిసెంబర్ 9 (SNM న్యూస్);నన్ను వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే మన గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కౌవులే యాదగిరి అన్నారు. నేను చిన్న కుటుంబం నుండి వచ్చిన వాడినని గత మూడు సంవత్సరాల నుండి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మా గ్రామ ప్రజలకు చెప్తూ వస్తున్నానని, అదేవిధంగా కొంత మందికి నావంతు సహాయ సహకారాలను అందించానని, గ్రామ సమస్యలపైన ఫోకస్ పెడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని తెలుసుకున్నానని, నాపై నమ్మకం ఉంచి గ్రామ ప్రజలు నాగుర్తు బ్యాలెట్ పేపర్లో  2వ నెంబర్ కలిగిన కత్తెర గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని పత్రికాముఖంగా ప్రార్థిస్తున్నాను. నేను గెలిచిన వెంటనే బైపాస్ రోడ్ నుండి మన గ్రామం వరకు ఉన్నటువంటి కంకర రోడ్డును బాగుచేయిస్తానని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళామూతృ లందరికి నాదగ్గర ఉన్నటువంటి ఆటోను ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ మాదిరిగా ఉపయోగిస్తానని మాట ఇస్తున్నాను. గ్రామంలో ఎటువంటి సమస్యనైనా నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తానని తెలియపరుస్తున్నాను. ఈసారి మన గ్రామంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క ఓటును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. ముఖ్యంగా యువత తప్పుతోవలో  నడవకుండా ఆలోచించి మంచి చేసే నాయకునికి  మీ ఓటువేసి ఎన్నుకోవాలని వెంకటాపూర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్టి ప్రచార కార్యక్రమంలో తన ప్యానల్ సభ్యులు దుర్గంబోయిని పోచయ్య, దుర్గం బోయిని సుజాత, బోయిని పోచయ్య, కుదై గారి సలీంలను కూడా వార్డు సభ్యులుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, ఇట్టి కార్యక్రమంలో అంబదాస్,మహేష్, ఖదీర్, శేఖర్, శివకుమార్, రాజు, నరేష్, బి. యాదగిరి మరియు గ్రామ ప్రజలు మొదలగు వారు పాల్గొన్నారు.

Tuesday, December 09, 2025

నందిగామలో విక్రమ్ గౌడ్‌ను విజయం దిశగా నడిపించండి: కాట శ్రీనివాస్ గౌడ్

 

సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబర్ 9 (SNM న్యూస్):: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, నందిగామ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ కు మద్దతుగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మంగళవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపను సందర్శించి గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి, కర పత్రాలను అందజేస్తూ గ్రామ అభివృద్ధికి విక్రమ్ గౌడ్ వంటి నిబద్ధత కలిగిన నాయకుడు అత్యవసరమని వివరించారు. అభివృద్ధి కోసం, పారదర్శక పాలన కోసం, గ్రామం కోసం—తమ విలువైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి విక్రమ్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాట శ్రీనివాస్ గౌడ్ గ్రామస్థులను కోరారు.

కౌలంపేటలో స్వాతి శ్రీశైలంకు మద్దతుగా నిర్మలా జగ్గారెడ్డి ప్రచారం


సంగారెడ్డి, డిసెంబర్ 9 (SNM న్యూస్):: కంది మండలం కౌలంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి స్వాతి శ్రీశైలంకు మద్దతుగా ప్రచారం  టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని శ్రీశైలం గత 20 ఏళ్లుగా పార్టీలో ఉండి పని చేస్తున్నారని కొనియాడారు. ఇటువంటి నిజాయితీ, సేవాభావం ఉన్న నాయకత్వం గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తుందని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో స్వాతి శ్రీశైలంను గెలిపిస్తే  ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్లు, డ్రైనేజి, రేషన్ కార్డులు, యువతకు పరిశ్రమల్లో ఉద్యోగాలు, రెండు వాటర్ ఫ్లాంటు తదితర సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కౌలంపేట గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి సాధ్యమైనంత మేర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దుందిగల్ల రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

మామిడిపల్లిలో మానస ప్రవీణ్ యాదవ్ ప్రచారం



సంగారెడ్డి, డిసెంబర్ 9(SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామంలో మానస ప్రవీణ్ యాదవ్ మంగళవారం ప్రచారాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రచారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్థులు ఆయన వెంట చేరి ఊరంతా జెండాలు, నినాదాలతో సందడి చేశారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ప్రవీణ్ యాదవ్ ప్రజలకు అభివాదం చేస్తూ తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, ఎన్నికల తర్వాత గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటానని హామీ ఇచ్చారు. మామిడిపల్లిలో తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, కాలువల శుభ్రత వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తన ప్రచారం పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన, గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...