Tuesday, December 09, 2025

మామిడిపల్లిలో మానస ప్రవీణ్ యాదవ్ ప్రచారం



సంగారెడ్డి, డిసెంబర్ 9(SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లి గ్రామంలో మానస ప్రవీణ్ యాదవ్ మంగళవారం ప్రచారాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రచారం చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, గ్రామస్థులు ఆయన వెంట చేరి ఊరంతా జెండాలు, నినాదాలతో సందడి చేశారు. గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ప్రవీణ్ యాదవ్ ప్రజలకు అభివాదం చేస్తూ తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఇప్పటి వరకు గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ, ఎన్నికల తర్వాత గ్రామ అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటానని హామీ ఇచ్చారు. మామిడిపల్లిలో తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, కాలువల శుభ్రత వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. తన ప్రచారం పట్ల ప్రజలు చూపుతున్న ఆదరణకు కృతజ్ఞతలు తెలియజేసిన ఆయన, గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...