సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS):
సంగారెడ్డి జిల్లా పరిధిలో జి హెచ్ ఎం సి లో నూతనంగా విలీనమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 24 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ ఆర్ ఏ) వర్తింపజేయాలని కోరుతూ పిఆర్ టియు టి ఎస్ సంగారెడ్డి జిల్లా శాఖ గౌరవ జిల్లా కలెక్టర్ ఎ.ప్రావీణ్య కి వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 27 మున్సిపాలిటీలను జి హెచ్ ఎం సి పరిధిలోకి విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీలు జి హెచ్ ఎం సి పరిధిలోకి వచ్చాయని పిఆర్ టియు టి ఎస్ జిల్లా అధ్యక్షులు ఎ.మాణయ్య తెలిపారు. జి హెచ్ ఎం సి పరిధి విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో, 8 కిలోమీటర్ల పరిధిలో విలీనమైన గ్రామాలు, పట్టణాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని మూల వేతనంపై 24 శాతం హెచ్ ఆర్ ఏ తో పాటు అర్హులైన వారికి సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ (సి సి ఏ) కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఎ.ప్రావీణ్య, అంశాన్ని సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. స్టేజ్-2 అధికారులకు అందుతున్న అతి తక్కువ రెమ్యునరేషన్ అంశాన్ని తమ దృష్టికి తీసుకురాగా, వారికి అదనంగా రూ.1,000 చెల్లించనున్నట్లు కూడా కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రతినిధ్య కార్యక్రమంలో పటాన్‌చెరు మండల శాఖ అధ్యక్షులు ఎం.విఠల్ రెడ్డి, రామచంద్రాపురం మండల శాఖ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, అమీన్‌పూర్ మండల శాఖ అధ్యక్షులు ఆనంద్, జిన్నారం మండల శాఖ ప్రధాన కార్యదర్శి పవన్ రాజ్, రాష్ట్ర బాధ్యులు త్రిశూల్, మొగులయ్య, బ్రహ్మ ఋషి, రామకృష్ణారెడ్డి, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment