సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబర్ 9 (SNM న్యూస్):: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, నందిగామ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ కు మద్దతుగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మంగళవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపను సందర్శించి గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి, కర పత్రాలను అందజేస్తూ గ్రామ అభివృద్ధికి విక్రమ్ గౌడ్ వంటి నిబద్ధత కలిగిన నాయకుడు అత్యవసరమని వివరించారు. అభివృద్ధి కోసం, పారదర్శక పాలన కోసం, గ్రామం కోసం—తమ విలువైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి విక్రమ్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాట శ్రీనివాస్ గౌడ్ గ్రామస్థులను కోరారు.
No comments:
Post a Comment