సంగారెడ్డి, డిసెంబర్ 16 (SNM NEWS):
జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.మూడవ విడతలో జిల్లాలోని కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, న్యాల్కల్, సిర్గాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మండలాల్లోని 234 సర్పంచ్ స్థానాలకు గాను 27 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అలాగే 1960 వార్డు మెంబర్ స్థానాలకు గాను 422 వార్డులు ఏకగ్రీవం కాగా, ఒక వార్డులో సింగిల్ నామినేషన్ అభ్యర్థి ఉపసంహరణ చేసుకున్న కారణంగా 1537 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మూడవ విడత ఎన్నికలు జరగనున్న 8 మండలాల్లో మొత్తం 2,25,483 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 1,13,019 మంది పురుషులు, 1,12,456 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని ఆమె వివరించారు. పోలింగ్ నిర్వహణకు గాను 1769 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు 2477 మంది పోలింగ్ అధికారులు (POలు), 2762 మంది ఓపిఓ లు, 8 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు, 351 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వివరాలు: కల్హేర్ మండలం – కల్హేర్ జడ్‌పీహెచ్‌ఎస్.
కంగ్టి మండలం – తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కళాశాల
మనూర్ మండలం – జడ్‌పహెచ్ హైస్కూల్
నాగల్ గిద్ద మండలం – జిల్లా పరిషత్ హై స్కూల్
నారాయణఖేడ్ – ప్రభుత్వ డిగ్రీ కళాశాల
నిజాంపేట్ మండలం – నిజాంపేట్ జడ్‌పీహెచ్‌ఎస్
సిర్గాపూర్ మండలం – ఎంపీడీవో కార్యాలయం
న్యాల్కల్ మండలం – ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైతు వేదిక లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని, పారదర్శక ఎన్నికలకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
No comments:
Post a Comment