సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 18 (SNM NEWS): చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న 52 అంతస్తుల భారీ భవనం కన్స్ట్రక్షన్ సైట్‌లో గురువారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనం పక్కనే కన్స్ట్రక్షన్ కూలీల కోసం ఏర్పాటు చేసిన షెడ్‌లలో అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కన్స్ట్రక్షన్ సైట్‌లో నివసిస్తున్న కూలీల షెడ్‌లలో ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ శాఖ అధికారులు అప్రమత్తమై మూడు ఫైర్ ఇంజన్లతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మంటలు ఆర్పే క్రమంలో మరికొన్ని సిలిండర్లు పేలినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం మూడు సిలిండర్లు పేలినట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రమాద సమయంలో కూలీలందరూ పనులకు వెళ్లి ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఘటనకు గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Showing posts with label lingampally. Show all posts
Showing posts with label lingampally. Show all posts
Thursday, December 18, 2025
Subscribe to:
Posts (Atom)
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం
ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

