సంగారెడ్డి డిసెంబర్ 16 (SNM NEWS): బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు తెలంగాణబీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఢిల్లీలో బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ భవన్లో గల అంబేద్కర్ ఆడిటోరియంలో 10 డిసెంబర్ రోజున సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సంగారెడ్డి నుండి బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడు, అధ్యక్షతన వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, కో కన్వీనర్ సుధాకర్ గౌడ్, ఇట్టి సమాజంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు నాగరాజు అంబిక లక్ష్మీనారాయణ, బీరంమస్తాన్ రావు, సత్యనారాయణ, రవిచంద్ర , పాల్గొని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సంఘీభావం తెలిపారు పార్లమెంటు ప్రైవేట్ బిల్లు పెట్టడానికి ఆమోదం తెలిపారు ప్రభు గౌడ్ మాట్లాడుతూ బీసీలకు42 శాతం రిజర్వేషన్ కచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమూలన బీసీల దక్కాల్సిన ఫలాలుదక్కడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో బీసీలకు సరియైన రిజర్వేషన్ ఇవ్వని కారణంగా సాయి ఈశ్వర చారి అనే సంగారెడ్డి యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నాడని ఆయన కుటుంబానికి ఎవరు దిక్కు అని ప్రశ్నించారు, ఇకపై యువకులు ఎలాంటి బలిదానాలు చేసుకోకూడదని కోరారు, సాయి ఈశ్వర చారి కుటుంబానికి కోటి రూపాయలు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగి ఇవ్వాలని అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన బిసి జేఏసీ సమావేశంలో పాల్గొన్నవారు. బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడు, వైస్ ఛైర్మన్ కుమ్మరి సాయిలు, వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, సుదర్శన్ గౌడ్, కో కన్వీనర్లు రాగులపల్లి లక్ష్మి, సుధాకర్ గౌడ్, నాగరాణి యాదవ్, వడ్లలత మానస లతగౌడ్, ఎం కొండయ్య, పాండ్ రంగం, గౌలిఈశ్వర్, శ్రీనివాస్, రాందాస్, నాగభూషణం, నాయి సుభాష్ రామ్ చందర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Wednesday, December 17, 2025
ఢిల్లీ టూర్ విజయవంతంగా ముగించుకుని వచ్చిన సంగారెడ్డి జిల్లా బిసి జేఏసీ బృందం
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment