సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 ను రద్దు చేసే ఉద్దేశంతో ప్రతిపాదించిన వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025' (విజి బి రామ్ జి) ను నరెగా సంఘర్ష్ మోర్చా,డిబిఎఫ్ లు తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ చెప్పారు.శుక్ర వారం నాడు సంగారెడ్డి లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ కార్మికులతో గానీ, కార్మిక సంఘాలతో గానీ ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ప్రవేశపెట్టిన ఈ బిల్లు, చట్టబద్ధమైన హక్కుల ఆధారిత వ్యవస్థను, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి జవాబుదారీతనం లేని బడ్జెట్ పరిమితులతో కూడిన ఒక సాధారణ పథకంగా మార్చేస్తుందన్నారు.ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసహంహరించుకొవాలని డిమాండ్ చేశారు.. కేంద్రానికి మితిమీరిన విచక్షణాధికారం.నరేగ అనేది డిమాండ్ ఆధారితమైనది. సార్వత్రికమైనదని అంటే, గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరికైనా పని కల్పించాల్సిన బాధ్యత చట్టం కల్పిస్తుందన్నారు.. కానీ, కొత్త విబి జి రామ్ జీ బిల్లులోని సెక్షన్ 5(1) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే నైపుణ్యం లేని పని చేయడానికి ముందుకొచ్చే కుటుంబాలకు 125 రోజులకు తగ్గకుండా గ్యారెంటీ పనిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని దీనర్థం ఒకవేళ కేంద్రం ఏదైనా ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతంగా నోటిఫై చేయకపోతే ఆ ప్రాంత ప్రజలకు పని హక్కు ఉండదన్నారు. ఇది సార్వత్రిక ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై నడిచే ఒక సాధారణ పథకంగా దిగజార్చుతుందన్నారు. విబి జి రామ్ జి బిల్లు అనేది సంస్కరణ కాదు, దశాబ్దాల పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల తిరోగమన్నారు. చట్టబద్ధమైన హక్కును తొలగించి కేంద్రం నియంత్రణలో బడ్జెట్ పరిమితులతో నిఘా నీడలో నడిచే ఒక పథకంగా మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తోందన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, 73వ రాజ్యాంగ సవరణను అవమానించడమేనని, ఇది అధికారాన్ని కార్మికులు, గ్రామ సభలు, రాష్ట్రాల చేతుల్లోంచి లాక్కుని కేంద్రం చేతుల్లో పెడుతుందన్నారు. నరేగ సంఘర్ష్ మోర్చా ,డిబిఎఫ్ విబిజి రామ్ జి బిల్లు, 2025ను ఏకగ్రీవంగా తిరస్కరిస్తోందన్నారు. దీనిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి సంఘాల అనుమతి లేకుండా యంజిఎన్అర్ జిఎ ను రద్దు చేసే లేదా మార్చే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని, గ్రామీణ కార్మికుల జీవనోపాధికి మూలస్తంభమైన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి, ఈ ఏకపక్ష నిర్ణయాలను ప్రతిఘటించాలని మేము అన్ని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.లక్ష్మీ, సామాజిక కార్యకర్తలు బంగారయ కృష్ణ,గీత, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment