Showing posts with label sangare political news. Show all posts
Showing posts with label sangare political news. Show all posts

Monday, May 11, 2026

ఘనంగా వేదాన్య పాఠశాల ప్రారంభం

 


సంగారెడ్డి, మే 11 (SNM న్యూస్) : విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలంగా డిజిటల్ తరగతి గదులు, విశాలమైన క్లాస్‌రూములు, పెద్ద ఆట స్థలం, బాక్స్ క్రికెట్ సదుపాయం కల్పించినట్లు వేదాన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని గణేష్‌నగర్‌లో కృష్ణ దేవాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వేదాన్య పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం పాఠశాల అసెంబ్లీ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేణు భగవాన్, దామోదర్ రెడ్డి హాజరై మాట్లాడారు. నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. స్నేహపూర్వక అధ్యాపక బృందంతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల నిర్వహణలో డైరెక్టర్ మనోహర్ గౌడ్, సంజయ్ హాట్కర్, వివేక్ కుమార్ సేవలందిస్తుండగా, కో-డైరెక్టర్లు సంజయ్ సోనాలి, ప్రేమ్ కుమార్, రవితేజ పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Sunday, May 10, 2026

రక్తదానం ప్రాణదానం : డాక్టర్ స్వామి గౌడ్


 సంగారెడ్డి పట్టణంలోని సన్‌రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సన్‌రైజ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ స్వామి గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆస్పత్రి ప్రాంగణంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దాతలు, శ్రేయోభిలాషులు, మీడియా ప్రతినిధులు, డాక్టర్ స్వామి గౌడ్ కుటుంబ సభ్యులు తదితరులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వామి గౌడ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ సేవల్లో రక్తం కొరత ఏర్పడే పరిస్థితులు తరచుగా ఎదురవుతాయని, ఆ సమయంలో రక్తదానం చేసినవారి సహకారమే ప్రాణాలను కాపాడుతుందని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. గత 12 సంవత్సరాలుగా సన్‌రైజ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎండాకాలంలో రక్త నిల్వలు తగ్గిపోతాయని గుర్తించి ప్రతి ఏడాది మే నెలలో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు తదితర విద్యా సామగ్రిని ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ప్రజల సహకారంతోనే సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే సన్‌రైజ్ హాస్పిటల్‌లో నూతనంగా కార్డియాలజీ సేవలను ప్రారంభించామని, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా గుండె సంబంధిత వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని డాక్టర్ స్వామి గౌడ్ కోరారు.

Wednesday, February 04, 2026

సంగారెడ్డి 28వ వార్డులో బీజేపీ అభ్యర్థి సంధ్యారాణి రాజుగౌడ్ ప్రచారం

 

సంగారెడ్డి, ఫిబ్రవరి 3(SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అభ్యర్థి సంధ్యారాణి రాజుగౌడ్ మంగళవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి రాజుగౌడ్ మాట్లాడుతూ.. 28వ వార్డు అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం అని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అంకితభావంతో పని చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి అందేలా కృషి చేస్తానని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని, బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంగారెడ్డి 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నవాజ్ ఇంటింటి ప్రచారం


సంగారెడ్డి, ఫిబ్రవరి 3(SNM NEWS):: సంగారెడ్డి 6వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి నవాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రజలను కలుస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 6వ వార్డు అభివృద్ధి నా లక్ష్యం అని, వార్డులో బస్తి దావఖాన, అంగన్వాడి పాఠశాల ఏర్పాటుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు మొదలుపెట్టిందని, 6వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఈ ఎన్నికలలో వార్డు ప్రజలు తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నవాజ్ తెలిపారు.

బీఆర్‌ఎస్‌కు షాక్ – బీజేపీలో భారీ చేరికలు


-12వ వార్డులో బీఆర్‌ఎస్ నాయకుడు గట్టు మీది శ్రీనివాస్

-50 మంది కార్యకర్తలతో బీజేపీలో చేరిక                                                                                                      సంగారెడ్డి, ఫెబ్రవరి 3 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డుకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు గట్టు మీది శ్రీనివాస్ సుమారు 50 మంది కార్యకర్తలతో కలిసి భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి సాహితీ రాముకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ, ఆయనకు ఘన విజయం సాధించేలా కార్యకర్తలతో కలిసి కృషి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై విశ్వాసంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ చేరిక కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు.

Thursday, December 18, 2025

జి హెచ్ ఎం సి పరిధిలో విలీనమైన ప్రాంతాల ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24శాతం హెచ్ ఆర్ ఏ వర్తింపజేయాలి -జిల్లా కలెక్టర్‌కు పిఆర్ టియు టి ఎస్ వినతి

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS):

సంగారెడ్డి జిల్లా పరిధిలో జి హెచ్ ఎం సి లో నూతనంగా విలీనమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 24 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ ఆర్ ఏ) వర్తింపజేయాలని కోరుతూ పిఆర్ టియు టి ఎస్ సంగారెడ్డి జిల్లా శాఖ గౌరవ జిల్లా కలెక్టర్ ఎ.ప్రావీణ్య కి వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 27 మున్సిపాలిటీలను జి హెచ్ ఎం సి పరిధిలోకి విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీలు జి హెచ్ ఎం సి పరిధిలోకి వచ్చాయని పిఆర్ టియు టి ఎస్ జిల్లా అధ్యక్షులు ఎ.మాణయ్య తెలిపారు. జి హెచ్ ఎం సి పరిధి విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో, 8 కిలోమీటర్ల పరిధిలో విలీనమైన గ్రామాలు, పట్టణాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని మూల వేతనంపై 24 శాతం హెచ్ ఆర్ ఏ తో పాటు అర్హులైన వారికి సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ (సి సి ఏ) కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఎ.ప్రావీణ్య, అంశాన్ని సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. స్టేజ్-2 అధికారులకు అందుతున్న అతి తక్కువ రెమ్యునరేషన్ అంశాన్ని తమ దృష్టికి తీసుకురాగా, వారికి అదనంగా రూ.1,000 చెల్లించనున్నట్లు కూడా కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రతినిధ్య కార్యక్రమంలో పటాన్‌చెరు మండల శాఖ అధ్యక్షులు ఎం.విఠల్ రెడ్డి, రామచంద్రాపురం మండల శాఖ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, అమీన్‌పూర్ మండల శాఖ అధ్యక్షులు ఆనంద్, జిన్నారం మండల శాఖ ప్రధాన కార్యదర్శి పవన్ రాజ్, రాష్ట్ర బాధ్యులు త్రిశూల్, మొగులయ్య, బ్రహ్మ ఋషి, రామకృష్ణారెడ్డి, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

చట్టబద్ద ఉపాధి హమి పని హక్కును హరించే రోజ్ గార్ బిల్లు ను ఉపసంహరించుకోవాలి -డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

 

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005 ను రద్దు చేసే ఉద్దేశంతో ప్రతిపాదించిన  వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025' (విజి బి రామ్ జి) ను నరెగా సంఘర్ష్ మోర్చా,డిబిఎఫ్ లు  తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత బహుజన ఫ్రంట్  జాతీయ కార్యదర్శి పి.శంకర్ చెప్పారు.శుక్ర వారం నాడు సంగారెడ్డి లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ మాట్లాడుతూ కార్మికులతో గానీ, కార్మిక సంఘాలతో గానీ ఎటువంటి సంప్రదింపులు జరపకుండా ప్రవేశపెట్టిన ఈ బిల్లు, చట్టబద్ధమైన హక్కుల ఆధారిత వ్యవస్థను, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి జవాబుదారీతనం లేని బడ్జెట్ పరిమితులతో కూడిన ఒక సాధారణ పథకంగా మార్చేస్తుందన్నారు.ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసహంహరించుకొవాలని డిమాండ్ చేశారు.. కేంద్రానికి మితిమీరిన విచక్షణాధికారం.నరేగ  అనేది డిమాండ్ ఆధారితమైనది. సార్వత్రికమైనదని  అంటే, గ్రామీణ ప్రాంతాల్లో శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎవరికైనా పని కల్పించాల్సిన బాధ్యత చట్టం కల్పిస్తుందన్నారు.. కానీ, కొత్త విబి జి రామ్ జీ బిల్లులోని సెక్షన్ 5(1) ప్రకారం, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే నైపుణ్యం లేని పని చేయడానికి ముందుకొచ్చే కుటుంబాలకు 125 రోజులకు తగ్గకుండా గ్యారెంటీ పనిని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని దీనర్థం ఒకవేళ కేంద్రం ఏదైనా ప్రాంతాన్ని గ్రామీణ ప్రాంతంగా  నోటిఫై చేయకపోతే ఆ ప్రాంత ప్రజలకు పని హక్కు ఉండదన్నారు. ఇది సార్వత్రిక ఉపాధి హామీని కేంద్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యాలపై నడిచే ఒక సాధారణ పథకంగా దిగజార్చుతుందన్నారు. విబి జి రామ్ జి  బిల్లు అనేది సంస్కరణ కాదు, దశాబ్దాల పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల తిరోగమన్నారు. చట్టబద్ధమైన హక్కును తొలగించి కేంద్రం నియంత్రణలో బడ్జెట్ పరిమితులతో  నిఘా నీడలో నడిచే ఒక పథకంగా మార్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని దెబ్బతీస్తోందన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, 73వ రాజ్యాంగ సవరణను అవమానించడమేనని, ఇది అధికారాన్ని కార్మికులు, గ్రామ సభలు, రాష్ట్రాల చేతుల్లోంచి లాక్కుని కేంద్రం చేతుల్లో పెడుతుందన్నారు. నరేగ సంఘర్ష్ మోర్చా ,డిబిఎఫ్ విబిజి రామ్ జి బిల్లు, 2025ను ఏకగ్రీవంగా తిరస్కరిస్తోందన్నారు. దీనిని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులు, వారి సంఘాల అనుమతి లేకుండా యంజిఎన్అర్ జిఎ ను రద్దు చేసే లేదా మార్చే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని, గ్రామీణ కార్మికుల జీవనోపాధికి మూలస్తంభమైన ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి, ఈ ఏకపక్ష నిర్ణయాలను ప్రతిఘటించాలని మేము అన్ని ప్రజాస్వామ్య శక్తులకు పిలుపునిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ జనసమితి మహిళ విభాగం రాష్ట్ర  అధ్యక్షురాలు ఆర్.లక్ష్మీ,  సామాజిక కార్యకర్తలు బంగారయ కృష్ణ,గీత, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కారించాలి -టిజెయు జిల్లా అధ్యక్షులు ఎం.గిరి


సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సమాజానికి కళ్లూ, చెవులుగా వ్యవహరించే జర్నలిస్టులు నేడు అనేక సమస్యల మధ్య పని చేస్తున్నారని  జర్నలిస్టుల సమస్యలు పరిష్కరంచటంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం సరైయిoది కాదని తెలంగాణ జెర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం.గిరి పేర్కొన్నారు. గురువారం టి జె యు నూతన కమిటీ జిల్లా కలెక్టర్ కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జెర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు తగిన శ్రద్ధ చూపడంలో విఫలమవుతున్నాయని తెలిపారు.రాష్ట ప్రభుత్వo  ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేది జెర్నలిస్టులే నన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధుల సమస్యలు పరిష్కారమైతేనే పారదర్శక, బాధ్యతాయుత పాలన సాధ్యమవుతుందిని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ (టీజెయు) సంగారెడ్డి జిల్లా కమిటీ జర్నలిస్టుల సమస్యలపై తక్షణ జోక్యం చేసి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం  సమర్పించా మని పేర్కొన్నారు..ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలు, పాలనలోని లోపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చోరువ చూపకపోవడం విచారకరమన్నారు.  ప్రభుత్వ అధికారుల పనితీరును నిత్యం ప్రజలకు తెలియజేస్తున్నారు. జర్నలిస్టులు భద్రతా లోపం, ఆర్థిక అస్థిరత, ఆరోగ్య సమస్యలు, ప్రభుత్వ అధికారుల సహకారం  లభించటం లేదన్నారు. జెర్నలిస్ట్ సమస్యల లేమితో తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఈ సమస్యలు మరింత తీవ్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లాబ్ ఉన్నా జెర్నలిస్టలకు ప్రయోజనo లేదన్నారు. గడిచిన 20 ఏండ్ల నుంచి ఏ ఒక్క జెర్నలిస్ట్ ఉపయోగపడలేదన్నారు. వేంటనే జెర్నలిస్టులకు ఉపయోగ పడేలా చెర్యలు చేపట్టాలన్నారు. ఒకే వర్గం ఆధిపత్యం లో ఉండటం సరి కాదన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి తగిన చెర్యలు చేపట్టాలని కోరడం జరిగిందన్నారు.జర్నలిస్టులకు ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు, జర్నలిస్టు గుర్తింపు కార్డులు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, నివాస స్థలాల కేటాయింపు, వెంటనే కల్పించాలన్నారు.నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ వంటి కీలక డిమాండ్లను ప్రస్తావించారు. నూతన అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో ప్రెస్ క్లబ్ చైర్మన్ సమర్థంగా వ్యవహరించడంలో విఫలమయ్యారని వెంటనే తగిన చెర్యలు చేయట్టాలని పేర్కొన్నారు. అక్రిడేషన్  కమిటీ లో టి జె యు యూనియన్ అవకశాo కల్పించాలన్నారు.  జర్నలిస్టుల సమస్యలు కేవలం సంక్షేమ సదుపాయాలకు మాత్రమే పరిమితం కాకుండా, వారి వృత్తి గౌరవం, ఆత్మగౌరవానికి సంబంధించినవని టీజెయు స్పష్టం చేసింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే అది పరోక్షంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని తెలిపారు. స్వేచ్ఛాయుతంగా, నిర్భయంగా వార్తలు రాయాలంటే వృత్తి భద్రత అత్యంత కీలకమని పేర్కొంది.అందుకే జిల్లా యంత్రాంగం ఈ వినతిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సంగారెడ్డి జిల్లా టీజెయు కమిటీ చేసిన ఈ ప్రయత్నం జర్నలిస్టుల ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తయని ప్రభుత్వ చెర్యలు కూడిన పాలన, సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక. అప్పుడు మాత్రమే ప్రజల తరఫున నిలబడే జర్నలిస్టులకు న్యాయం జరుగుతుందని టీజెయు కృషి చేస్తుందని పేర్కొన్నారు. సంగారెడ్డి ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు నిజంగా ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవడానికి, జిల్లా కలెక్టర్ వెంటనే   స్పందించి చెర్యలు చేపపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ (టీజెయు), సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శివకుమార్ పోచగౌడ్ మహేష్ గౌడ్ కార్య వర్గ సభ్యులు రాజేష్, గణేష్ జావీద్ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ నిర్మూలన పై కళా ప్రదర్శన సాంస్కృతిక సారథి కళాజాత

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య  ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని విజయలక్ష్మి  పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో కళా ప్రదర్శన నిర్వహించారు. చదువు యొక్క ప్రాముఖ్యత, డ్రగ్స్, మూఢనమ్మకాల నిర్మూలన, పచ్చదనం పరిశుభ్రత వంటి తదితర అంశాలపై కళారూపాలతో అవగాహన కల్పించారు. యువత విద్యార్థులు గంజాయి డ్రగ్స్ వంటి ద్రవ్యాలకు అలవాటు పడకూడదని తెలిపారు. డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్ధాలను వివరించారు. విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రుల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చదువు వలన సమాజంలో మంచి గుర్తింపు హోదా గౌరవం లభిస్తాయని వివరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని అన్నారు. అప్పుడే అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటారని తెలియజేశారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని సూచించారు. బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలని కోరారు. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ హెపటైటిస్ వంటి జబ్బులు రాకుండా ఉండాలంటే గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చడం వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కళాకారులు ఎ. సునీల్ కుమార్, డి. రమేష్, ఎస్. మల్లేష్, జి. బిక్షపతి, బి. నవీన్ కుమార్, ఎన్. రవిందర్, పి. సంధ్య పాల్గొన్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన లింగంపల్లి సర్పంచ్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ సర్పంచ్ ఇర్ఫాన్ పటేల్ శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండుతూ వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్‌కు సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా గ్రామాభివృద్ధికి సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్. వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్, విఠల్, మసుధ్, ముజీప్, మాజీ వైస్ ఎంపీపీ బాబా పటేల్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆఫ్సార్, సంపత్, మతిన్, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, December 16, 2025

రూ.118కోట్ల విద్యుత్ బకాయిలు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన న్యాయమూర్తి..!

 


సంగారెడ్డి, డిసెంబర్ 16 (SNM NEWS): గీతం డీమ్డ్ యూనివర్సిటీ బకాయిలపై తెలంగాణ విద్యుత్శాఖ అధికారులపై హైకోర్టు మండిపడింది. సామాన్యులు రూ.1000 బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా.. ఎందుకు వసూలు చేయలేదంటూ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్  బకాయిలపై తెలంగాణ విద్యుత్శాఖ అధికారులపై హైకోర్టు మండిపడింది. సామాన్యులు రూ.1000 బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా.. ఎందుకు వసూలు చేయలేదంటూ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాస్తవానికి హైదరాబాద్లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని ఎస్పీడీసీఎల్ నోటీసులు పంపింది. 2008 నుంచి ఇప్పటి వరకు రూ.118కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదంటూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఎస్పీడీసీఎల్ నోటీసులను గీతం యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, యూనివర్సిటీ దాఖలు చేసిన జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్ 2008 నుంచి బిల్లులు చెల్లించకపోవడంతోపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు రూ.1000 బిల్లు కట్టకపోతేనే కరెంట్ కనెక్షన్ను తొలగిస్తున్నారని.. అలాంటిది యూనివర్సిటీకి మాత్రం ఎందుకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించారని ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని.. సూపరింటెండెంట్ ఇంజినీర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. పిటిషన్పై విచారణను వాయిదా వేసింది.

*డాకూర్ గ్రామ ఉప సర్పంచ్‌గా పెద్దగొల్ల మురళి


 సంగారెడ్డి, డిసెంబర్ 16 (SNM NEWS): సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ గ్రామంలో ఉప సర్పంచ్ పదవికి పెద్దగొల్ల మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పంచాయతీ సభ్యులు  మురళిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మురళి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన మాజీ జడ్పీ చైర్‌పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు, సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పారదర్శక పాలన అందిస్తానని, డాకూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డాకూర్, మాజీ సర్పంచ్ శంకరయ్య తమ్మల శీను టిఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ సల్మాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు

Monday, December 15, 2025

పి.ఎం.ఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేసిన కంది మల్లేష్


 


సదాశివపేట, డిసెంబర్ 15 (SNM న్యూస్): 
సదాశివపేట పట్టణంలోని పీఎంఆర్ క్యాంపు కార్యాలయంలో కంది గ్రామానికి చెందిన మన్నే మల్లేష్ తన మిత్రులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ని కలిసి వారిని శాలువాతో సన్మానించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు. ఇట్టి సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ పి. ఎం. ఆర్ జనం మెచ్చిన నాయకుడని, వారు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని, రాబోయే రోజుల్లో మా నాయకునికి మంచి అవకాశాలు రావాలని మేమందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తామన్నారు. ఇట్టి కార్యక్రమంలో కంది గ్రామస్థులు పాల్గొన్నారు.

Saturday, November 22, 2025

సంగారెడ్డి శబరిమల మహా పాదయాత్ర విజయవంతం సంగారెడ్డి చేరుకున్న పాదయాత్ర బృందం

 

 సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా  శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము గురు స్వామి మరియు వారి శిష్య బృందం సుమారు 1600 కిలోమీటర్లు యాత్ర విజయవంతం చేసుకుని శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి తిరిగి చేరుకున్నారు. సంగారెడ్డిలో వారికి ఘన స్వాగతం లభించింది సంగారెడ్డి అయ్యప్ప స్వాములు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వారికి కాళ్లు కడిగి హారతులు ఇచ్చి స్వాగతం పలికారు యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూన వేణు ఆధ్వర్యంలో పాదయాత్ర స్వాములను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి లోని సండే మార్కెట్ వద్ద గల అభయాంజనేయ స్వామి దేవాలయం నుండి నవరత్నాలయ దేవస్థానం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నవరత్నాలయ దేవస్థానం వద్ద సమావేశం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి సత్కారం మెమెంటో అందజేశారు. కూన వేణు మాట్లాడుతూ పాదయాత్ర అనేది జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చేయాలని పాదయాత్ర అనేది అతి కష్టమైన యాత్ర అని అలా మూడుసార్లు వెళ్లిన రాము స్వామి ఆధ్వర్యంలోని పాదయాత్ర బృందం సంగారెడ్డికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చారని ఆయన అన్నారు. అయ్యప్ప ఆపద్బాంధవ సేవ సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర బృందానికి స్వాగతం పలికివారికి అభినందనలు తెలియజేశారు. సాహితీ రాము స్వామి మాట్లాడుతూ పాదయాత్ర ఐదు సార్లు చేయడం మా లక్ష్యం అని ఇప్పటివరకు మూడుసార్లు విజయవంతంగా పూర్తి చేశామని సంగారెడ్డి గురుస్వాములు మాత స్వాముల దీవెనలతో సాధ్యమైందని అలాగే మా పాదయాత్ర బృందం పూర్తిగా సహకరించి పాదయాత్ర విజయవంతం కావడానికి చాలా కష్టపడ్డారని తెలిపారు. నవంబర్ 30 వ తేదీన రాము స్వామి యొక్క 18వ మహా పడిపూజ ఉంది కావున ప్రతి ఒక్కరూ పూజకు హాజరై తమ ఆశీర్వాదాలు తెలియజేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కూన వేణు అయ్యప్ప ఆపద్బాంధవ సేవా సమితి సభ్యులు, సంగారెడ్డి గురు స్వాములు, బంధుమిత్రులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Wednesday, November 19, 2025

రాష్ట్ర ఈత పోటీల్లో రెండు రజత పతకాలు సాధించిన రెహమాన్

 

సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 19 (ఎస్ ఎన్ ఎమ్ న్యూస్): సంగారెడ్డి పట్టణానికి చెందిన శ్లోకాస్ శ్రీవాణి హై స్కూల్ లో ఎనిమిదోవ తరగతి చదువుతున్న విద్యార్థి మహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్దిఖ్ పెద్దపల్లి జిల్లా సెంచ్నరీ కాలనీ, రాణి రుద్రమదేవి స్టేడియం స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించిన 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఈతల పోటీలో మూడో స్థానంలో నిలిచి వివిధ స్టాక్ లో రెండు రజత పతకాలు సాధించిచాడు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాసరావు మహమ్మద్ అబ్దుర్ రెహమాన్ ను  అభినందించారు. ఇలాంటి పోటీల్లో రాష్ట్ర దేశస్థాయిలో మరింత ప్రతిభ కనబరిచి మంచి పేరు గడించాలని ఆశిస్తున్నానని తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్ జి ఎఫ్ స్విమ్మింగ్ పోటీలలో అత్యధిక పథకాలను సాధించినందుకు గాను జిల్లా ఇన్చార్జ్ శేషు కుమార్ కు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీనివాస్ రావు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. స్విమ్మింగ్ కోచ్, సంగారెడ్డి జిల్లా సిమ్మింగ్ ఇంచార్జ్ శేషు కుమార్ మాట్లాడుతూ అబ్దుర్ రెహమాన్ అండర్ 14 లో బ్రెస్ట్ స్టాక్ 100 మీటర్స్ , ఇండివిజువల్ మెడ్లి 200 మీటర్స్ లో రెండు రజత పథకాలను సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. డి వై ఎస్ ఓ కాసిం బేగ్ సంతోషం వ్యక్తం చేస్తూ మునుముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు. డి ఎస్ ఏ సిబ్బంది అభినవ్, దీపిక, పవన్ కళ్యాణ్ స్విమ్మింగ్ పూల్ సిబ్బంది పవన్,కృష్ణ,కుమార్ రెహమాన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంగారెడ్డిలో ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి వేడుకలు

సంగారెడ్డి ప్రతినిధి, నవంబర్ 19 (SNM న్యూస్): సంగారెడ్డిలో  ఇందిరా గాంధీ 108 వ జయంతి వేడుకలు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ముందుగా సంగారెడ్డిలో ఐబి వద్ద ఉన్న ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ప్రపంచం గుర్తించిన గొప్ప నేత ఇందిరా గాంధీ అని, ఆమె కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం అని అన్నారు. సంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు ఇందిరా గాంధీ తో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. మెదక్ పార్లమెంట్  నుండి ఎంపిగా  గెలిచి ప్రధాని అయ్యారు. అప్పటి  మెదక్ జిల్లా కాంగ్రెస్ అగ్ర నేతలు రామ్ చంద్రా రెడ్డి, బాగా రెడ్డి ల కోరిక మేరకు ఇక్కడి నుండి ఎంపి గా పోటీ చేసి గెలిచారు. ఇందిరా గాంధీ  ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించాలి, ఉద్యోగాలివ్వాలనే  సంకల్పంతో సంగారెడ్డి కి  ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తెచ్చారు. బిడిఎల్( భారత్ డైనమిక్స్ లిమిటెడ్)  తెచ్చారు, ఇక్రిశాట్ తెచ్చారని, ఈ దేశం లో  ప్రధాన మంత్రి గా  ఇందిరా గాంధీ  చేపట్టిన సంస్కరణలు  ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. గరిభి హాటావో నినాదంతో ఈ దేశంలో పేదరికాన్ని పారదోలారు. ఈ దేశం లోని భూమి లేని  నిరుపేదలకు, రైతులకు భూములు పంచారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో  ఇల్లు లేని  పేదలకు ఇళ్ల స్థలాలు పంచారు. రోటీ , కపడా ఔర్ మకాన్  నినాదంతో  దేశంలోని నిరుపేదల స్థితిగతులను మార్చే కృషి చేశారు. బీజేపీ నాయకులను నేను ఒకటే  ప్రశ్నించదలుచుకున్న చాలా సార్లు  మోడీ , అమిత్ షా, బీజేపీ నేతలు  మాట్లాడుతుంటారు. ఈ దేశం కోసం రక్తం ఇస్తా ప్రాణం ఇస్తాం అని బీజేపీ నేతలు అంటారు. కానీ ఏ బీజేపీ నాయకుడు  ఇంతవరూ ఎవరు ఈ దేశం కోసం రక్తం ఇవ్వలేదు,  ప్రాణం ఇవ్వలేదన్నారు. ఈ దేశం కోసం తన రక్తాన్ని , ప్రాణాలను ఇవ్వడానికి తాను సిద్దం అని ఇందిరా గాంధీ ఎన్నో సార్లు చెప్పారు. కేవలం మాటలు చెప్పడం కాదు ఆమె అన్నట్లుగానే ఈ దేశం కోసం తన రక్తాన్ని, ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఇందిరా గాంధీ అని గుర్తు చేశారు. దేశం కోసం బీజేపీ నాయకులు ఎవరైనా తన రక్తాన్ని , ప్రాణాలను అర్పించారా? అని ప్రతిపక్ష పార్టీలను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తౌబాజీ అనంత కిషన్, ఆంజనేయులు, కూన సంతోష్,  జార్జ్, ఇతర కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saturday, November 15, 2025

ఈనెల 16న జరిగే న్యాయ సాధన దీక్షను జయప్రదం చేయండి

సంగారెడ్డి, నవంబర్ 15 (SNM న్యూస్): బిసి న్యాయ సాధన దీక్ష తెలంగాణ  బి సి జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి  పిలుపుమేరకు తేదీ 16 నవంబర్ 2025 ఆదివారం నాడు ఉదయము 11 గంటల నుండి సాయంత్రము నాలుగు గంటల వరకు సంగారెడ్డి జిల్లాబిసి  జేఏసీ ఆధ్వర్యంలోన్యాయ  సాధన దీక్ష కలదు ఇట్టి న్యాయసాధన దీక్ష కొత్త బస్టాండ్ పక్కన నటరాజ్ టాకీస్ ముందు దీక్షా స్థలంను ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టిదీక్ష ముఖ్య ఉద్దేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇట్టి దీక్షను సంగారెడ్డి జిల్లా లోని అన్ని నియోజకవర్గ, పట్టణ మండల కేంద్రాల్లో బీసీ సోదరి సోదరులందరూ విజయవంతం చేయాలని కోరడం జరిగినది ఇట్టి దీక్ష ను న్యాయవాదులు డాక్టర్లు మేధావి వర్గంఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు యువతియువకులు విద్యార్థిని విద్యార్థులు అన్నిబిసి కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని జిల్లా బీసీ జేఏసీకన్వీనర్ ప్రభుగౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సంగారెడ్డి జిల్లాబీసీ జేఏసీ  వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ కో కన్వీనర్లు రవి మానస మంగ గౌడ్ తదితరులు పాల్గొన్నారు...

దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి -టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 14 (SNM News):   పండిట్ జవహర్ లాల్ నెహ్రు 136 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారా? మిషన్లు ఓట్లేశాయా? అర్థం కావడం లేదన్నారు. నేను రాహుల్ గాంధీ కి ఒకటే చెప్పదలుచుకున్న, బీహార్ పోతే పోయింది. కానీ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు. మోతీలాల్ నెహ్రూ,  జవహర్ లాల్ నెహ్రూ ల కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులు పంచారు, ప్రాణాలిచ్చారు.. మంచి పరిపాలన చేశారు. కొంతమంది  రాజకీయ మూర్ఖులు ఆ కుటుంబం దేశం కోసం ఏం చేసిందని మాట్లాడటం బాధాకరం అని అన్నారు. భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 136 వ జయంతి సందర్భంగా  టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  ఆధ్వర్యంలో సంగారెడ్డి లో ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమంలో  టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి పాత బస్టాండ్  రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద  బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం లో బాలలు సంతోషంగా పాల్గొన్నారు. పండిట్ నెహ్రూ, ఇందిరా గాంధి, రాజీవ్ గాంధీ ల జీవిత చరిత్ర ను తెలిపేలా ప్రత్యేక డాన్స్, స్కిట్  లతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. భారత దేశ అభివృద్ధి కి ప్రధాన మంత్రి గా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు, భారీ ప్రాజెక్టు ల రూపకల్పన, ఐఐటి, ఐఐఎం ల ఏర్పాటు వంటి అంశాలను కళ్ళకు కట్టినట్టు కళాకారులు ఈ కార్యక్రమంలో చూపించారు.

Thursday, November 13, 2025

బీసీల ధర్మపోరాట దీక్షను విజయవంతం చేయండి -నాయకోటి రాజు

 

సంగారెడ్డి, నవంబర్ 13 (ఎస్ ఎన్ ఎం న్యూస్): రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్ష కాదు ... ఇది మా హక్కు బిసిలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో 42శాతం రిజర్వేషన్లు పెంచడానికి పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసీ, తొమ్మిదవ షెడ్యూల్ చేర్చాలనే ప్రధాన డిమాండ్ తో13, 2025 నవంబర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాలలో...బిసీల ధర్మ పోరాట దీక్షలు విజయవంతం చేయాలని బిసి జాయింట్ యాక్షన్ కమిటీ (బిసి జెఎసి), తెలంగాణ రాష్ట్రం వారు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Wednesday, October 01, 2025

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు – జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

 

విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ,జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలను నింపాలని, చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. మాత  దుర్గాదేవి కృపతో అందరూ ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని కలెక్టర్ కోరారు. ఈ విజయదశమి ప్రతి ఒక్కరికి విజయాలు చేకూర్చాలని అభిలాషించారు. అందరూ శాంతియుత, ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను జరుపుకోవాలని ఆమె సూచించారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...