సంగారెడ్డి, డిసెంబర్ 9 (SNM న్యూస్);నన్ను వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే మన గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కౌవులే యాదగిరి అన్నారు. నేను చిన్న కుటుంబం నుండి వచ్చిన వాడినని గత మూడు సంవత్సరాల నుండి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మా గ్రామ ప్రజలకు చెప్తూ వస్తున్నానని, అదేవిధంగా కొంత మందికి నావంతు సహాయ సహకారాలను అందించానని, గ్రామ సమస్యలపైన ఫోకస్ పెడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని తెలుసుకున్నానని, నాపై నమ్మకం ఉంచి గ్రామ ప్రజలు నాగుర్తు బ్యాలెట్ పేపర్లో 2వ నెంబర్ కలిగిన కత్తెర గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని పత్రికాముఖంగా ప్రార్థిస్తున్నాను. నేను గెలిచిన వెంటనే బైపాస్ రోడ్ నుండి మన గ్రామం వరకు ఉన్నటువంటి కంకర రోడ్డును బాగుచేయిస్తానని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళామూతృ లందరికి నాదగ్గర ఉన్నటువంటి ఆటోను ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ మాదిరిగా ఉపయోగిస్తానని మాట ఇస్తున్నాను. గ్రామంలో ఎటువంటి సమస్యనైనా నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తానని తెలియపరుస్తున్నాను. ఈసారి మన గ్రామంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క ఓటును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. ముఖ్యంగా యువత తప్పుతోవలో నడవకుండా ఆలోచించి మంచి చేసే నాయకునికి మీ ఓటువేసి ఎన్నుకోవాలని వెంకటాపూర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్టి ప్రచార కార్యక్రమంలో తన ప్యానల్ సభ్యులు దుర్గంబోయిని పోచయ్య, దుర్గం బోయిని సుజాత, బోయిని పోచయ్య, కుదై గారి సలీంలను కూడా వార్డు సభ్యులుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, ఇట్టి కార్యక్రమంలో అంబదాస్,మహేష్, ఖదీర్, శేఖర్, శివకుమార్, రాజు, నరేష్, బి. యాదగిరి మరియు గ్రామ ప్రజలు మొదలగు వారు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Wednesday, December 10, 2025
ఒక్క అవకాశం ఇవ్వండి వెంకటాపూర్ సర్పంచ్ అభ్యర్థి కౌవులే యాదగిరి
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment