Showing posts with label MLA CHINTH PRABHAKAR. Show all posts
Showing posts with label MLA CHINTH PRABHAKAR. Show all posts

Tuesday, February 24, 2026

మాజీ మంత్రి టీ. హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్‌వీ నాయకుడు అఖిల్

 

సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 23 (SNM న్యూస్): హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్  ఆధ్వర్యంలో మాజీ మంత్రి టి. హరీష్ రావుని బీఆర్‌ఎస్‌వీ నాయకుడు అఖిల్ కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, ప్రజలు మళ్లీ అభివృద్ధి పాలన కోరుకుంటున్నారని హరీష్ రావు గారు విశ్వాసం వ్యక్తం చేసినట్లు అఖిల్ తెలిపారు. యువత పార్టీకి అండగా నిలవాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చినట్లు చెప్పారు.

Wednesday, December 17, 2025

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన నూతన సర్పంచ్ లు

సంగారెడ్డి, డిసెంబర్ 17 (SNM NEWS): గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇరిగిపల్లి గ్రామ సర్పంచ్ సుప్రియ - సతీష్, గుంతపల్లి సర్పంచ్ అనంత రెడ్డి లు  ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చంతో సత్కరిచి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు... రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి విజేందర్ రెడ్డి ఆర్.వెంకటేశ్వర్లు, పీ.నర్సింలు ,మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, సందీప్, జలంధర్ , పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Saturday, November 15, 2025

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సామూహిక కార్తీక మాస వనభోజనాలు

 


సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 15 (SNM న్యూస్):  సంగారెడ్డిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్ హాజరయ్యారు. పద్మశాలి బంధువులు, సంఘ పెద్దలను చింత సాయినాథ్ ఆప్యాయంగా పలకరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, పెద్దలకు, యువతకు ధన్యవాదాలు తెలుపుతూ.. సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని అయన సూచించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ ప్రతినిధులు చింతసాయినాథ్ని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలతో వనభోజన వేడుక సందడిగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి సంఘం జనరల్ సెక్రెటరీ మాచర్ల రామచంద్రరావు, ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ సోమచంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు పండరి, జిల్లా అధ్యక్షులు కొప్పెర హరి హర కిషన్, జిల్లా జనరల్ సెక్రెటరీ తాటికొండ అశోక్, అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు గజేంద్ర కృష్ణ, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు మంజుల, సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నాయకులు కూలిపాక యాదగిరి, సోమ రమేష్, పుండరీకం, రాఘవులు, ముత్యాల ప్రసాద్, సాయి ప్రసాద్ శ్రీశైలం, గడ్డం శ్రీశైలం, బలరాం, మేకల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి -టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 14 (SNM News):   పండిట్ జవహర్ లాల్ నెహ్రు 136 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారా? మిషన్లు ఓట్లేశాయా? అర్థం కావడం లేదన్నారు. నేను రాహుల్ గాంధీ కి ఒకటే చెప్పదలుచుకున్న, బీహార్ పోతే పోయింది. కానీ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు. మోతీలాల్ నెహ్రూ,  జవహర్ లాల్ నెహ్రూ ల కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులు పంచారు, ప్రాణాలిచ్చారు.. మంచి పరిపాలన చేశారు. కొంతమంది  రాజకీయ మూర్ఖులు ఆ కుటుంబం దేశం కోసం ఏం చేసిందని మాట్లాడటం బాధాకరం అని అన్నారు. భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 136 వ జయంతి సందర్భంగా  టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  ఆధ్వర్యంలో సంగారెడ్డి లో ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమంలో  టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి పాత బస్టాండ్  రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద  బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం లో బాలలు సంతోషంగా పాల్గొన్నారు. పండిట్ నెహ్రూ, ఇందిరా గాంధి, రాజీవ్ గాంధీ ల జీవిత చరిత్ర ను తెలిపేలా ప్రత్యేక డాన్స్, స్కిట్  లతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. భారత దేశ అభివృద్ధి కి ప్రధాన మంత్రి గా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు, భారీ ప్రాజెక్టు ల రూపకల్పన, ఐఐటి, ఐఐఎం ల ఏర్పాటు వంటి అంశాలను కళ్ళకు కట్టినట్టు కళాకారులు ఈ కార్యక్రమంలో చూపించారు.

Thursday, September 18, 2025

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడ్డా కూడా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని అతివేగంగా నడపడం వలన లారీ ముందు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను సంగారెడ్డి రూరల్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామును పునరుద్ధరించారు

Wednesday, September 03, 2025

నియోజకవర్గ సమస్యలను పరిష్కరించండి -చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే సంగారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలసి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ తో కూడిన వినతి పత్రం అందజేశారు.  నియోజవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు, రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మొత్తం 20 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఎమ్మెల్యే కి 40 శాంతం మంజూరు నిమిత్తం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం, ఎమ్మెల్యే ద్వారా పంపిన లబ్ధిదారుల ప్రతిపాదనలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి సూచించిన ఎండర్స్ మెంట్ లేఖను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు అందజేశారు. వెంటనే తగు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపినారు. మున్సిపాలిటీలలో  టియుఎఫ్ఐడిసి కింద మంజూరు అయినా పనులు వేగవంతంగా చేపట్టుటకు కోరారు. రెండు మున్సిపాలిటీల్లో మొన్న కురిసిన వర్షాలకు అధిత మొత్తంలో రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వాటిని గుర్తించి వెంటనే పనులు చెప్పుటకు అంచనాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. నీటి సమస్యలు రాకుండా చూడాలని, అత్యవసర పరిస్థితిలో నీటి సౌకర్యం ఏర్పాటు కోసం మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. ఫసల్వాది డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణమునకు రూ. 81.50 లక్షలతో ప్రతిపాదనలు.. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థని కూడా ఏర్పాటు చేయుటకుగాను రూపాయలు కోటి 36 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు. మల్లెపల్లి నుంచి హరిదాస్ పూర్ కు చేపడుతున్న రోడ్డులో భాగంగా తెర్పోల్ గ్రామంలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు సమర్పించారు. సదాశివపేట పట్టణంలోని ఫెయిర్ ప్రైస్ షాపులను రేషనలైజేషన్ చేయుటకు గాను ప్రతిపాదనను సమర్పించారు. ఎందుకనగా ఒక ఫెయిర్ ప్రైస్ షాపులలో 300 మంది ఉంటే ఒక ఫెయిర్ ప్రైస్ లో వెయ్యికి పైగా కార్డు హోల్డర్స్ ఉండడం వలన అధిక పనిబారంతో ప్రజలకు సత్వరమే సేవలందించుటలో జాప్యము జరుగుతున్నందున దీనిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే ఫెయిర్ ప్రైస్ రేషనలైజేషన్ చేయుటకు గాను ప్రతిపాదించారు. జనాభ దృష్టిలో ఉంచెకొని నూతన ఫెయిర్ ప్రైస్ షాపుల ఏర్పాటుకు ప్రతిపదించారు. కంది మండలం బేగంపేట గ్రామంలో ఫిషర్మెన్ కోపరేటివ్ సొసైటీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సర్వేనెంబర్ 249 నుండి 1000 గజాలు కేటాయించకుగాను ప్రతిపాదనలు అందజేసినారు. ఎమ్మెల్యే వెంట మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, అక్బర్ తదితరులు ఉన్నారు.


రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి -ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సదాశివపేట ఏఓ రమేష్ తో ఫోన్ లో మాట్లాడి యూరియా కొరత పై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని సూచించారు. యూరియా స్టాక్ అందుబాటులో ఉంచాలని  రైతులను యూరియా కోసం ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. స్టాక్ ఎంత ఉంది అని అడిగి తెలుసుకున్నారు. యూరియా కోసం రైతులను క్యూ లైన్ లో, చెప్పులు ఉంచకుండా యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి ఉన్నారు.


ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...