Showing posts with label Sangareddy brs. Show all posts
Showing posts with label Sangareddy brs. Show all posts

Sunday, February 01, 2026

కెసిఆర్‌పై సిట్ విచారణను ఖండిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

 

సంగారెడ్డి, (ప్రత్యేక ప్రతినిధి):మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సిట్ విచారణ చేపట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు.గ్రామానికి చెందిన మాజీ డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం సూచన మేరకు, టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచ్ చింతల సాయన్న ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మాజీ సీఎం కెసిఆర్‌పై సిట్ విచారణ చేపట్టారని ఆరోపించారు. ప్రజా ఉద్యమాల ద్వారా అధికార పార్టీ అన్యాయాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ వార్డు సభ్యులు చింటూ, మురళి పాల్గొనగా, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దిగోల లింగమయ్య, గొడుగు వెంకటేశం, పులంగారి కామేశ్వర్, రమేష్, బాబా, హరి తదితరులు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు.

Thursday, December 18, 2025

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన లింగంపల్లి సర్పంచ్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ సర్పంచ్ ఇర్ఫాన్ పటేల్ శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండుతూ వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్‌కు సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా గ్రామాభివృద్ధికి సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్. వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్, విఠల్, మసుధ్, ముజీప్, మాజీ వైస్ ఎంపీపీ బాబా పటేల్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆఫ్సార్, సంపత్, మతిన్, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.

కంబాలపల్లిలో తొట్టెల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి – కరుణశ్రీ దంపతుల రెండవ కుమార్తె తొట్టెల కార్యక్రమం శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్తో కలిసి హాజరై శిశువుకు ఆశీస్సులు అందజేసి, శ్రీహరి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నారి ఆయురారోగ్యాలతో పెరిగి కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీహరి కుటుంబం సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ తొట్టెల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ద గొల్ల మల్లమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, వార్డు సభ్యులు ఖలీల్, అనసూయ, బాబు, అంజిరెడ్డి, అలాగే శ్రీశైలం, మల్లేశం, పాండు, జానీ మియా తదితర గ్రామ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Wednesday, December 17, 2025

సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను కలిసిన నూతన సర్పంచ్ లు

సంగారెడ్డి, డిసెంబర్ 17 (SNM NEWS): గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగాలని తన పూర్తి మద్దతు సహకారం ఉంటుందని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన ఇరిగిపల్లి గ్రామ సర్పంచ్ సుప్రియ - సతీష్, గుంతపల్లి సర్పంచ్ అనంత రెడ్డి లు  ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఎమ్మెల్యే వారికి శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్చంతో సత్కరిచి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బిఆర్ఎస్ పాలనలో గ్రామ పంచాయతీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు... రానున్నది బిఆర్ఎస్ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సిడిసి విజేందర్ రెడ్డి ఆర్.వెంకటేశ్వర్లు, పీ.నర్సింలు ,మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు చక్రపాణి, సందీప్, జలంధర్ , పంచాయతీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...