సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని విజయలక్ష్మి పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో కళా ప్రదర్శన నిర్వహించారు. చదువు యొక్క ప్రాముఖ్యత, డ్రగ్స్, మూఢనమ్మకాల నిర్మూలన, పచ్చదనం పరిశుభ్రత వంటి తదితర అంశాలపై కళారూపాలతో అవగాహన కల్పించారు. యువత విద్యార్థులు గంజాయి డ్రగ్స్ వంటి ద్రవ్యాలకు అలవాటు పడకూడదని తెలిపారు. డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్ధాలను వివరించారు. విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రుల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చదువు వలన సమాజంలో మంచి గుర్తింపు హోదా గౌరవం లభిస్తాయని వివరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని అన్నారు. అప్పుడే అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటారని తెలియజేశారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని సూచించారు. బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలని కోరారు. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ హెపటైటిస్ వంటి జబ్బులు రాకుండా ఉండాలంటే గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చడం వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కళాకారులు ఎ. సునీల్ కుమార్, డి. రమేష్, ఎస్. మల్లేష్, జి. బిక్షపతి, బి. నవీన్ కుమార్, ఎన్. రవిందర్, పి. సంధ్య పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Thursday, December 18, 2025
డ్రగ్స్ నిర్మూలన పై కళా ప్రదర్శన సాంస్కృతిక సారథి కళాజాత
Subscribe to:
Post Comments (Atom)
నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు
సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment