Showing posts with label raicode. Show all posts
Showing posts with label raicode. Show all posts

Friday, June 05, 2026

పరిసరాల పరిశుభ్రత పై శ్రద్ద వహించాలి

 

రాయికోడ్ జూన్ 4: వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత పాటించాలని రాయికోడ్ ఎంపిడిఓ ఎం.ఎం షరీఫ్ అన్నారు. గురువారం రాయికోడ్ మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామం లో సర్పంచ్ షబానా నాజ్ మహబూబ్ పటేల్ ఆధ్వర్యంలో  ప్రజాపాలన పల్లెప్రగతి గ్రామ సభ నిర్వహించారు. సమావేశానికి ఎంపిడిఓ హాజరై మాట్లాడుతూ  గ్రామాభివృద్ధి, వర్షాకాల సన్నద్ధత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సురక్షిత త్రాగునీటి వినియోగం, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ అవసరం, మొక్కల పెంపకం ద్వారా పర్యావరణ పరిరక్షణ, వన మహోత్సవ కార్యక్రమాల ప్రాధాన్యంపై అధికారులు వివరించారు. అలాగే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం, వరదల సమయంలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై గ్రామస్థులకు సూచనలు చేశారు. 

గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని, పరిశుభ్రమైన వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని  కోరారు. గ్రామస్థులు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు, సర్పంచ్ షబానా నాజ్ మహబూబ్ పటేల్ హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో సర్పంచ్ మహబూబ్ పటేల్ తో కలిసి పర్యటించి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మంచి నీటి ఫిల్టర్ ను పరిశీలించి సర్పంచ్ ను అభినందించారు. ఈ సందర్బంగా మొక్కలు నాటి నీళ్లు పోశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బస్వరాజ్, ఫీల్డ్ అసిస్టెంట్ అల్తాఫ్, వార్డ్ మెంబర్ లు, పలువురు గ్రామ స్థాయి అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sunday, January 25, 2026

పాఠశాల అభివృద్ధికి సర్పంచ్ కృషి అభినందనీయం

రాయికోడ్, జనవరి 23(SNM న్యూస్): తమ పాఠశాల అభివృద్ధి కోసం సహాకారం చేస్తున్న మామిడిపల్లి గ్రామ సర్పంచ్ కృషి అభినందనీయమని రాయికోడ్ ఎంపిడిఓ ఎం.ఎం షరీఫ్, ఎంఈఓ మానయ్య, కర్చల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ నర్సింలు అన్నారు. రాయికోడ్ మండలం మామిడిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్థానిక సర్పంచ్ షబానా నాజ్ మహబూబ్ పటేల్ స్వంత ఖర్చులతో స్పోర్ట్స్ డ్రెస్ లు, ఐడెంటిటీ కార్డులు పంపిణి చేశారు. అంతకు ముందు మామిడిపల్లి గ్రామానికి నూతనంగా మంజూరైనా ప్రీ ప్రైమరి క్లాస్ రూమ్ ను ఎంపిడిఓ, ఎంఈఓ, కంప్లెక్స్ హెడ్ మాస్టర్ లు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు తో ప్రయివేట్ పాఠశాల కు దీటుగా బోధన, మంచి సౌకర్యాlu ఉంటాయన్నారు. పాఠశాలల బలోపేతం గ్రామభివృద్ధికి కీలకమని దాతల సాయం ఆ దిశగా మంచి ప్రయత్నమని అభినందించారు. అనంతరం అక్షయ పాత్ర భోజనాన్ని పిల్లలకు వడ్డించి వారు రుచి చూశారు. కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనసూయ దేవి, పంచాయతీ కార్యదర్శి బస్వారాజు, వార్డ్ సభ్యులు,  మాజీ పీ.ఎ.సి.ఎస్ చైర్మన్ నజీర్, దాత బగిలి సమీర్ ఫీల్డ్ అసిస్టెంట్ అల్తాఫ్, వీఓఏ మల్లేశం, అంగన్వాడీ సిబ్బంది, నాయకులు భీమ్ రావు, మాణిక్యయ్య, అంజి, హాసన్ పటేల్, శంకర్, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Saturday, January 24, 2026

జాతీయ ఓటర్ దినోత్సవం - వసంత పంచమి ఘనంగా నిర్వహణ

 

రాయికోడ్, జనవరి 23 (SNM న్యూస్): ఎం. పి. పి. స్ రాయికోడ్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు విలువను ప్రజలకు తెలియజేయడం, యువతలో ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి.శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకొని, ఎన్నికల ప్రక్రియలో బాధ్యతాయుతంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు,జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేయడం అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడాయి. ప్రజలలో ఎన్నికలపై నమ్మకం పెంపొందించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. శ్రీనివాస్ తెలిపారు.

అదే విధంగా శుక్రవారం వసంత పంచమి పర్వదినం కూడా కావడంతో, జ్ఞానం, విద్య, కళలకు ప్రతీక అయిన శ్రీ సరస్వతి దేవిని భక్తిశ్రద్ధలతో పూజించారు. వసంత ఋతువు ఆరంభాన్ని సూచించే ఈ పర్వదినం విద్యార్థులలొ నూతనోత్సాహాన్ని నింపుతుంది. జాతీయ ఓటర్ దినోత్సవం మరియు వసంత పంచమి ఒకే రోజున రావడం విశేషమని, జ్ఞానం, బాధ్యతాయుత పౌరసత్వం కలిసి సమాజ అభివృద్ధికి దోహదపడతాయని పాఠశాల ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాదవులు, సల్మా,తులసి, శ్రావణి,శోభ, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...