Showing posts with label sahareddycollector. Show all posts
Showing posts with label sahareddycollector. Show all posts

Sunday, February 08, 2026

పులిమామిడి మమత గెలుపు కొరకు కష్టపడుతున్న రాజన్న మిత్రులు

 

 సదాశివపేట, ఫిబ్రవరి 8 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని 12 వ వార్డు నుండి పోటీ చేస్తున్న పులిమామిడి మమత రాజు దంపతుల గెలుపుకొరకు కృషి చేస్తున్న రాజన్న మిత్రబృందం ఖర్చర్ల హరీష్ కుమార్, సుభాష్, పోల ప్రభు.ఇట్టి సందర్భంగా ఖర్చర్ల హరీష్ కుమార్ మాట్లాడుతూ మా అన్న 12 వ వార్డులో చేసినటువంటి సేవలు మేము ఎన్నటికీ మరచి పోలేమని, మా వార్డు నందు పులిమామిడి రాజన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏదోఒక రకంగా  తమ సహాయాన్ని అందించారని, వార్డునందు రోడ్లు గాని, మంచి నీటి సదుపాయం, మిషన్ భగీరథ ద్వారా నల్లకనెక్షన్ గాని, పింఛన్లు, షాదిమూభారక్, కళ్యాణ లక్షి, డ్రైనేజీ వ్యవస్థ, ఇందిరమ్మ ఇండ్లను సాంక్షన్ చేయించారు. ఇన్ని కార్యక్రమాలు అందిందించిన మా అన్న పులిమామిడి రాజన్న సతీమణి ఐన పులిమామిడి మమత యొక్క చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలని వారు ఓటరు మహాషయులను విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Thursday, December 18, 2025

జి హెచ్ ఎం సి పరిధిలో విలీనమైన ప్రాంతాల ఉద్యోగ, ఉపాధ్యాయులకు 24శాతం హెచ్ ఆర్ ఏ వర్తింపజేయాలి -జిల్లా కలెక్టర్‌కు పిఆర్ టియు టి ఎస్ వినతి

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS):

సంగారెడ్డి జిల్లా పరిధిలో జి హెచ్ ఎం సి లో నూతనంగా విలీనమైన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 24 శాతం హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ ఆర్ ఏ) వర్తింపజేయాలని కోరుతూ పిఆర్ టియు టి ఎస్ సంగారెడ్డి జిల్లా శాఖ గౌరవ జిల్లా కలెక్టర్ ఎ.ప్రావీణ్య కి వినతిపత్రం సమర్పించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల 27 మున్సిపాలిటీలను జి హెచ్ ఎం సి పరిధిలోకి విలీనం చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని బొల్లారం, తెల్లాపూర్, అమీన్‌పూర్ మున్సిపాలిటీలు జి హెచ్ ఎం సి పరిధిలోకి వచ్చాయని పిఆర్ టియు టి ఎస్ జిల్లా అధ్యక్షులు ఎ.మాణయ్య తెలిపారు. జి హెచ్ ఎం సి పరిధి విస్తీర్ణం పెరిగిన నేపథ్యంలో, 8 కిలోమీటర్ల పరిధిలో విలీనమైన గ్రామాలు, పట్టణాలలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెరిగిన జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని మూల వేతనంపై 24 శాతం హెచ్ ఆర్ ఏ తో పాటు అర్హులైన వారికి సిటీ కంపెన్సేటరీ అలవెన్స్ (సి సి ఏ) కూడా మంజూరు చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఎ.ప్రావీణ్య, అంశాన్ని సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సహకరించిన ఉపాధ్యాయులను అభినందించారు. స్టేజ్-2 అధికారులకు అందుతున్న అతి తక్కువ రెమ్యునరేషన్ అంశాన్ని తమ దృష్టికి తీసుకురాగా, వారికి అదనంగా రూ.1,000 చెల్లించనున్నట్లు కూడా కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రతినిధ్య కార్యక్రమంలో పటాన్‌చెరు మండల శాఖ అధ్యక్షులు ఎం.విఠల్ రెడ్డి, రామచంద్రాపురం మండల శాఖ ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, అమీన్‌పూర్ మండల శాఖ అధ్యక్షులు ఆనంద్, జిన్నారం మండల శాఖ ప్రధాన కార్యదర్శి పవన్ రాజ్, రాష్ట్ర బాధ్యులు త్రిశూల్, మొగులయ్య, బ్రహ్మ ఋషి, రామకృష్ణారెడ్డి, దేవదాస్ తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ నిర్మూలన పై కళా ప్రదర్శన సాంస్కృతిక సారథి కళాజాత

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య  ఆదేశాల మేరకు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారిని విజయలక్ష్మి  పర్యవేక్షణలో సంగారెడ్డి జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో కళా ప్రదర్శన నిర్వహించారు. చదువు యొక్క ప్రాముఖ్యత, డ్రగ్స్, మూఢనమ్మకాల నిర్మూలన, పచ్చదనం పరిశుభ్రత వంటి తదితర అంశాలపై కళారూపాలతో అవగాహన కల్పించారు. యువత విద్యార్థులు గంజాయి డ్రగ్స్ వంటి ద్రవ్యాలకు అలవాటు పడకూడదని తెలిపారు. డ్రగ్స్ వాడడం వలన కలిగే అనర్ధాలను వివరించారు. విద్యార్థుల కదలికలపై తల్లిదండ్రుల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. చదువు వలన సమాజంలో మంచి గుర్తింపు హోదా గౌరవం లభిస్తాయని వివరించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చాలని అన్నారు. అప్పుడే అనారోగ్య సమస్యలకు గురి కాకుండా ఉంటారని తెలియజేశారు. దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని సూచించారు. బహిరంగ మలవిసర్జనకు స్వస్తి పలకాలని కోరారు. డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ హెపటైటిస్ వంటి జబ్బులు రాకుండా ఉండాలంటే గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చడం వల్ల సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. కళాకారులు ఎ. సునీల్ కుమార్, డి. రమేష్, ఎస్. మల్లేష్, జి. బిక్షపతి, బి. నవీన్ కుమార్, ఎన్. రవిందర్, పి. సంధ్య పాల్గొన్నారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన లింగంపల్లి సర్పంచ్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ సర్పంచ్ ఇర్ఫాన్ పటేల్ శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండుతూ వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్‌కు సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా గ్రామాభివృద్ధికి సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్. వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్, విఠల్, మసుధ్, ముజీప్, మాజీ వైస్ ఎంపీపీ బాబా పటేల్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆఫ్సార్, సంపత్, మతిన్, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి డా. అల్లాని కిషన్ రావు పేరు పెట్టాలి -తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఇరిగిజ్జ మురళీ కృష్ణ డిమాండ్

 

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్‌చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అల్లాని కిషన్ రావు  సేవలను గుర్తిస్తూ, నూతనంగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆయన పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి, జనం బాట – సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఇరిగిజ్జ మురళీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్‌చేరు అంటే పరిశ్రమలు, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కోసం న్యాయస్థానాల దాకా పోరాడి, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్ జి టీ) తీర్పు ద్వారా పరిశ్రమల నుంచి సి ఎస్ ఆర్ నిధులు సాధించడంలో దివంగత డా. అల్లాని కిషన్ రావు కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన నిరంతర పోరాట ఫలితంగానే వందల కోట్ల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో పటాన్‌చేరు ప్రాంతంలో నూతన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. పటాన్‌చేరు ప్రాంతంలోనే జన్మించిన డా. అల్లాని కిషన్ రావు పదవి, పేరు కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం నిజాయితీగా పోరాడిన మచ్చలేని నాయకుడని మురళీ కృష్ణ అన్నారు. అలాంటి వ్యక్తి పేరును ఆస్పత్రికి పెట్టడం ద్వారా ఆయన సేవలకు తగిన గౌరవం లభించడమే కాకుండా, రాబోయే తరాలకు ప్రజల కోసం పోరాడితే మార్పు సాధ్యమనే సందేశం అందుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పటాన్‌చేరు ప్రజల తరపున  కల్వకుంట్ల కవిత  సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయగా, తెలంగాణ జాగృతి నాయకులు కలెక్టర్‌ను కలిసి ఆ లేఖను స్వయంగా అందజేశారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ ప్రతిపాదనను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్ మిశ్రా, బస్తెపురం పోచయ్య, మేధావుల ఫోరం నాయకులు రెడ్డిబోయిన భిక్షపతి పాల్గొన్నారు.

Tuesday, December 16, 2025

మూడవ విడత పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి -జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య



సంగారెడ్డి, డిసెంబర్ 16 (SNM NEWS):

జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య తెలిపారు.మూడవ విడతలో జిల్లాలోని కల్హేర్, కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణఖేడ్, నిజాంపేట్, న్యాల్కల్, సిర్గాపూర్ మండలాల్లో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. ఈ మండలాల్లోని 234 సర్పంచ్ స్థానాలకు గాను 27 స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 207 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. అలాగే 1960 వార్డు మెంబర్ స్థానాలకు గాను 422 వార్డులు ఏకగ్రీవం కాగా, ఒక వార్డులో సింగిల్ నామినేషన్ అభ్యర్థి ఉపసంహరణ చేసుకున్న కారణంగా 1537 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మూడవ విడత ఎన్నికలు జరగనున్న 8 మండలాల్లో మొత్తం 2,25,483 మంది ఓటర్లు ఉన్నారని, అందులో 1,13,019 మంది పురుషులు, 1,12,456 మంది మహిళలు, 8 మంది ఇతరులు ఉన్నారని ఆమె వివరించారు. పోలింగ్ నిర్వహణకు గాను  1769 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకు 2477 మంది పోలింగ్ అధికారులు (POలు), 2762 మంది ఓపిఓ లు, 8 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించినట్లు, 351 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వివరాలు: కల్హేర్ మండలం – కల్హేర్ జడ్‌పీహెచ్‌ఎస్.

కంగ్టి మండలం – తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కళాశాల

మనూర్ మండలం – జడ్‌పహెచ్ హైస్కూల్

నాగల్ గిద్ద మండలం – జిల్లా పరిషత్ హై స్కూల్

నారాయణఖేడ్ – ప్రభుత్వ డిగ్రీ కళాశాల

నిజాంపేట్ మండలం – నిజాంపేట్ జడ్‌పీహెచ్‌ఎస్

సిర్గాపూర్ మండలం – ఎంపీడీవో కార్యాలయం

న్యాల్కల్ మండలం – ప్రభుత్వ జూనియర్ కళాశాల, రైతు వేదిక లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు  ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించు కోవాలని, పారదర్శక ఎన్నికలకు సహకరించాలని  కలెక్టర్   కోరారు.

Saturday, November 15, 2025

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సామూహిక కార్తీక మాస వనభోజనాలు

 


సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 15 (SNM న్యూస్):  సంగారెడ్డిలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజన కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే తనయుడు బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు చింత సాయినాథ్ హాజరయ్యారు. పద్మశాలి బంధువులు, సంఘ పెద్దలను చింత సాయినాథ్ ఆప్యాయంగా పలకరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు, పెద్దలకు, యువతకు ధన్యవాదాలు తెలుపుతూ.. సంఘ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని అయన సూచించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘ ప్రతినిధులు చింతసాయినాథ్ని సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలతో వనభోజన వేడుక సందడిగా ముగిసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర పద్మశాలి సంఘం జనరల్ సెక్రెటరీ మాచర్ల రామచంద్రరావు, ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ సోమచంద్రశేఖర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు పండరి, జిల్లా అధ్యక్షులు కొప్పెర హరి హర కిషన్, జిల్లా జనరల్ సెక్రెటరీ తాటికొండ అశోక్, అధ్యక్షుడు పట్టణ అధ్యక్షుడు గజేంద్ర కృష్ణ, జనరల్ సెక్రెటరీ సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు మంజుల, సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నాయకులు కూలిపాక యాదగిరి, సోమ రమేష్, పుండరీకం, రాఘవులు, ముత్యాల ప్రసాద్, సాయి ప్రసాద్ శ్రీశైలం, గడ్డం శ్రీశైలం, బలరాం, మేకల జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 16న జరిగే న్యాయ సాధన దీక్షను జయప్రదం చేయండి

సంగారెడ్డి, నవంబర్ 15 (SNM న్యూస్): బిసి న్యాయ సాధన దీక్ష తెలంగాణ  బి సి జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి  పిలుపుమేరకు తేదీ 16 నవంబర్ 2025 ఆదివారం నాడు ఉదయము 11 గంటల నుండి సాయంత్రము నాలుగు గంటల వరకు సంగారెడ్డి జిల్లాబిసి  జేఏసీ ఆధ్వర్యంలోన్యాయ  సాధన దీక్ష కలదు ఇట్టి న్యాయసాధన దీక్ష కొత్త బస్టాండ్ పక్కన నటరాజ్ టాకీస్ ముందు దీక్షా స్థలంను ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టిదీక్ష ముఖ్య ఉద్దేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇట్టి దీక్షను సంగారెడ్డి జిల్లా లోని అన్ని నియోజకవర్గ, పట్టణ మండల కేంద్రాల్లో బీసీ సోదరి సోదరులందరూ విజయవంతం చేయాలని కోరడం జరిగినది ఇట్టి దీక్ష ను న్యాయవాదులు డాక్టర్లు మేధావి వర్గంఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు యువతియువకులు విద్యార్థిని విద్యార్థులు అన్నిబిసి కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని జిల్లా బీసీ జేఏసీకన్వీనర్ ప్రభుగౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సంగారెడ్డి జిల్లాబీసీ జేఏసీ  వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ కో కన్వీనర్లు రవి మానస మంగ గౌడ్ తదితరులు పాల్గొన్నారు...

Wednesday, October 01, 2025

జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు – జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

 

విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ,జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలను నింపాలని, చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. మాత  దుర్గాదేవి కృపతో అందరూ ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని కలెక్టర్ కోరారు. ఈ విజయదశమి ప్రతి ఒక్కరికి విజయాలు చేకూర్చాలని అభిలాషించారు. అందరూ శాంతియుత, ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను జరుపుకోవాలని ఆమె సూచించారు.

Thursday, September 18, 2025

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడ్డా కూడా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని అతివేగంగా నడపడం వలన లారీ ముందు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను సంగారెడ్డి రూరల్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామును పునరుద్ధరించారు

Wednesday, September 17, 2025

ఆర్ఆర్ఆర్ భూసేకరణ పనుల వేగవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనుల  వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్ పి  ప్రావీణ్య , రెవెన్యూ అధికారులను ఆదేశించారు . బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  రెవెన్యూ అధికారులతో రీజినల్ రింగ్ రోడ్, రోడ్ ఓవర్ బ్రిడ్జీలు  నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణలో ప్రజల న్యాయమైన హక్కులు కాపాడబడేలా, రైతులకు న్యాయం జరుగేలా, అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్దాపూర్, గిర్మాపూర్ శివాంపేట్ మండలాల్లో భూసేకరణ సమస్యలపై సవివర చర్చ జరిపి, వాటికి సాధ్యమైన పరిష్కారాలను సూచించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ విషయమై భూముల  సమస్యలు ఉత్పన్నం కాకుండా  చర్యలు చేపట్టాలని అన్నారు . భూసేకరణలో న్యాయం జరిగేలా  విక్రయ విలువలను ఆధారంగా పరిగణించాల్సిందిగా పేర్కొన్నారు. అదేవిధంగా, జహీరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయబోతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ నిమ్జ్ కు సంబంధించిన భూసేకరణ పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టి జి ఐ ఐ సి)ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు, నిమ్జ్ లో భాగంగా జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయబడనున్నది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమైన భూముల సేకరణపై అధికారులు సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ మాధురి, రెవెన్యూ అధికారులు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పత్తి కొనుగోలు పై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం


 సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): 2025-26 సీజన్ పత్తి కొనుగోలు,  సంబంధించి బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్  పి.ప్రావీణ్య, సంబంధిత మిల్లర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  2025-26 సీజన్ జిల్లా వ్యాప్తంగా  3,48,775ఎకరాల్లో పత్తి సాగు చేయగా 2,79,020 మెట్రిక్  టన్నులు దిగుబడి అంచనా వేయడం జరిగిందని. ఇందుకు తగ్గట్టు గా సజావుగా కొనుగోలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. పత్తి కొనుగోలు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఆరు మార్కెటింగ్ యార్డులపరిధిలో 24 జిన్నింగ్ మిల్లుల  నుండి, సి.సి.ఐ. ద్వారా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు  ప్రారంభమయ్యేలా  అధికారులు  చర్యలు  చేపట్టాలని అన్నారు .  సీసీఐకి పత్తి అమ్ముకోవాలంటే ఆధార్ ప్రామాణికత అనేది తప్పనిసరి అని. పత్తి కొనుగోలు  చెల్లింపులను ఆధార్ తో అనుసంధానం అయిన బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేయడం జరుగుతుందని. జిల్లాలో గల అన్ని జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి సరిగా ఉండేలా చూడమని కలెక్టర్ ఆదేశించారు. లీగల్ మెట్రాలజీ  శాఖ అధికారులు  జిన్నింగ్ మిల్లులలో  తనిఖీలు నిర్వహించి నిర్వహించాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జీన్నింగ్ మిల్లుల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకునేలా అగ్నిమాపక శాఖ అధికారి విజిట్ చేసి సూచనలు చేయాలన్నారు.జిన్నింగ్ మిల్లులలో రైతులకు కనీస మౌలిక వసతులైన తాగునీరు, నీడ వంటి సదుపాయాలను కచ్చితంగా కల్పించాలని ఆదేశించారు.జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు జరిపేటప్పుడు టోకెన్ సిస్టం అమలు చేసి క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్  మాధురి, జిల్లా మార్కెటింగ్ అధికారి రషీద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  శివ ప్రసాద్, అగ్నిమాపకశాఖ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారులు, జీన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

పిసిపిఎన్డిటి పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. -అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

 


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS):నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన బుధవారం  తన ఛాంబర్  పిసిపి ఎన్ డి టి ఆక్ట్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పూర్తిగా నిషేధితమన్నారు. ఇందుకోసం ప్రభుత్వం పిసిపి ఎన్డిటి యాక్ట్ ను అమల్లోకి తీసుకువచ్చింది అన్నారు.  పి సి పి ఎన్ డి టి గోడప్రతులు ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని అన్నారు. ఎక్కడైనా ముందస్తు గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆ సంస్థలపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల నమోదు స్థితిపై ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సమీక్ష జరిపారు. ఫార్మ్ అఫ్ రికార్డుల నిర్వహణ సమర్పణ సక్రమంగా నింపడంపై పరిశీలించారు.  అక్రమంగా నడుస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలపై సర్వైవల్ ఇన్స్పెక్షన్ చేపట్టి అవసరమైతే యంత్రాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు పెండింగ్ లో ఉన్న కేసులు ఇప్పటికే శిక్ష పడిన కేసుల స్థితిపై అదనపు కలెక్టర్ సమీక్ష జరిపారు. జిల్లాలో బాలికల జనాలను నిష్పత్తి గణాంకాలపై సమీక్షించారు. ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షల నిషేధంపై ప్రజలక అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు గర్భ శిశువులింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ఆరోగ్యశాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు పరస్పరం సమన్వయం చేస్తూ పిసిపిఎన్డిటి చట్టం అమలులో కఠినంగా వ్యవహరించాలన్నారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు  పి సి పి ఎన్ డి టి చట్టం ఉల్లంఘన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశాలు  నిరంతరంగా నిర్వహించేల చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రతినెల తనిఖీలు నిర్వహించడం తనిఖీల సంఖ్యను పెంచడం అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల రికార్డులు పరిశీలించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు ప్రజల్లో ఈ చట్టం పై అవగాహన కోసం గోడపత్రికలు ఏర్పాటు చేయడం మీడియా ద్వారా పాఠశాలలో కళాశాలలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ  నిర్మల, ఎన్ జి ఓ ప్రతినిధులు, పోలీస్ అధికారులు ఆరోగ్యశాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Monday, September 08, 2025

జెడ్పీటీసీ, ఎంపీటీసీ తుది ఓటరు జాబితా 10న విడుదల

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (SNM NEWS ): జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు జడ్పీ సీఈఓ జానకి రెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డి.ఆర్.ఓ పద్మజ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జడ్పీ సీఈఓ జానకి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10 వ తుది జాబితా వెలువరిస్తామని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో కూడా పార్టీ ప్రతినిధులను సూచించినట్లు పేర్కొన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు  కాంగ్రెస్ పార్టీ. పాషా. బి ఆర్ ఎస్. తారా సింగ్ . బిజెపి. మాణిక్ రావు . సిపిఎం. అడివయ్యా . సిపిఐ. కృష్ణ. ఎంఐఎం. యాకూబ్  అలీ . టిడిపి. బదయ్య. బీఎస్పీ. డేవిడ్ ,సంబంధిత  అధికారులు పాల్గొన్నారు.

ప్రతి తండాకు రోడ్డు కల్పన లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (SNM NEWS ): జిల్లాలో రహదారుల సౌకర్యం లేని గిరిజన తండాలలో రహదారులకు అనుసంధానమైయేలా ఎస్టీ-ఎస్ డి ఎఫ్ నిధులతో చేపట్టబోయే రహదారి నిర్మాణాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్  పి  ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలోని మినీసమావేశ మందిరంలో గిరిజనశాఖ ,పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కల్లెక్టర్, పి.ప్రావీణ్య, అదనపు కల్లెక్టర్ ( స్థానిక సంస్థలు ) చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి లు సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భముగా  కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు కనెక్టివిటీ లేని గిరిజన తండాలను గుర్తించి, వాహనాలు కూడా నడవలేని రోడ్లకు,  ముఖ్యంగా పీడబ్ల్యుడి రోడ్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ఎస్టీ-ఎస్ డి ఎఫ్ నిధులను వినియోగించాలి. సంబంధిత, గిరిజనశాఖ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే సమగ్ర నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలి. టెండర్ ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి, పనులు ప్రారంభించాలి అని ఆదేశించారు. ప్రతి తండాకు అవసరమైన రహదారి పొడవు, అంచనా వ్యయం,సాంకేతిక సమస్యలపై వివరమైన నివేదికలను రెండు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించారు. తక్షణం అమలు చర్యలు ప్రారంభించాలని సూచించారు. వర్షాకాలంలో రహదారులు సరిగా లేకపోవడం వలన గిరిజన కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య సేవలు, విద్య, అత్యవసర సేవలు  సమయానికి అందకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఎస్టీ-ఎస్ డి ఎఫ్ నిధులు వినియోగించి తక్షణమే రహదారుల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి జి ఈ డెబ్ల్యు ఐ డి సి ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను కూడా సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, కళాశాలలు, పాఠశాలల్లో టాయిలెట్స్, నిర్మాణం వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో గిరిజన శాఖ ఇంజనీరింగ్, ఆర్  అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీ రాజ్, విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.


ఈ నెల 13 వ తేదీన జాతీయ లోక్ అదాలత్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (SNM NEWS): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ నెల 13 వ తేదీన (శనివారం) జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గాన కేసులను పరిష్కరించుకొని సత్వర న్యాయం- సమన్యాయం పొందగలరు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో అనగా సంగారెడ్డి ,జహీరాబాద్, జోగిపేట్, నారాయణఖేడ్లలో ఈ జాతీయ లోక అదాలత్ నిర్వహిస్తున్నామని, దీనిని అందరూ ప్రజలు, కక్షిదారులు ఉపయోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్.జి.భవాని చంద్ర కోరనైనది.




Sunday, September 07, 2025

జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన 11వ రోజు గణనాథుని శోభాయాత్ర, నిమ్మజ్జనం

సంగారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 7 (SNM NEWS): తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణపతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎంతో సంతోషంగా, ఆనందోత్సాహాల నడుమ కుల మతాలకు అతీతంగా జరిగాయని, 11 రోజులపాటు పూర్తి నిబద్ధతో విధులు నిర్వర్తించి, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసినందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి అభినందనలు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేసారు. అదేవిధంగా ప్రశాంతంగా గణపతి ఉత్సవాలను పూర్తి చేయడానికి సహకరించిన జిల్లా యువత, గణపతి మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులకు, ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Wednesday, September 03, 2025

రెండవ విడత సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల


జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 2 (సిరి న్యూస్):

సంగారెడ్డి జిల్లాలో జరగబోయే గ్రామ పంచాయతీల రెండవ విడత సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి  సాయి బాబా గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలియజేస్తూ జిల్లాలో మొత్తం మండలాలు  25, గ్రామ పంచాయతీలు  613, మొత్తం వార్డులు  5370, మొత్తం పోలింగ్ స్టేషన్లు  5370, మొత్తం ఓటర్లు  7,44,157, పురుషులు  3,68,270, మహిళలు  3,75,843, ఇతరులు 44,జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు.

Tuesday, September 02, 2025

రూ.500 కోట్లతో సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య

 మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన
- టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (సిరి న్యూస్): సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరి కరణ పనులను 500 కోట్లతో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్  ఛాంబర్ లో టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, లతో కలిసి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులపై హెచ్ఎండిఏ, మున్సిపల్ నీటిపారుదల శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ సాగర్ చెరువులో చేపట్టబోయే సుందరీకరణ పనులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హెచ్ఎండిఏ అధికారులు ప్రదర్శించారు. రూ . 500 కోట్లతో మెహబూబ్ సాగర్ చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కలెక్టర్కు హెచ్ఎండి అధికారులు వివరించారు. సుందరీకరణలో భాగంగా మహబూబ్ సాగర్ చెరువు మధ్యలో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ నేరుగా మహబూబ్ సాగర్ చెరువులోకి కలవకుండా రానున్న 25 సంవత్సరాలకు సరిపోయేలా 23.5 ఎం ఎల్ డి ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేలా డిజైన్ సిద్ధం చేసినట్లు కలెక్టర్కు హెచ్ఎండి అధికారులు వివరించారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు .మహబూబ్ సాగర్ చెరువు నీటి నాణ్యతను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. మహబూబ్ సాగర్ చెరువును టూరిజం, రిక్రియేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నారు. హైవే నుండి ఐఐటి పక్కనుండి మహబూబ్ సాగర్ చెరువు వరకు 100 ఫీట్ల లింక్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్కు నిర్మలా జగ్గారెడ్డి వివరించారు. ప్రాజెక్టు రెండో దశలో 265 కోట్లతో డిసిల్టింగ్ చేసేలా ప్రణాళిక ఉందని హెచ్ఎండి అధికారులు తెలిపారు. చెరువు మధ్యలో ఉన్న సోమేశ్వరాలయం ను అభివృద్ధి చేయనున్నట్లు మెహబూబ్ సాగర్ కట్ట వెడల్పు సైక్లింగ్ ట్రాక్ రెండు లైన్ల బిటి రోడ్డు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. చెరువు మధ్యలో రూ.20 కోట్లతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు కట్ట నుండి విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నట్లు చెరువు మధ్యలో వాచ్ టవర్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబ్ సాగర్ చెరువు సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం ను రూ.9 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సుందరీకరణలో భాగంగా రెండో దశ పనులలో చెరువులో ఐలాండ్ లు, వాటర్ థీమ్ పార్క్, బోటింగ్ డెక్ ల ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. రూ.9 కోట్ల తో బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటుకు ప్రాజెక్టులు రూపకల్పన చేసినట్టు అధికారులు వివరించారు. వికలాంగులు వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
 

త్వరలో ముఖ్యమంత్రితో మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన
-నిర్మల జగ్గారెడ్డి, టీ జి ఐ సి చైర్మన్

మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.
మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.
మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.
మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.

ఈ సందర్భంగా కట్టపై తిరుగుతూ కలెక్టర్ కు గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను జగ్గారెడ్డి వివరించారు గతంలో నిధులు లేకుంటే తన సొంత నిధులు 50 లక్షల రూపాయలతో మున్సిపల్ డ్రైనేజీ వాటర్ కలవకుండా సోమేశ్వర ఆలయం చేరుకునేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్కు జగ్గారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో  సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...