Showing posts with label SADASHIVPETA. Show all posts
Showing posts with label SADASHIVPETA. Show all posts

Wednesday, June 03, 2026

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా అందరూ సమన్వయం తో పనిచేయాలి


-సదాశివపేట కార్యకర్తల సమావేశం లో సదాశివపేట వ్యవహారాల ఇంచార్జ్ తోపాజి అనంత్ కిషన్

సదాశివపేట జూన్ 3: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు పని చేయాలని టీపిసిసి  ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్ అన్నారు. బుధవారం సదాశివపేట పేట పట్టణం లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదాశివపేట కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ గా తోపాజి అనంత్ కిషన్ నియామకం అయిన అనంతరం  జరిగిన మొదటి సమావేశం ఇది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తోపాజి అనంత్ కిషన్, సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తోపాజి అనంత్ కిషన్ మాట్లాడుతూ  సదాశివపేట మున్సిపాలిటీ లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ లు, వార్డ్ ఇంచార్జి లు అందరూ సమన్వయం తో పనిచేయాలన్నారు. ఎవరి వార్డు పరిధి లో వారు పనిచేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలవని వార్డుల్లో వార్డ్ ఇంఛార్జ్ లదే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.  జగ్గారెడ్డి, డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సారథ్యం లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు మునిపల్లె సత్యనారాయణ, చిరు,  వాసిం,  సిద్దన్న, కంది కృష్ణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీహరి, పట్నం సుభాష్, చోటు భాయ్,    మున్సిపల్ కౌన్సిలర్లు శంకర్ గౌడ్, అరుణ్ కుమార్, నాగరాజు, నర్సింలు, విష్ణు వర్ధన్ రెడ్డి,  పట్టణ నాయకులు పాల్గొన్నారు.

Sunday, May 17, 2026

జనగణనలో ప్రజలు సహకరించాలి -సంగారెడ్డిలో ఎంఐఎం నేతల మీడియా సమావేశం

 

సంగారెడ్డి ప్రతినిధి, మే 16: కర్వాన్ ఎమ్మెల్యే, సంగారెడ్డి ఇన్‌చార్జి కౌసర్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఎంఐఎం పార్టీ సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న జనగణన ప్రక్రియలో ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. కుటుంబ యజమానితో పాటు కుటుంబ సభ్యుల వివరాలను సరైన ఆధార పత్రాలతో నమోదు చేయించుకోవాలని సూచించారు. ఇంటి పేరు, తండ్రి పేరు, వయస్సు, విద్యార్హతలు తదితర వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు. నిర్దేశిత గడువులోగా జనగణన నమోదు చేయించుకోకపోతే భవిష్యత్తులో ఓటరు జాబితాలో పేర్లు లేకపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇంటింటికి వచ్చే గణన సిబ్బందికి ప్రజలు సహకరించి అవసరమైన సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వ్యక్తిగత సహాయకుడు ముస్తాక్ మాట్లాడుతూ, జనగణన సమయంలో పేర్లు, ఇంటి పేర్లు, తండ్రి పేర్లు తదితర వివరాలను స్పష్టంగా నమోదు చేయించాలని సూచించారు. తప్పులు జరిగితే ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగించే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆశయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ముస్తాక్ సాహెబ్, ఎం.కె. నజీముద్దీన్, పట్టణ అధ్యక్షుడు మహ్మద్ ఫాజిల్ ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి మహ్మద్ యాకూబ్ అలీ, కౌన్సిలర్ ఏజాజ్, కార్యదర్శి ఇమ్రాన్ జైన్, యువ నాయకుడు సామి, జహంగీర్ భాయ్, మాజీ కౌన్సిలర్ అజ్జు భాయ్, షకీల్ భాయ్, రఫీ భాయ్, అస్లాం భాయ్, ఖాజా భాయ్, ఒమర్ భాయ్, సద్దాం జుల్కల్ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, March 03, 2026

12 వ వార్డు కౌన్సిలర్ పులి మామిడి మమత రాజు దంపతులను ఘనంగా సన్మానించిన ఉషాకిరణ్ యూత్ సభ్యులు

 

సంగారెడ్డి ప్రతినిధి మార్చి 03 (SNM న్యూస్): సదాశివపేట పట్టణంలోని పి.ఎం. ఆర్ క్యాంపు కార్యాలయంలో  సాధారణ మున్సిపల్ ఎన్నికలలో 12 వ వార్డునుండి గెలిచినటు వంటి పులిమామిడి మమత రాజు దంపతులను ఉషాకిరణ్ యూత్ సభ్యులు శాలువాలతో మరియు పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఇట్టి సందర్భంగా బామిని రవి కుమార్ మాట్లాడుతూ మా చిన్నానాటి మిత్రుడు పులిమామిడి రాజు రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత ఎత్తుకు యెదగాలని వారు ఇట్టి సందర్భంగా గుర్తు జేశారు. ఇలాంటి మంచి మిత్రుడు మాకందరికి దొరకడం మా పూర్వజన్మ సుకృతమని బామిని రవి  మరియు బుసరెడ్డి పల్లి వెంకటేశం అన్నారు. అదేవిధంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఇంత చక్కటి మిత్రులు నా వెన్నంటు ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు ఉషాకిరణ్ యూత్ సభ్యులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు, సభ్యులు, మరియు పి. ఎం. ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

Tuesday, February 24, 2026

ఘనంగా జరిన దిమాస్టర్‌మైండ్స్ ఈ-టెక్నో స్కూల్ వార్షికోత్సవ వేడుకలు

 

సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 23 (SNM న్యూస్): సదాశివపేట పట్టణంలోని ది మాస్టర్‌మైండ్స్ ఈ-టెక్నో స్కూల్ 1వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంరోజున బసవసేవ సదన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం సోమ వారం రోజున సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభించబడింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, 12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి  మమత రాజు, 26 వ వార్డు కౌన్సిలర్ అపర్ణ శివరాజ్ పాటిల్, 22 వ వార్డు కౌన్సిలర్ కొత్త గొల్ల సోమశేఖర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పిల్లల చేత భగవద్గీత శ్లోకాలు, దేశభక్తి గీతాలు, నాటికలు, విలేజ్ నకు సంబంధించిన లంబాడీ నృత్యాలు, ఫోక్ డాన్సులు వంటి కార్యక్రమాలతో విద్యార్థిని, విద్యార్థులు హోరేత్తిoచారు. ఇట్టి కార్యక్రమంలో తల్లిదండ్రులు, ప్రజలు, నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు స్కూల్ డైరెక్టర్ ఎం.నవనీత సంతోష్ గుప్త లు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియ జేశారు.

శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పులిమామిడి మమత రాజు దంపతులు

 


సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 23 (SNM న్యూస్): సదాశివపేట పట్టణంలోని తుల్ జ్జాసింఘ్ భాగ్ ప్రాంగణంలో ఉన్నటువంటి అతిపురాతణమైన మల్లిఖార్జునస్వామి కళ్యాణ మహోత్సవం (1983-84)ఎస్ఎస్సి బ్యాచ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల పూర్వ విద్యార్థుల మిత్రబృందం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి 12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ముఖ్య అతిథులుగా హాజరై శివ పార్వతుల కళ్యాణవేడుకల్లో పాల్గొని శివ పార్వతులను దర్శించుకున్నారు.తదుపరి అర్చకులమంత్రోచారణతో పులిమామిడి మమత రాజు దంపతులకు పూర్వ విద్యార్థుల బృందం వారందరూ కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి ఆలయం తరపున మేమెంటోను అందజేశారు. ఇట్టి కార్యక్రమంలో కాలనివాసులు స్వరూప, మాధవి, శశికళ ఆలయ కమిటీ సభ్యులు గంటశివన్న ఈశ్వరమ్మ, కనిగిరి శంకర్ అనురాధ, యాదగిరి రాధ, మాణిక్ ప్రభు మీనా, రమేష్ అపర్ణ, చిన్నపటేల్, పృథ్వీరాజ్, పి.ఎం.ఆర్ యువసేన నాయకులు రాగం అనిల్, రాము, ఆంజనేయులు, అఖిల్, సోమ శంకర్ మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sunday, February 08, 2026

పులిమామిడి మమత గెలుపు కొరకు కష్టపడుతున్న రాజన్న మిత్రులు

 

 సదాశివపేట, ఫిబ్రవరి 8 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని 12 వ వార్డు నుండి పోటీ చేస్తున్న పులిమామిడి మమత రాజు దంపతుల గెలుపుకొరకు కృషి చేస్తున్న రాజన్న మిత్రబృందం ఖర్చర్ల హరీష్ కుమార్, సుభాష్, పోల ప్రభు.ఇట్టి సందర్భంగా ఖర్చర్ల హరీష్ కుమార్ మాట్లాడుతూ మా అన్న 12 వ వార్డులో చేసినటువంటి సేవలు మేము ఎన్నటికీ మరచి పోలేమని, మా వార్డు నందు పులిమామిడి రాజన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏదోఒక రకంగా  తమ సహాయాన్ని అందించారని, వార్డునందు రోడ్లు గాని, మంచి నీటి సదుపాయం, మిషన్ భగీరథ ద్వారా నల్లకనెక్షన్ గాని, పింఛన్లు, షాదిమూభారక్, కళ్యాణ లక్షి, డ్రైనేజీ వ్యవస్థ, ఇందిరమ్మ ఇండ్లను సాంక్షన్ చేయించారు. ఇన్ని కార్యక్రమాలు అందిందించిన మా అన్న పులిమామిడి రాజన్న సతీమణి ఐన పులిమామిడి మమత యొక్క చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలని వారు ఓటరు మహాషయులను విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saturday, February 07, 2026

పులిమామిడి మమత తరపున 12వ వార్డు నందు ప్రచారంలో పాల్గొన్న TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని పాతకేరి నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత పక్షాన టి.జి. ఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ గతకాలంలో కూడా పులిమామిడి రాజు 12 వ వార్డు ప్రజలకు ఎంతగానో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, 12 వ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలను కూడా ప్రజలకు అందజేసేలా చూశారాని వారి లాంటి మంచి మనసున్న వ్యక్తి మీకు దొరకడం 12 వ వార్డు ప్రజల అదృష్టమని నిర్మల జగ్గారెడ్డి గారు అన్నారు. ఈ సారి బి.సి మహిళ వచ్చిన సందర్భంగా వారి సతీమణి పులిమామిడి మమత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్నారని, మళ్ళీ వారిని గెలిపించుకుంటే 12 వ వార్డును మరింత అభివృద్ధి చేస్తారని వారి తరపున నేను హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం మన రేవంతన్న ప్రభుత్వం అందుబాటులో ఉందని ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించి అధికార పార్టీకి మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి పులిమామిడి మమత చేతి గుర్తుకు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తిచేశారు. 12 వ వార్డులో ఇంతవరకే కారును ప్రజలందరూ కలిసి ఫంచర్ చేశారని, ఈ ఎన్నికల తరువాత పూర్తిగా గ్యారేజికి పర్మనెంట్ గా పంపించగలరని 12 వ వార్డు ప్రజలకు తెలియ పరిచారు. ఇట్టి కార్యక్రమంలో సీడిసి చైర్మన్ గడీల రాంరెడ్డి, చెర్యాల అంజన్న,పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ,  మండల అధ్యక్షులు చాట్ల సిద్దన్న, 12 వార్డు ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారి, కంది కృష్ణ, వార్డు ప్రజలు, పిఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

Friday, February 06, 2026

12 వ వార్డులో గెలుపు ఖాయమన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 5 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని 12వ వార్డు నందు ఉదయం 10:00 నుండి తమ వార్డు ప్రజలందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత రాజు ఇంటింటా తిరుగుతూ గత కాలంలో తాము చేసినటువంటి సేవల గురించి ప్రజలకు తెలియపరుస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించారు. రానున్న రోజులలో 12వ వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తమ ఓటరరు మహాశయులకు విజ్ఞప్తి చేశారు. అపోజిషన్ వారు గత 20 సంవత్సరాల నుండి పదవిలో ఉన్నా కూడా  వార్డు ప్రజలను పట్టించు కోలేరని ఇప్పటికే ప్రజలు వారిపై విసుగుచెంది మా వెంటే ఉన్నారని తెలియపరిచారు. పులి మామిడి మమత మాట్లాడుతూ మీకందరికి తెలుసు మేము మన వార్డులో ఇప్పటికే ఎన్ని పనులు చేశామో గమనించండి. అప్పుడు మేము అధికారంలో లేనప్పటికి మేము ఎన్నో పనులను చేశామని, ఇప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని, అందుకోసమే నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా నాయకులు తూర్పు నిర్మల జగ్గారెడ్డి గార్ల సహాయ సహకారాలతో మన వార్డును మరింత అభివృద్ధి చేస్తానని పులి మామిడి మమత ప్రజలకు హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, కంది కృష్ణ, 12వ వార్డు ఇంచార్జ్ వడ్ల బింబధర్ చారీ, మైనారిటీ సోదరులు ఎగ్బాల్, చోటు, సత్తార్, ఫయాజ్, జబ్బార్, ఇసుబ్, ఖర్చర్ల హరీష్, నరేష్, రాగం అనిల్, చిన్న, గుణాకర్, ఆంజనేయులు, రాము, ఇహకీల్ ఫహీం, మాణిక్యం, పరమదాసు, అఖిల్, మనోజ్, సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

Wednesday, February 04, 2026

ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులి మామిడి మమత రాజు


సదాశివపేట, ఫిబ్రవరి 3(SNM NEWS): 

సదాశివపేట పట్టణంలోని 12 వవార్డులో భారీ జనసంద్రోహంతో గడప గడప తిరుగుతూ ప్రతి ఓటరును ఆకర్షిస్తూ కరపత్రాన్ని పంచుతూ 12 వ వార్డు అభ్యర్థి పులిమామిడి మమత రాజు దంపతులిద్దరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీ అందించగలరని ఓటరు మహాషయులను విజ్ఞప్తిచేశారు. ఇట్టి సందర్భంగా పులి మామిడి రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు అందజేస్తుందని అందువలనే ప్రజలందరూ కాంగ్రెస్ వెనకానే ఉన్నారని, బిఆర్ ఎస్ పార్టీ కనుమరుగై పోతుందని అన్నారు. సంగారెడ్డి మరియు సదాశివపేట రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసు కోబోతుందని వారు మీడియా ముఖంగా తెలియపరిచారు. ఇట్టి కార్యక్రమంలో 12 వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా పాల్గొన్నారు. అదేవిధంగా 12 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారీ, బక్కప్ప, ఫయాజ్, మొయిజ్, రియాజ్, షకీల్, సురేష్, పి. ఎం. ఆర్ యువసేన నాయకులు మాణిక్యం, పరమదాసు, సంగమేష్, అనిల్, అఖిల్, అంజి, రాము, సోమ శంకర్,ఖరీం, అభిమానులు, మహిళలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Sunday, February 01, 2026

ఎనకపల్లిలో ఉచిత పశు వైద్య శిబిరం

 

సదాశివపేట, ఫిబ్రవరి 1: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పరిధిలోని ఎనకపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఎం. దుర్గాప్రసాద్, ఉపసర్పంచ్ ఎండి. ఖాదర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పశు వైద్యుడు డాక్టర్ సంతోష్ కుమార్ గౌడ్ పాడి గేదెలకు గర్భకోశ సంబంధిత చికిత్సలు, సాధారణ వైద్య సేవలు అందించారు. ఎదకు వచ్చిన పాడి గేదెలకు కృత్రిమ గర్భధారణ సూదులు వేయడం జరిగిందన్నారు. గ్రామ సర్పంచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, డాక్టర్లు గ్రామానికి వచ్చి అందిస్తున్న సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయితీ తీర్మానం చేసి గ్రామ కంఠంలో పశువులను అరికట్టేందుకు బోను (ట్రేవిస్) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేటి దూడలే రేపటి పాడి పశువులవుతాయని, వాటి ద్వారా కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతాయని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జేవీవో వి. విజయ్ కుమార్, గోపాలమిత్ర సూపర్వైజర్ సి. అర్జునయ్య, గోపాలమిత్రులు టి. కృష్ణ, ఎం. యాదయ్య, ఎం. రమేష్ పాల్గొన్నారు. పాడి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శిబిరంలో భాగంగా రైతులకు పాలు పెరగడానికి అవసరమైన మినరల్ మిక్సర్‌ను ఉచితంగా పంపిణీ చేయగా, అవసరమైన మందులన్నీ కూడా ఉచితంగానే అందజేశారు.

Sunday, December 21, 2025

కోటిపల్లి సర్పంచ్ స్వామిపై దాడిని ఖండించిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మడుపతి సంతోష్ స్వామి

సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు  జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపతి సంతోష్ స్వామి ,సమాజం నాయకులు తీవ్రంగా ఖండించారు. వారు మాట్లాడుతూ.. స్వామి పై దాడి చేసిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేసి శిక్ష వేయించాలి  అధ్యక్షుడు సంతోష్ కుమార్ స్వామి డిమాండ్ చేశారు. 

దాడిలో గాయపడిన ఆయనకు వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరించాలని, లేనిపక్షంలో రాష్ట్ర, సంగారెడ్డి జిల్లా జంగమ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరుపున జిల్లా ఎస్పీ కార్యాలయము ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అయ్యప్పస్వామి,బసవలింగం స్వామి,శిశిధర్ స్వామి ,శివప్రసాద్ స్వామి,మఠం శివకుమార్ స్వామి,నగేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Friday, December 19, 2025

సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

 

సంగారెడ్డి, డిసెంబర్‌ 19 (SNM NEWS): సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయ శంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకల్లో డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ గాయత్రి, డాక్టర్ పరుశురాం, డాక్టర్ విష్ణు, ఇన్‌చార్జి నర్సింగ్ తేజ సిస్టర్‌తో పాటు ఇతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ పండుగ సందేశాన్ని అందరికీ పంచుతూ, సేవా భావనతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని వైద్యులు వెల్లడించారు.

Thursday, December 18, 2025

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌ను కలిసిన లింగంపల్లి సర్పంచ్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): మునిపల్లి మండలం లింగంపల్లి గ్రామ సర్పంచ్ ఇర్ఫాన్ పటేల్ శుక్రవారం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండుతూ వారి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని సర్పంచ్‌కు సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా గ్రామాభివృద్ధికి సమిష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్. వెంకటేశ్వర్లు, జీవి శ్రీనివాస్, విఠల్, మసుధ్, ముజీప్, మాజీ వైస్ ఎంపీపీ బాబా పటేల్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఆఫ్సార్, సంపత్, మతిన్, సాజిత్ తదితరులు పాల్గొన్నారు.

కంబాలపల్లిలో తొట్టెల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): సదాశివపేట మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పెద్ద గొల్ల శ్రీహరి – కరుణశ్రీ దంపతుల రెండవ కుమార్తె తొట్టెల కార్యక్రమం శనివారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి శాసనసభ్యులు చింతా ప్రభాకర్ తనయుడు చింతా సాయినాథ్తో కలిసి హాజరై శిశువుకు ఆశీస్సులు అందజేసి, శ్రీహరి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ చిన్నారి ఆయురారోగ్యాలతో పెరిగి కుటుంబానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీహరి కుటుంబం సుఖసంతోషాలతో, సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్వహించిన ఈ తొట్టెల కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెద్ద గొల్ల మల్లమ్మ, మండల పార్టీ అధ్యక్షులు పెద్ద గొల్ల ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు సుధీర్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, వార్డు సభ్యులు ఖలీల్, అనసూయ, బాబు, అంజిరెడ్డి, అలాగే శ్రీశైలం, మల్లేశం, పాండు, జానీ మియా తదితర గ్రామ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

Monday, December 15, 2025

పి.ఎం.ఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేసిన కంది మల్లేష్


 


సదాశివపేట, డిసెంబర్ 15 (SNM న్యూస్): 
సదాశివపేట పట్టణంలోని పీఎంఆర్ క్యాంపు కార్యాలయంలో కంది గ్రామానికి చెందిన మన్నే మల్లేష్ తన మిత్రులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు ని కలిసి వారిని శాలువాతో సన్మానించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ జేశారు. ఇట్టి సందర్బంగా మల్లేశం మాట్లాడుతూ పి. ఎం. ఆర్ జనం మెచ్చిన నాయకుడని, వారు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేమని, రాబోయే రోజుల్లో మా నాయకునికి మంచి అవకాశాలు రావాలని మేమందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తామన్నారు. ఇట్టి కార్యక్రమంలో కంది గ్రామస్థులు పాల్గొన్నారు.

Wednesday, December 10, 2025

ఒక్క అవకాశం ఇవ్వండి వెంకటాపూర్ సర్పంచ్ అభ్యర్థి కౌవులే యాదగిరి

సంగారెడ్డి, డిసెంబర్ 9 (SNM న్యూస్);నన్ను వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ గా గెలిపిస్తే మన గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని సర్పంచ్ అభ్యర్థి కౌవులే యాదగిరి అన్నారు. నేను చిన్న కుటుంబం నుండి వచ్చిన వాడినని గత మూడు సంవత్సరాల నుండి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తానని మా గ్రామ ప్రజలకు చెప్తూ వస్తున్నానని, అదేవిధంగా కొంత మందికి నావంతు సహాయ సహకారాలను అందించానని, గ్రామ సమస్యలపైన ఫోకస్ పెడుతూ గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని తెలుసుకున్నానని, నాపై నమ్మకం ఉంచి గ్రామ ప్రజలు నాగుర్తు బ్యాలెట్ పేపర్లో  2వ నెంబర్ కలిగిన కత్తెర గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని పత్రికాముఖంగా ప్రార్థిస్తున్నాను. నేను గెలిచిన వెంటనే బైపాస్ రోడ్ నుండి మన గ్రామం వరకు ఉన్నటువంటి కంకర రోడ్డును బాగుచేయిస్తానని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మహిళామూతృ లందరికి నాదగ్గర ఉన్నటువంటి ఆటోను ఎమర్జెన్సీ సమయంలో అంబులెన్స్ మాదిరిగా ఉపయోగిస్తానని మాట ఇస్తున్నాను. గ్రామంలో ఎటువంటి సమస్యనైనా నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తానని తెలియపరుస్తున్నాను. ఈసారి మన గ్రామంలో ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ యొక్క ఓటును స్వేచ్ఛగా ఉపయోగించుకోవాలని కోరుచున్నాను. ముఖ్యంగా యువత తప్పుతోవలో  నడవకుండా ఆలోచించి మంచి చేసే నాయకునికి  మీ ఓటువేసి ఎన్నుకోవాలని వెంకటాపూర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్టి ప్రచార కార్యక్రమంలో తన ప్యానల్ సభ్యులు దుర్గంబోయిని పోచయ్య, దుర్గం బోయిని సుజాత, బోయిని పోచయ్య, కుదై గారి సలీంలను కూడా వార్డు సభ్యులుగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు, ఇట్టి కార్యక్రమంలో అంబదాస్,మహేష్, ఖదీర్, శేఖర్, శివకుమార్, రాజు, నరేష్, బి. యాదగిరి మరియు గ్రామ ప్రజలు మొదలగు వారు పాల్గొన్నారు.

Saturday, November 15, 2025

ఈనెల 16న జరిగే న్యాయ సాధన దీక్షను జయప్రదం చేయండి

సంగారెడ్డి, నవంబర్ 15 (SNM న్యూస్): బిసి న్యాయ సాధన దీక్ష తెలంగాణ  బి సి జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారి  పిలుపుమేరకు తేదీ 16 నవంబర్ 2025 ఆదివారం నాడు ఉదయము 11 గంటల నుండి సాయంత్రము నాలుగు గంటల వరకు సంగారెడ్డి జిల్లాబిసి  జేఏసీ ఆధ్వర్యంలోన్యాయ  సాధన దీక్ష కలదు ఇట్టి న్యాయసాధన దీక్ష కొత్త బస్టాండ్ పక్కన నటరాజ్ టాకీస్ ముందు దీక్షా స్థలంను ఏర్పాటు చేయడం జరిగినది ఇట్టిదీక్ష ముఖ్య ఉద్దేశం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేయడమే ముఖ్య ఉద్దేశం. ఇట్టి దీక్షను సంగారెడ్డి జిల్లా లోని అన్ని నియోజకవర్గ, పట్టణ మండల కేంద్రాల్లో బీసీ సోదరి సోదరులందరూ విజయవంతం చేయాలని కోరడం జరిగినది ఇట్టి దీక్ష ను న్యాయవాదులు డాక్టర్లు మేధావి వర్గంఉద్యోగస్తులు విశ్రాంతి ఉద్యోగస్తులు యువతియువకులు విద్యార్థిని విద్యార్థులు అన్నిబిసి కుల సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయగలరని జిల్లా బీసీ జేఏసీకన్వీనర్ ప్రభుగౌడ్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సంగారెడ్డి జిల్లాబీసీ జేఏసీ  వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్ కో కన్వీనర్లు రవి మానస మంగ గౌడ్ తదితరులు పాల్గొన్నారు...

దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి -టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 14 (SNM News):   పండిట్ జవహర్ లాల్ నెహ్రు 136 వ జయంతి సందర్భంగా సంగారెడ్డి రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఓటేశారా? మిషన్లు ఓట్లేశాయా? అర్థం కావడం లేదన్నారు. నేను రాహుల్ గాంధీ కి ఒకటే చెప్పదలుచుకున్న, బీహార్ పోతే పోయింది. కానీ రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దేశ ప్రజలు క్షేమంగా ఉండాలంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నారు. మోతీలాల్ నెహ్రూ,  జవహర్ లాల్ నెహ్రూ ల కుటుంబం ఈ దేశం కోసం ఆస్తులు పంచారు, ప్రాణాలిచ్చారు.. మంచి పరిపాలన చేశారు. కొంతమంది  రాజకీయ మూర్ఖులు ఆ కుటుంబం దేశం కోసం ఏం చేసిందని మాట్లాడటం బాధాకరం అని అన్నారు. భారత దేశ మొట్టమొదటి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 136 వ జయంతి సందర్భంగా  టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి  ఆధ్వర్యంలో సంగారెడ్డి లో ఘనంగా బాలల దినోత్సవ కార్యక్రమంలో  టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జగ్గారెడ్డి కుమారుడు భరత్ సాయి రెడ్డి పాల్గొన్నారు. సంగారెడ్డి పాత బస్టాండ్  రామ్ నగర్ లో జగ్గారెడ్డి ఇంటి వద్ద  బాలల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం లో బాలలు సంతోషంగా పాల్గొన్నారు. పండిట్ నెహ్రూ, ఇందిరా గాంధి, రాజీవ్ గాంధీ ల జీవిత చరిత్ర ను తెలిపేలా ప్రత్యేక డాన్స్, స్కిట్  లతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. భారత దేశ అభివృద్ధి కి ప్రధాన మంత్రి గా నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు, భారీ ప్రాజెక్టు ల రూపకల్పన, ఐఐటి, ఐఐఎం ల ఏర్పాటు వంటి అంశాలను కళ్ళకు కట్టినట్టు కళాకారులు ఈ కార్యక్రమంలో చూపించారు.

Monday, September 22, 2025

పట్నం మాణిక్యం జన్మదిన సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): అన్నం పరబ్రహ్మ స్వరూపం, దేవుడు అందరినీ ఒకేలాగా పుట్టించలేదు కానీ ఆకలిని మాత్రం ఒకే విధంగా పుట్టించాడు. ఆకలి అన్నవారికి మనం పట్టెడన్నం పెడదాము, వారి అలసిన కన్నుల్లో ఆనందాన్ని చూద్దాం అంటూ,  పట్నం మాణిక్యం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తూనే ఉంది. సోమవారం పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా జన్మదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణం ప్రభుత్వాసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం, పండ్ల పంపిణీ చేసి తమ ప్రియతమ నాయకునికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి నియోజకవర్గం పిఎంకె యువసేన నాయకులు. ఈ కార్యక్రమంలోని టిఆర్ఎస్ నాయకులు, పిఎంకె యువసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.



Thursday, September 18, 2025

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడ్డా కూడా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని అతివేగంగా నడపడం వలన లారీ ముందు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను సంగారెడ్డి రూరల్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామును పునరుద్ధరించారు

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...