Showing posts with label sanagareddy. Show all posts
Showing posts with label sanagareddy. Show all posts

Wednesday, June 03, 2026

పట్నం మాణిక్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

సంగారెడ్డి జూన్ 3: తెలంగాణ గర్వించదగ్గ నేత, పార్టీకి బలమైన సైనికుడు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేత గౌరవ శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా *పట్నం మాణిక్యం ఫౌండేషన్* ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణం ప్రభుత్వాసుపత్రి లో అన్నదాన కార్యక్రమం,పండ్ల పంపిణీ మరియు కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు,పిఎంకె సభ్యులు పాల్గొని గౌరవనీయులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

Monday, May 11, 2026

ఘనంగా వేదాన్య పాఠశాల ప్రారంభం

 


సంగారెడ్డి, మే 11 (SNM న్యూస్) : విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలంగా డిజిటల్ తరగతి గదులు, విశాలమైన క్లాస్‌రూములు, పెద్ద ఆట స్థలం, బాక్స్ క్రికెట్ సదుపాయం కల్పించినట్లు వేదాన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని గణేష్‌నగర్‌లో కృష్ణ దేవాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వేదాన్య పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం పాఠశాల అసెంబ్లీ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేణు భగవాన్, దామోదర్ రెడ్డి హాజరై మాట్లాడారు. నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. స్నేహపూర్వక అధ్యాపక బృందంతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల నిర్వహణలో డైరెక్టర్ మనోహర్ గౌడ్, సంజయ్ హాట్కర్, వివేక్ కుమార్ సేవలందిస్తుండగా, కో-డైరెక్టర్లు సంజయ్ సోనాలి, ప్రేమ్ కుమార్, రవితేజ పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Monday, March 02, 2026

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన చిన్నారుల నృత్య ప్రదర్శన

 

150 మంది చిన్నారుల చే తారా డిగ్రీ కళాశాల ప్రాంగణం లో సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 1 (SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని నక్షత్ర స్ఫూర్తి డాన్స్ అకాడమీ నిర్వాహకు రాలు నిర్వాహకురాలు గీతా యజ్ఞశ్రీ శిష్య బృందం నిర్వహించిన 150 మంది కళాకారుల చే కూచిపూడి వైభవం సరస్వతి స్తుతి సామూహిక  కార్యక్రమానికి వండల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో  చిన్నారులు సామూహికంగా నృత్యం చేసి ఒక రికార్డును నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి చిన్నారులకు శిక్షణ ఇచ్చిన గీతా యజ్ఞశ్రీ ని వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, కోఆర్డినేటర్ రవి కుమార్  మెడల్‌తోపాటూ ధ్రువీకరణ పత్రం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాసవి మా ఇల్లు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజి అనంతకిషన్, పుల్లూరి ప్రకాష్,టి వై యస్ యస్ అధ్యక్షులు కూన వేణు, తదితరులు పాల్గొన్నారు.

Sunday, March 01, 2026

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 

సంగారెడ్డి, మార్చి 01 (SNM న్యూస్): దాదాపు 36 ఏళ్ల తర్వాత తమ స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడిగా గడిపారు. చౌటకూర్ మండలం శివంపేట గ్రామం లోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మల్లేపల్లి లోని ఆర్ ఆర్ ఆర్ కన్వెన్షన్ హాల్లో  ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత తమ స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సందడిగా గడిపారు. ఈ సందర్భంగా తమ గురువులను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు.  ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజమౌళి, శివప్రసాద్, బాలనాగిరెడ్డి, విద్యార్థులు భాస్కర్ వర్మ, దేవరాజ్, రవి, సుదర్శన్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Wednesday, February 25, 2026

మున్సిపల్ చైర్మన్ వనిత, కౌన్సిలర్ వీణ లకు ఘన సన్మానం

సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 24 (SNM న్యూస్): సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మహాసంస్థాన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, 21 వార్డు కౌన్సిలర్ తోపాజి వీణ హరీష్ సన్మాన కార్యక్రమం మంగళవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. నూతన చైర్మన్ వనిత మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అందరి కృషి వల్లే తాను మున్సిపల్ చైర్మన్ స్థాయి వరకు ఎదిగినట్లు చెప్పారు. ఇలాంటి సహకారం కావాలన్నా అందిస్తారని పేర్కొన్నారు. ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ.. తన కోడలు వీణ కౌన్సిలర్ గా విజయంలో ఆర్యవైశ్యుల సహకారం మర్చిపోలేనని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మ్యాడం రాధా కిషన్, జూలకంటి బుచ్చిలింగం, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి నామ శ్రీనివాస్, కోశాధికారి ఆమెటి భాస్కర్, యువజన సంఘం అధ్యక్షుడు తోపాజి హరీష్, వాసవి మహా సంస్థాన్ కోశాధికారి జూలకంటి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.



మున్సిపల్ చైర్మన్ వనిత, కౌన్సిలర్ వీణ లకు ఘన సన్మానం

సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 24 (SNM న్యూస్): సంగారెడ్డి పట్టణ ఆర్యవైశ్య సంఘం వాసవి మహాసంస్థాన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్ కుమార్, వైస్ చైర్మన్ షఫీ అహ్మద్, 21 వార్డు కౌన్సిలర్ తోపాజి వీణ హరీష్ సన్మాన కార్యక్రమం మంగళవారం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. నూతన చైర్మన్ వనిత మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అందరి కృషి వల్లే తాను మున్సిపల్ చైర్మన్ స్థాయి వరకు ఎదిగినట్లు చెప్పారు. ఇలాంటి సహకారం కావాలన్నా అందిస్తారని పేర్కొన్నారు. ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ.. తన కోడలు వీణ కౌన్సిలర్ గా విజయంలో ఆర్యవైశ్యుల సహకారం మర్చిపోలేనని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మ్యాడం రాధా కిషన్, జూలకంటి బుచ్చిలింగం, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి నామ శ్రీనివాస్, కోశాధికారి ఆమెటి భాస్కర్, యువజన సంఘం అధ్యక్షుడు తోపాజి హరీష్, వాసవి మహా సంస్థాన్ కోశాధికారి జూలకంటి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

Tuesday, February 24, 2026

మాజీ మంత్రి టీ. హరీష్ రావుని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్‌వీ నాయకుడు అఖిల్

 

సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 23 (SNM న్యూస్): హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్  ఆధ్వర్యంలో మాజీ మంత్రి టి. హరీష్ రావుని బీఆర్‌ఎస్‌వీ నాయకుడు అఖిల్ కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా రానున్న కాలంలో తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని, ప్రజలు మళ్లీ అభివృద్ధి పాలన కోరుకుంటున్నారని హరీష్ రావు గారు విశ్వాసం వ్యక్తం చేసినట్లు అఖిల్ తెలిపారు. యువత పార్టీకి అండగా నిలవాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చినట్లు చెప్పారు.

Saturday, February 21, 2026

సంగారెడ్డి మున్సిపల్ అభివృద్ధికి..సదా నేను అండగా ఉంటా


-తనను కలిసిన సంగారెడ్డి మున్సిపల్ నూతన పాలకవర్గంతో కలెక్టర్ పి.ప్రావీణ్య హామీ

-టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తో కలిసి  కలెక్టర్ ను కలిసిన సంగారెడ్డి నూతన పాలకవర్గ సభ్యులు

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 20 (SNM న్యూస్):..ఇటీవల నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఈరోజు శుక్రవారం సంగారెడ్డి కలెక్టర్ పి. ప్రావీణ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో ఆమెను కలిసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిలర్లకు ఆమె అభినందనలు తెలియజేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల ఇచ్చిన మాట మేరకు సంగారెడ్డి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలకు మేం కట్టుబడి ఉన్నామని వారు  కలెక్టర్ కు వివరించారు.  టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,  టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల సూచనల మేరకు సంగారెడ్డి మున్సిపల్ సమగ్ర అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని వారు కలెక్టరుకు వివరించారు. మెరుగైన పారిశుద్ధం, ఇంటింటికి స్వచమైన తాగునీరు, ప్రతి గల్లీలో సిసి రోడ్లు, ఇలా అన్ని సదుపాయాలు కల్పిస్తామని వాళ్ళు వివరించారు. సంగారెడ్డి మున్సిపల్ పాలకవర్గంలో యువతీ యువకులు ఎక్కువగా ఉన్నారని, ఇది మున్సిపాలిటీకి చాలా ప్రయోజనం చేకూర్తుందని ఈ సందర్భంగా కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని పాలకవర్గానికి ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ షఫీ హఫిజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొంగుల రవి, కూన సంతోశ్, కౌన్సిలర్లు శ్రీకాంత్, ప్రశాంత్ రెడ్డి, రవి నాయక్, గుర్రం ఝాన్సీ, మోతే శ్యామ్, వీణ తదితరులు పాల్గొన్నారు.

Tuesday, February 10, 2026

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

 

సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తూ, అవసరంలో ఉన్న ఓ నిరుపేద కార్మికుడికి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్, శివాజీ నగర్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న జగ్గారెడ్డికి రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ కార్మికుడు కనిపించాడు. వెంటనే తన వాహనాన్ని వెనక్కి తిప్పి ఆ కార్మికుడి వద్దకు వెళ్లిన ఆయన, అతని జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. వాన, ఎండలకు తడుస్తూ రోడ్డుపక్కనే చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నానని, సరైన నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కార్మికుడు జగ్గారెడ్డికి విన్నవించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనికి అవసరమైన సామగ్రి కూడా కొనుగోలు చేయలేకపోతున్నానని, కొంత సహాయం అందితే తన ఉపాధి మెరుగుపడుతుందని వివరించాడు. కార్మికుడి పరిస్థితిని గమనించిన జగ్గారెడ్డి, అతని జీవనోపాధికి అండగా నిలవాలనే ఉద్దేశంతో వెంటనే రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని చెప్పులు కుట్టే పనిముట్లు, నీడ ఏర్పాటు తదితర అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

Monday, February 09, 2026

ఇంటింటి ప్రచారంలో జోష్ 37 వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ రమేష్ సింగ్

 సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (SNM NEWS):సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. మున్సిపాలిటీలోని 37వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ రమేష్ సింగ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మీ ఇంటి సేవకుడిగా, పనిచేస్తానని పదవి కోసం రాలేదని 37వ వార్డు ప్రగతి కోసం వచ్చానని నన్ను గెలిపిస్తే కౌన్సిలర్ అవుతా కానీ ఎప్పటికీ మీ మనిషిగా ఉంటూ సేవ చేసుకుంటారని అన్నారు. 37వ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లకు వివరించారు. వార్డు అభివృద్ధికి స్వచ్ఛందంగా కృషి చేస్తానని అన్నారు. కాలనీవాసులో తన ప్రచారానికి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి చేయూతనివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

నాయి కోటి అశ్విని నవీన్ కుమార్ లభిస్తున్న ప్రజా ఆదరణ -గడపగడపకు బీఆర్ఎస్ ప్రచారం

 


సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ 32వ వార్డు అభ్యర్థి నాయి కోటి అశ్విని సవీన్ కుమార్ ఇంటింటికి తిరిగి కార్యకర్తలతో ప్రచారం చేశారు. మున్సివల్ 32 వ వార్డు అభ్యర్థి నాయికోటి అశ్వని కుమార్ మాట్లాడుతూ గత కాలంలో మేము చేసిన అభివృద్ధి మీ అందరూ చూశారు. కరోనా కష్టకాలంలో కూడా వ్రతి ఇంటికి తిరిగి శానిటైజషన్ చేయడం జరిగింది. గత ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా గత ఏడు సంవత్సరాలుగా ప్రతి! ఇంటికి రోజు మంచినీటి సరఫరా మరియు సొంత నిధులతో టాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి వీధికి సిసి రోడ్డు డ్రైనేజీ వీధి దీపాలు ఏర్పాటు చేసి వార్డు రేఖలను మార్చాము. వార్డు ప్రజల సౌలభ్యం కోసం కలెక్టర్ వెనకాల పార్కును ఏర్పాటు చేశాము. వాటర్ ట్యాంక్ నిర్మించామని, డ్వాక్రా మహిళల కోసం డ్వాక్రా బిల్డింగ్ నిర్మించి మహిళల ఆత్మగౌరవం పెంచామని అన్నారు. గతంలో చేసిన విధంగానే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మన వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నామని తెలియజేశారు. పాలకుడిగా కాదు ప్రజా సేవకుడిగా ఉంటాను. అందరూ గర్వపడేలా పనిచేస్తాను మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కాలనీవాసులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

సదాశివపేటలో జయమ్మ... సంగారెడ్డిలో నిర్మలమ్మ -కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న తల్లీ కూతుళ్ళు

 



-8 కోట్ల తో ఒక్కో వార్డులో అభివృద్ధి, పేదలకు ఇంటి స్థలాల హామీతో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 8 (SNM NEWS):మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల్లో తెర పడనుండటం తో  కాంగ్రెస్ పార్టీ ప్రచారం లో దూకుడు పెంచింది. సంగారెడ్డి లో శనివారం జరిగిన  ప్రజలతో జగ్గారెడ్డి ముఖాముఖి  సభ వియవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆదివారం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.  సదాశివపేట లో జయా చైతన్య రెడ్డి,    సంగారెడ్డి లో నిర్మలా జగ్గారెడ్డి ఇంటిటి  ప్రచారం లో పాల్గొన్నారు. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున  పట్టణం లో ని 11,31,32,33,6 వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను   గెలిపిస్తే ప్రతీ వార్డులో 8 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేయడం తో పాటు వార్డులో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. మీ మనస్సు మాట వినండి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. మరో పక్క సదాశివపేట మున్సిపాలిటీ లో జయా చైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.17,18,4,8 వార్డులతో పాటు పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయారెడ్డి మాట్లాడుతూ  ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి జగ్గారెడ్డి అని, ఆయన  మాట ఇస్తే చేసి తీరుతారని అన్నారు. సదాశివపేట  లో సర్టిఫికెట్లు ఉన్న 5500 మందికి తో పాటు ఇల్లు లేని ప్రతీ పేదలకు ఇంటి స్థలాలు జగ్గారెడ్డి ఇచ్చి తీరుతారాన్నరు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతీ వార్డులో 8 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఆయా వార్డుల అభ్యర్థులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sunday, February 08, 2026

పులిమామిడి మమత గెలుపు కొరకు కష్టపడుతున్న రాజన్న మిత్రులు

 

 సదాశివపేట, ఫిబ్రవరి 8 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని 12 వ వార్డు నుండి పోటీ చేస్తున్న పులిమామిడి మమత రాజు దంపతుల గెలుపుకొరకు కృషి చేస్తున్న రాజన్న మిత్రబృందం ఖర్చర్ల హరీష్ కుమార్, సుభాష్, పోల ప్రభు.ఇట్టి సందర్భంగా ఖర్చర్ల హరీష్ కుమార్ మాట్లాడుతూ మా అన్న 12 వ వార్డులో చేసినటువంటి సేవలు మేము ఎన్నటికీ మరచి పోలేమని, మా వార్డు నందు పులిమామిడి రాజన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఏదోఒక రకంగా  తమ సహాయాన్ని అందించారని, వార్డునందు రోడ్లు గాని, మంచి నీటి సదుపాయం, మిషన్ భగీరథ ద్వారా నల్లకనెక్షన్ గాని, పింఛన్లు, షాదిమూభారక్, కళ్యాణ లక్షి, డ్రైనేజీ వ్యవస్థ, ఇందిరమ్మ ఇండ్లను సాంక్షన్ చేయించారు. ఇన్ని కార్యక్రమాలు అందిందించిన మా అన్న పులిమామిడి రాజన్న సతీమణి ఐన పులిమామిడి మమత యొక్క చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించగలని వారు ఓటరు మహాషయులను విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Saturday, February 07, 2026

పులిమామిడి మమత తరపున 12వ వార్డు నందు ప్రచారంలో పాల్గొన్న TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని పాతకేరి నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత పక్షాన టి.జి. ఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ గతకాలంలో కూడా పులిమామిడి రాజు 12 వ వార్డు ప్రజలకు ఎంతగానో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, 12 వ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలను కూడా ప్రజలకు అందజేసేలా చూశారాని వారి లాంటి మంచి మనసున్న వ్యక్తి మీకు దొరకడం 12 వ వార్డు ప్రజల అదృష్టమని నిర్మల జగ్గారెడ్డి గారు అన్నారు. ఈ సారి బి.సి మహిళ వచ్చిన సందర్భంగా వారి సతీమణి పులిమామిడి మమత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్నారని, మళ్ళీ వారిని గెలిపించుకుంటే 12 వ వార్డును మరింత అభివృద్ధి చేస్తారని వారి తరపున నేను హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం మన రేవంతన్న ప్రభుత్వం అందుబాటులో ఉందని ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించి అధికార పార్టీకి మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి పులిమామిడి మమత చేతి గుర్తుకు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తిచేశారు. 12 వ వార్డులో ఇంతవరకే కారును ప్రజలందరూ కలిసి ఫంచర్ చేశారని, ఈ ఎన్నికల తరువాత పూర్తిగా గ్యారేజికి పర్మనెంట్ గా పంపించగలరని 12 వ వార్డు ప్రజలకు తెలియ పరిచారు. ఇట్టి కార్యక్రమంలో సీడిసి చైర్మన్ గడీల రాంరెడ్డి, చెర్యాల అంజన్న,పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ,  మండల అధ్యక్షులు చాట్ల సిద్దన్న, 12 వార్డు ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారి, కంది కృష్ణ, వార్డు ప్రజలు, పిఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

కమలం గుర్తే శ్రీరామ రక్ష: మెదక్ ఎంపీ రఘునందన్ రావు -12వ వార్డులో కార్నర్ మీటింగ్‌లో వ్యాఖ్యలు

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS):సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి భవిష్యత్తుపై ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాను రాను హిందువుల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. సంగారెడ్డి నాల్ సాబ్ గడ్డగా మారే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రదాయం, భద్రత, అభివృద్ధికి కమలం గుర్తే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. భావితరాల భద్రత, సంస్కృతి పరిరక్షణ కోసం కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులు సాహితీ–రామును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా ఏకమై బీజేపీకి మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Thursday, February 05, 2026

12వార్డులో బీజేపీ ప్రచారానికి జోష్, సాహితీ రాము కు లభిస్తున్న ప్రజా ఆదరణ, గడపగడపకు బీజేపీ ప్రచారం


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 5 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాము సాహితీకి వార్డు ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. రాము సాహితీకి మద్దతుగా సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ, 12వ వార్డులో గత కొన్నేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు గతంలో వార్డు అభివృద్ధిపై నిర్లక్ష్యం చేశాయని ఆరోపించారు. ప్రస్తుతం వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారానే సాధ్యమవుతున్నాయని తెలిపారు. 12వ వార్డు ప్రజలు రాము సాహితీని కౌన్సిలర్‌గా గెలిపిస్తే, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు ఎంపీ, ఎమ్మెల్సీ నిధులను వినియోగించి వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే బీజేపీ లక్ష్యమని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాము సాహితీకి తమ మద్దతు తెలిపారు.

12వ వార్డులో రాము సాహితికి బ్రహ్మరథం

                                                                                                                                                                     


సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 5 (SNM NEWS): సంగారెడ్డి పట్టణం 12వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి రాము సాహితికి వార్డు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి 12వ వార్డులో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించి, రాము సాహితికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ, గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాల పాలనలో 12వ వార్డులో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. వార్డులో చేపట్టిన చాలా పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని తెలిపారు. రాము సాహితిని కౌన్సిలర్‌గా గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఎంపీ, ఎమ్మెల్సీ నిధులను వినియోగించి 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

12వ వార్డు అభివృద్ధే లక్ష్యం – గులాంగరి ప్రవీణ్

 

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 4 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డును సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గులాంగరి ప్రవీణ్ తెలిపారు. తాను ఎన్నికైతే అదనపు నిధులు సమకూర్చి వార్డు అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం 12వ వార్డులో ఇంటింటా తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం, వీధిదీపాల వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున, స్థానిక సంస్థల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధికి ఆటంకాలు ఉండవని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజల వరకు చేరేలా చర్యలు తీసుకుంటామని, వార్డు అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలుస్తున్నప్పటికీ, ప్రజాసేవ పట్ల స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నానని, తనపై నమ్మకం ఉంచి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. 12వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత పాల్గొన్నారు. ప్రజల నుంచి లభిస్తున్న స్పందన తనకు మరింత ఉత్సాహాన్నిస్తోందని గులాంగరి ప్రవీణ్ తెలిపారు.

Wednesday, February 04, 2026

ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులి మామిడి మమత రాజు


సదాశివపేట, ఫిబ్రవరి 3(SNM NEWS): 

సదాశివపేట పట్టణంలోని 12 వవార్డులో భారీ జనసంద్రోహంతో గడప గడప తిరుగుతూ ప్రతి ఓటరును ఆకర్షిస్తూ కరపత్రాన్ని పంచుతూ 12 వ వార్డు అభ్యర్థి పులిమామిడి మమత రాజు దంపతులిద్దరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీ అందించగలరని ఓటరు మహాషయులను విజ్ఞప్తిచేశారు. ఇట్టి సందర్భంగా పులి మామిడి రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు అందజేస్తుందని అందువలనే ప్రజలందరూ కాంగ్రెస్ వెనకానే ఉన్నారని, బిఆర్ ఎస్ పార్టీ కనుమరుగై పోతుందని అన్నారు. సంగారెడ్డి మరియు సదాశివపేట రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసు కోబోతుందని వారు మీడియా ముఖంగా తెలియపరిచారు. ఇట్టి కార్యక్రమంలో 12 వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా పాల్గొన్నారు. అదేవిధంగా 12 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారీ, బక్కప్ప, ఫయాజ్, మొయిజ్, రియాజ్, షకీల్, సురేష్, పి. ఎం. ఆర్ యువసేన నాయకులు మాణిక్యం, పరమదాసు, సంగమేష్, అనిల్, అఖిల్, అంజి, రాము, సోమ శంకర్,ఖరీం, అభిమానులు, మహిళలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

పార్టీ మోసం చేసింది… కన్నీరు పెట్టుకున్న 2వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి భాష

 

సంగారెడ్డి, ఫిబ్రవరి 3(SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో 2వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాయి భాష పార్టీ తనను మోసం చేసిందని ఆరోపిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ నుంచి అన్యాయం జరిగిందని పేర్కొంటూ, ప్రజలు తనకు న్యాయం చేయాలని కోరుతూ కన్నీరు పెట్టుకున్నారు. 2వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే ఇస్తామని పలుమార్లు హామీ ఇచ్చారని తెలిపారు. మూడో తేదీ మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వరకు కూడా అదే మాట చెప్పారని, అయితే చివరికి మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో తీవ్రంగా ఆవేదనకు గురయ్యానన్నారు. సంగారెడ్డిలో రాజకీయాలు ఎంత నీచ స్థాయికి దిగజారాయో ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ పార్టీ తనకు అన్యాయం చేసినప్పటికీ ప్రజలు మాత్రం అన్యాయం చేయరని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 2వ వార్డులో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. డబ్బు లేదనే కారణంతోనే తనకు బిఆర్ఎస్ పార్టీ బీ–ఫారం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుని ఓటు వేసి ఆశీర్వదించాలని సాయి భాష కోరారు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...