Showing posts with label SANGAREDY. Show all posts
Showing posts with label SANGAREDY. Show all posts

Thursday, December 18, 2025

మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి డా. అల్లాని కిషన్ రావు పేరు పెట్టాలి -తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఇరిగిజ్జ మురళీ కృష్ణ డిమాండ్

 

సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్‌చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అల్లాని కిషన్ రావు  సేవలను గుర్తిస్తూ, నూతనంగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆయన పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి, జనం బాట – సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఇరిగిజ్జ మురళీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్‌చేరు అంటే పరిశ్రమలు, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కోసం న్యాయస్థానాల దాకా పోరాడి, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్ జి టీ) తీర్పు ద్వారా పరిశ్రమల నుంచి సి ఎస్ ఆర్ నిధులు సాధించడంలో దివంగత డా. అల్లాని కిషన్ రావు కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన నిరంతర పోరాట ఫలితంగానే వందల కోట్ల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో పటాన్‌చేరు ప్రాంతంలో నూతన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. పటాన్‌చేరు ప్రాంతంలోనే జన్మించిన డా. అల్లాని కిషన్ రావు పదవి, పేరు కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం నిజాయితీగా పోరాడిన మచ్చలేని నాయకుడని మురళీ కృష్ణ అన్నారు. అలాంటి వ్యక్తి పేరును ఆస్పత్రికి పెట్టడం ద్వారా ఆయన సేవలకు తగిన గౌరవం లభించడమే కాకుండా, రాబోయే తరాలకు ప్రజల కోసం పోరాడితే మార్పు సాధ్యమనే సందేశం అందుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పటాన్‌చేరు ప్రజల తరపున  కల్వకుంట్ల కవిత  సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయగా, తెలంగాణ జాగృతి నాయకులు కలెక్టర్‌ను కలిసి ఆ లేఖను స్వయంగా అందజేశారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ ప్రతిపాదనను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్ మిశ్రా, బస్తెపురం పోచయ్య, మేధావుల ఫోరం నాయకులు రెడ్డిబోయిన భిక్షపతి పాల్గొన్నారు.

Wednesday, December 17, 2025

ఇంద్రేశంలో కార్యక్రమాల సమాచారం కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడం లేదు: ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి

 

పటాన్ చెరు, డిసెంబర్ 17 (SNM NEWS): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులకు కమిషనర్, అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని పటాన్ చెరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మున్సిపల్ కమిషనర్, అధికారులు ఎలాంటి సమాచారం అందించడం లేదని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారంతో ప్రజలకు సరైన సమాచారం చేరడంలో అంతరాయం కలుగుతుందని, అలాగే ప్రజాప్రతినిధుల పాత్రను తగ్గించినట్లుగా భావించాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, అధికారులు భవిష్యత్తులో ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో జరిగే కార్యక్రమాలకు సంబంధిత నాయకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని మన్నె లక్ష్మి డిమాండ్ చేశారు.

ఢిల్లీ టూర్ విజయవంతంగా ముగించుకుని వచ్చిన సంగారెడ్డి జిల్లా బిసి జేఏసీ బృందం

సంగారెడ్డి డిసెంబర్ 16 (SNM NEWS):  బిసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు తెలంగాణబీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్  కృష్ణయ్య  ఢిల్లీలో బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగంలో 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ భవన్లో గల అంబేద్కర్ ఆడిటోరియంలో 10  డిసెంబర్  రోజున సమావేశం ఏర్పాటు చేశారు.  ఈ సమావేశానికి సంగారెడ్డి నుండి బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడు, అధ్యక్షతన వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున పాటిల్, కో కన్వీనర్ సుధాకర్ గౌడ్, ఇట్టి సమాజంలో పాల్గొన్నారు.  ఈ సమావేశానికి పార్లమెంట్ సభ్యులు నాగరాజు అంబిక లక్ష్మీనారాయణ,  బీరంమస్తాన్ రావు, సత్యనారాయణ, రవిచంద్ర , పాల్గొని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం సంఘీభావం తెలిపారు పార్లమెంటు ప్రైవేట్ బిల్లు పెట్టడానికి ఆమోదం తెలిపారు ప్రభు గౌడ్ మాట్లాడుతూ బీసీలకు42 శాతం రిజర్వేషన్ కచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమూలన బీసీల దక్కాల్సిన ఫలాలుదక్కడం లేదని ఆవేదనను వ్యక్తం చేశారు. మొన్నటి స్థానిక ఎన్నికల్లో బీసీలకు సరియైన రిజర్వేషన్ ఇవ్వని కారణంగా సాయి ఈశ్వర చారి అనే సంగారెడ్డి యువకుడు ఆత్మబలిదానం చేసుకున్నాడని ఆయన కుటుంబానికి ఎవరు దిక్కు అని ప్రశ్నించారు, ఇకపై యువకులు ఎలాంటి బలిదానాలు చేసుకోకూడదని కోరారు, సాయి ఈశ్వర చారి కుటుంబానికి కోటి రూపాయలు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగి ఇవ్వాలని అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన  బిసి జేఏసీ సమావేశంలో పాల్గొన్నవారు.  బీసీ జేఏసీ చైర్మన్ ప్రభు గౌడు, వైస్ ఛైర్మన్ కుమ్మరి సాయిలు, వర్కింగ్ చైర్మన్ గోకుల్ కృష్ణ, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్, సుదర్శన్ గౌడ్, కో కన్వీనర్లు రాగులపల్లి లక్ష్మి, సుధాకర్ గౌడ్, నాగరాణి యాదవ్,  వడ్లలత మానస లతగౌడ్,  ఎం కొండయ్య, పాండ్ రంగం, గౌలిఈశ్వర్, శ్రీనివాస్, రాందాస్, నాగభూషణం, నాయి సుభాష్ రామ్ చందర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tuesday, December 09, 2025

నందిగామలో విక్రమ్ గౌడ్‌ను విజయం దిశగా నడిపించండి: కాట శ్రీనివాస్ గౌడ్

 

సంగారెడ్డి/పటాన్ చెరు, డిసెంబర్ 9 (SNM న్యూస్):: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, నందిగామ గ్రామ సర్పంచ్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ కు మద్దతుగా పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మంగళవారం విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపను సందర్శించి గ్రామ ప్రజలతో నేరుగా మాట్లాడి, కర పత్రాలను అందజేస్తూ గ్రామ అభివృద్ధికి విక్రమ్ గౌడ్ వంటి నిబద్ధత కలిగిన నాయకుడు అత్యవసరమని వివరించారు. అభివృద్ధి కోసం, పారదర్శక పాలన కోసం, గ్రామం కోసం—తమ విలువైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి విక్రమ్ గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాట శ్రీనివాస్ గౌడ్ గ్రామస్థులను కోరారు.

కౌలంపేటలో స్వాతి శ్రీశైలంకు మద్దతుగా నిర్మలా జగ్గారెడ్డి ప్రచారం


సంగారెడ్డి, డిసెంబర్ 9 (SNM న్యూస్):: కంది మండలం కౌలంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి స్వాతి శ్రీశైలంకు మద్దతుగా ప్రచారం  టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మి, గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని శ్రీశైలం గత 20 ఏళ్లుగా పార్టీలో ఉండి పని చేస్తున్నారని కొనియాడారు. ఇటువంటి నిజాయితీ, సేవాభావం ఉన్న నాయకత్వం గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపిస్తుందని నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో స్వాతి శ్రీశైలంను గెలిపిస్తే  ఇందిరమ్మ ఇండ్లు, సిసి రోడ్లు, డ్రైనేజి, రేషన్ కార్డులు, యువతకు పరిశ్రమల్లో ఉద్యోగాలు, రెండు వాటర్ ఫ్లాంటు తదితర సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కౌలంపేట గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నుండి సాధ్యమైనంత మేర నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి తాము కట్టుబడి ఉంటామన్నారు. గ్రామాభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని, ప్రజలు విశ్వాసంతో ఓటు వేసి అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆంజనేయులు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దుందిగల్ల రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Monday, September 22, 2025

పట్నం మాణిక్యం జన్మదిన సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): అన్నం పరబ్రహ్మ స్వరూపం, దేవుడు అందరినీ ఒకేలాగా పుట్టించలేదు కానీ ఆకలిని మాత్రం ఒకే విధంగా పుట్టించాడు. ఆకలి అన్నవారికి మనం పట్టెడన్నం పెడదాము, వారి అలసిన కన్నుల్లో ఆనందాన్ని చూద్దాం అంటూ,  పట్నం మాణిక్యం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తూనే ఉంది. సోమవారం పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా జన్మదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణం ప్రభుత్వాసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం, పండ్ల పంపిణీ చేసి తమ ప్రియతమ నాయకునికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి నియోజకవర్గం పిఎంకె యువసేన నాయకులు. ఈ కార్యక్రమంలోని టిఆర్ఎస్ నాయకులు, పిఎంకె యువసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.



Thursday, September 18, 2025

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడ్డా కూడా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని అతివేగంగా నడపడం వలన లారీ ముందు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను సంగారెడ్డి రూరల్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామును పునరుద్ధరించారు

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...