Thursday, December 18, 2025

డిసెంబర్ 21న జరుగనున్న జాతీయ మెగా లోక్-అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి..

సంగారెడ్డి ప్రతినిధి (SNM NEWS): ఈ నెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్-అదాలత్ ను ఊదేశించి జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశం అని, రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో కక్షిదారులు రాజీపడవచ్చు అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, రాజీ కుదుర్చుకోవడం ద్వారా ఇరు వర్గాలు గెలుపొందినట్లు అవుతుంది అన్నారు. ఈ నెల 21 ఆదివారం జరగనున్న జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని కక్షిదారులకు సూచించడం జరిగింది.  ఎస్.హెచ్.ఓ లు, కోర్ట్ డ్యూటి అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న, క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన కేసులు,  వైవాహిక జీవితం సంబంధిత కేసులు, బ్యాంకు రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి రాజీ కుదుర్చుకోవడానికి అవకాశం అన్ని కేసులలో ఇరువర్గాల సమ్మతితో రాజీపడేలా చూడాలని అన్నారు.  సైబర్ నేరాలకు సంభందించి, సైబర్ మోసగాళ్ల చేతిలో  బాధితులు కోల్పోయిన డబ్బులు త్వరగా భాదితులకు అందే విధంగా చూడాలని, 25 వేల రూపాయల కంటే తక్కువ డబ్బు కోల్పోయిన కేసులలో లోక్-అదాలత్ ద్వారా ఫిర్యాదు తీసుకొని, ఎఫ్ఐఆర్ లేకుండానే రీఫండ్ ప్రక్రియా చేయాలని అధికారులకు సూచించడం జరిగింది.  ఈ నెల 21న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం అయ్యేలా అధికారుల నుండి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు భాద్యత యుతంగా వ్యవహరించి, రాజీ పడదగిన అన్ని కేసులలో ఇరువర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి, వీలైనన్ని ఎక్కువ కేసులు రాజీపడేలా చూడాలన్నారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...