సంగారెడ్డి, డిసెంబర్ 29 (SNM NEWS): వికారాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ఎస్‌జీజీఎఫ్ అండర్–17 బాయ్స్ ఫుట్‌బాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న కేంద్రీయ విద్యాలయ ఎద్దు మైలారం పాఠశాల విద్యార్థి గడ్డమీది సాయి సిద్ధార్థ గౌడ్‌కు సంగారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ, పీడీ శ్రీనివాసరావు చేతుల మీదుగా సర్టిఫికెట్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ క్రీడపై మాట్లాడిన ఎస్‌జీజీఎఫ్ సెక్రటరీ శ్రీనివాసరావు మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ప్రతిభావంతమైన యువ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహిస్తామని తెలిపారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు అండగా నిలిచి, వారికి అవసరమైన సహకారం అందిస్తూ ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కృషి చేస్తుందని ఆయన అన్నారు. యువత క్రీడల ద్వారా శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, విద్యార్థులు క్రీడలతో పాటు విద్యలోనూ ఉత్తమ ప్రతిభ కనబర్చాలని సూచించారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Tuesday, December 30, 2025
Thursday, December 18, 2025
మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి డా. అల్లాని కిషన్ రావు పేరు పెట్టాలి -తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి ఇరిగిజ్జ మురళీ కృష్ణ డిమాండ్
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్‌చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అల్లాని కిషన్ రావు సేవలను గుర్తిస్తూ, నూతనంగా నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి ఆయన పేరు పెట్టాలని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి, జనం బాట – సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ ఇరిగిజ్జ మురళీ కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పటాన్‌చేరు అంటే పరిశ్రమలు, కాలుష్యం, ఆరోగ్య సమస్యలు రాష్ట్ర ప్రజలకు తెలిసిందేనని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కోసం న్యాయస్థానాల దాకా పోరాడి, జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్ జి టీ) తీర్పు ద్వారా పరిశ్రమల నుంచి సి ఎస్ ఆర్ నిధులు సాధించడంలో దివంగత డా. అల్లాని కిషన్ రావు కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన నిరంతర పోరాట ఫలితంగానే వందల కోట్ల రూపాయల సి ఎస్ ఆర్ నిధులతో పటాన్‌చేరు ప్రాంతంలో నూతన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. పటాన్‌చేరు ప్రాంతంలోనే జన్మించిన డా. అల్లాని కిషన్ రావు పదవి, పేరు కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం నిజాయితీగా పోరాడిన మచ్చలేని నాయకుడని మురళీ కృష్ణ అన్నారు. అలాంటి వ్యక్తి పేరును ఆస్పత్రికి పెట్టడం ద్వారా ఆయన సేవలకు తగిన గౌరవం లభించడమే కాకుండా, రాబోయే తరాలకు ప్రజల కోసం పోరాడితే మార్పు సాధ్యమనే సందేశం అందుతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై పటాన్‌చేరు ప్రజల తరపున కల్వకుంట్ల కవిత సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయగా, తెలంగాణ జాగృతి నాయకులు కలెక్టర్‌ను కలిసి ఆ లేఖను స్వయంగా అందజేశారని తెలిపారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఈ ప్రతిపాదనను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు రాజేంద్ర ప్రసాద్ మిశ్రా, బస్తెపురం పోచయ్య, మేధావుల ఫోరం నాయకులు రెడ్డిబోయిన భిక్షపతి పాల్గొన్నారు.
Wednesday, December 17, 2025
ఇంద్రేశంలో కార్యక్రమాల సమాచారం కాంగ్రెస్ నాయకులకు ఇవ్వడం లేదు: ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి
పటాన్ చెరు, డిసెంబర్ 17 (SNM NEWS): ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ నాయకులకు కమిషనర్, అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని పటాన్ చెరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఆత్మ కమిటీ డైరెక్టర్ మన్నె లక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అధికారిక సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మున్సిపల్ కమిషనర్, అధికారులు ఎలాంటి సమాచారం అందించడం లేదని ఆరోపించారు. ఇలాంటి వ్యవహారంతో ప్రజలకు సరైన సమాచారం చేరడంలో అంతరాయం కలుగుతుందని, అలాగే ప్రజాప్రతినిధుల పాత్రను తగ్గించినట్లుగా భావించాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, అధికారులు భవిష్యత్తులో ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో జరిగే కార్యక్రమాలకు సంబంధిత నాయకులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని మన్నె లక్ష్మి డిమాండ్ చేశారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం
ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్‌చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...


