సంగారెడ్డి, మార్చి 01 (SNM న్యూస్): దాదాపు 36 ఏళ్ల తర్వాత తమ స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడిగా గడిపారు. చౌటకూర్ మండలం శివంపేట గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మల్లేపల్లి లోని ఆర్ ఆర్ ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత తమ స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సందడిగా గడిపారు. ఈ సందర్భంగా తమ గురువులను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు. ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజమౌళి, శివప్రసాద్, బాలనాగిరెడ్డి, విద్యార్థులు భాస్కర్ వర్మ, దేవరాజ్, రవి, సుదర్శన్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment