సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తూ, అవసరంలో ఉన్న ఓ నిరుపేద కార్మికుడికి తక్షణ ఆర్థిక సహాయం అందించి ఆదర్శంగా నిలిచారు. సంగారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్, శివాజీ నగర్ ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న జగ్గారెడ్డికి రోడ్డుపక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ కార్మికుడు కనిపించాడు. వెంటనే తన వాహనాన్ని వెనక్కి తిప్పి ఆ కార్మికుడి వద్దకు వెళ్లిన ఆయన, అతని జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. వాన, ఎండలకు తడుస్తూ రోడ్డుపక్కనే చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నానని, సరైన నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని కార్మికుడు జగ్గారెడ్డికి విన్నవించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనికి అవసరమైన సామగ్రి కూడా కొనుగోలు చేయలేకపోతున్నానని, కొంత సహాయం అందితే తన ఉపాధి మెరుగుపడుతుందని వివరించాడు. కార్మికుడి పరిస్థితిని గమనించిన జగ్గారెడ్డి, అతని జీవనోపాధికి అండగా నిలవాలనే ఉద్దేశంతో వెంటనే రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని చెప్పులు కుట్టే పనిముట్లు, నీడ ఏర్పాటు తదితర అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

No comments:
Post a Comment