సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (SNM NEWS): సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ 32వ వార్డు అభ్యర్థి నాయి కోటి అశ్విని సవీన్ కుమార్ ఇంటింటికి తిరిగి కార్యకర్తలతో ప్రచారం చేశారు. మున్సివల్ 32 వ వార్డు అభ్యర్థి నాయికోటి అశ్వని కుమార్ మాట్లాడుతూ గత కాలంలో మేము చేసిన అభివృద్ధి మీ అందరూ చూశారు. కరోనా కష్టకాలంలో కూడా వ్రతి ఇంటికి తిరిగి శానిటైజషన్ చేయడం జరిగింది. గత ఎలక్షన్లో మాట ఇచ్చిన విధంగా గత ఏడు సంవత్సరాలుగా ప్రతి! ఇంటికి రోజు మంచినీటి సరఫరా మరియు సొంత నిధులతో టాంకర్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి వీధికి సిసి రోడ్డు డ్రైనేజీ వీధి దీపాలు ఏర్పాటు చేసి వార్డు రేఖలను మార్చాము. వార్డు ప్రజల సౌలభ్యం కోసం కలెక్టర్ వెనకాల పార్కును ఏర్పాటు చేశాము. వాటర్ ట్యాంక్ నిర్మించామని, డ్వాక్రా మహిళల కోసం డ్వాక్రా బిల్డింగ్ నిర్మించి మహిళల ఆత్మగౌరవం పెంచామని అన్నారు. గతంలో చేసిన విధంగానే రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మన వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని మాట ఇస్తున్నామని తెలియజేశారు. పాలకుడిగా కాదు ప్రజా సేవకుడిగా ఉంటాను. అందరూ గర్వపడేలా పనిచేస్తాను మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను సన్ను అధిక మెజారిటీతో గెలిపించగలరని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు కాలనీవాసులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.

No comments:
Post a Comment