సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS):సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి భవిష్యత్తుపై ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. రాను రాను హిందువుల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. సంగారెడ్డి నాల్ సాబ్ గడ్డగా మారే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వబోమని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రదాయం, భద్రత, అభివృద్ధికి కమలం గుర్తే శ్రీరామ రక్ష అని పేర్కొన్నారు. భావితరాల భద్రత, సంస్కృతి పరిరక్షణ కోసం కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులు సాహితీ–రామును భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా ఏకమై బీజేపీకి మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Saturday, February 07, 2026
కమలం గుర్తే శ్రీరామ రక్ష: మెదక్ ఎంపీ రఘునందన్ రావు -12వ వార్డులో కార్నర్ మీటింగ్‌లో వ్యాఖ్యలు
Subscribe to:
Post Comments (Atom)
గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!
-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...
-
పటాన్చెరు, ఆగస్టు 27 (SNM న్యూస్): కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోదర–స...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...

No comments:
Post a Comment