Wednesday, February 04, 2026

పార్టీ మోసం చేసింది… కన్నీరు పెట్టుకున్న 2వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్థి సాయి భాష

 

సంగారెడ్డి, ఫిబ్రవరి 3(SNM NEWS): సంగారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో 2వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాయి భాష పార్టీ తనను మోసం చేసిందని ఆరోపిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ నుంచి అన్యాయం జరిగిందని పేర్కొంటూ, ప్రజలు తనకు న్యాయం చేయాలని కోరుతూ కన్నీరు పెట్టుకున్నారు. 2వ వార్డు నుంచి బిఆర్ఎస్ పార్టీ టికెట్ తనకే ఇస్తామని పలుమార్లు హామీ ఇచ్చారని తెలిపారు. మూడో తేదీ మధ్యాహ్నం 2 గంటల 40 నిమిషాల వరకు కూడా అదే మాట చెప్పారని, అయితే చివరికి మరో వ్యక్తికి టికెట్ కేటాయించడంతో తీవ్రంగా ఆవేదనకు గురయ్యానన్నారు. సంగారెడ్డిలో రాజకీయాలు ఎంత నీచ స్థాయికి దిగజారాయో ఇదే నిదర్శనమని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ పార్టీ తనకు అన్యాయం చేసినప్పటికీ ప్రజలు మాత్రం అన్యాయం చేయరని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి 2వ వార్డులో గెలిచి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు. డబ్బు లేదనే కారణంతోనే తనకు బిఆర్ఎస్ పార్టీ బీ–ఫారం ఇవ్వలేదని ఆరోపించారు. ప్రజలు తన పరిస్థితిని అర్థం చేసుకుని ఓటు వేసి ఆశీర్వదించాలని సాయి భాష కోరారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...