సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 6 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని పాతకేరి నందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత పక్షాన టి.జి. ఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి గారు పాల్గొన్నారు. ఇట్టి సందర్భంగా వారు మాట్లాడుతూ గతకాలంలో కూడా పులిమామిడి రాజు 12 వ వార్డు ప్రజలకు ఎంతగానో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, 12 వ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలను కూడా ప్రజలకు అందజేసేలా చూశారాని వారి లాంటి మంచి మనసున్న వ్యక్తి మీకు దొరకడం 12 వ వార్డు ప్రజల అదృష్టమని నిర్మల జగ్గారెడ్డి గారు అన్నారు. ఈ సారి బి.సి మహిళ వచ్చిన సందర్భంగా వారి సతీమణి పులిమామిడి మమత కాంగ్రెస్ పార్టీ తరపున పోటీలో ఉన్నారని, మళ్ళీ వారిని గెలిపించుకుంటే 12 వ వార్డును మరింత అభివృద్ధి చేస్తారని వారి తరపున నేను హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం మన రేవంతన్న ప్రభుత్వం అందుబాటులో ఉందని ప్రజలందరూ ఇట్టి విషయాన్ని గమనించి అధికార పార్టీకి మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ అభ్యర్థి పులిమామిడి మమత చేతి గుర్తుకు వేసి వారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తిచేశారు. 12 వ వార్డులో ఇంతవరకే కారును ప్రజలందరూ కలిసి ఫంచర్ చేశారని, ఈ ఎన్నికల తరువాత పూర్తిగా గ్యారేజికి పర్మనెంట్ గా పంపించగలరని 12 వ వార్డు ప్రజలకు తెలియ పరిచారు. ఇట్టి కార్యక్రమంలో సీడిసి చైర్మన్ గడీల రాంరెడ్డి, చెర్యాల అంజన్న,పట్టణ అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షులు చాట్ల సిద్దన్న, 12 వార్డు ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారి, కంది కృష్ణ, వార్డు ప్రజలు, పిఎంఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Saturday, February 07, 2026
పులిమామిడి మమత తరపున 12వ వార్డు నందు ప్రచారంలో పాల్గొన్న TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment