Monday, February 09, 2026

సదాశివపేటలో జయమ్మ... సంగారెడ్డిలో నిర్మలమ్మ -కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న తల్లీ కూతుళ్ళు

 



-8 కోట్ల తో ఒక్కో వార్డులో అభివృద్ధి, పేదలకు ఇంటి స్థలాల హామీతో ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 8 (SNM NEWS):మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రెండు రోజుల్లో తెర పడనుండటం తో  కాంగ్రెస్ పార్టీ ప్రచారం లో దూకుడు పెంచింది. సంగారెడ్డి లో శనివారం జరిగిన  ప్రజలతో జగ్గారెడ్డి ముఖాముఖి  సభ వియవంతం కావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ఆదివారం ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు.  సదాశివపేట లో జయా చైతన్య రెడ్డి,    సంగారెడ్డి లో నిర్మలా జగ్గారెడ్డి ఇంటిటి  ప్రచారం లో పాల్గొన్నారు. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థుల తరపున  పట్టణం లో ని 11,31,32,33,6 వ వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను   గెలిపిస్తే ప్రతీ వార్డులో 8 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేయడం తో పాటు వార్డులో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలాలు ఇప్పిస్తామన్నారు. మీ మనస్సు మాట వినండి, కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు. మరో పక్క సదాశివపేట మున్సిపాలిటీ లో జయా చైతన్య రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు.17,18,4,8 వార్డులతో పాటు పలు వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయారెడ్డి మాట్లాడుతూ  ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి జగ్గారెడ్డి అని, ఆయన  మాట ఇస్తే చేసి తీరుతారని అన్నారు. సదాశివపేట  లో సర్టిఫికెట్లు ఉన్న 5500 మందికి తో పాటు ఇల్లు లేని ప్రతీ పేదలకు ఇంటి స్థలాలు జగ్గారెడ్డి ఇచ్చి తీరుతారాన్నరు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతీ వార్డులో 8 కోట్ల రూపాయల తో అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం లో ఆయా వార్డుల అభ్యర్థులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...