Monday, February 09, 2026

ఇంటింటి ప్రచారంలో జోష్ 37 వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ రమేష్ సింగ్

 సంగారెడ్డి, ఫిబ్రవరి 8 (SNM NEWS):సంగారెడ్డి మున్సిపాలిటీలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. మున్సిపాలిటీలోని 37వ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఠాకూర్ రమేష్ సింగ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మీ ఇంటి సేవకుడిగా, పనిచేస్తానని పదవి కోసం రాలేదని 37వ వార్డు ప్రగతి కోసం వచ్చానని నన్ను గెలిపిస్తే కౌన్సిలర్ అవుతా కానీ ఎప్పటికీ మీ మనిషిగా ఉంటూ సేవ చేసుకుంటారని అన్నారు. 37వ వార్డు అభివృద్ధి చేసి చూపిస్తానని ఓటర్లకు వివరించారు. వార్డు అభివృద్ధికి స్వచ్ఛందంగా కృషి చేస్తానని అన్నారు. కాలనీవాసులో తన ప్రచారానికి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఫుట్ బాల్ గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి చేయూతనివ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!

-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...