150 మంది చిన్నారుల చే తారా డిగ్రీ కళాశాల ప్రాంగణం లో సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన
సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 1 (SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని నక్షత్ర స్ఫూర్తి డాన్స్ అకాడమీ నిర్వాహకు రాలు నిర్వాహకురాలు గీతా యజ్ఞశ్రీ శిష్య బృందం నిర్వహించిన 150 మంది కళాకారుల చే కూచిపూడి వైభవం సరస్వతి స్తుతి సామూహిక కార్యక్రమానికి వండల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చిన్నారులు సామూహికంగా నృత్యం చేసి ఒక రికార్డును నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి చిన్నారులకు శిక్షణ ఇచ్చిన గీతా యజ్ఞశ్రీ ని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, కోఆర్డినేటర్ రవి కుమార్ మెడల్‌తోపాటూ ధ్రువీకరణ పత్రం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాసవి మా ఇల్లు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజి అనంతకిషన్, పుల్లూరి ప్రకాష్,టి వై యస్ యస్ అధ్యక్షులు కూన వేణు, తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment