Wednesday, February 04, 2026

ప్రచారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులి మామిడి మమత రాజు


సదాశివపేట, ఫిబ్రవరి 3(SNM NEWS): 

సదాశివపేట పట్టణంలోని 12 వవార్డులో భారీ జనసంద్రోహంతో గడప గడప తిరుగుతూ ప్రతి ఓటరును ఆకర్షిస్తూ కరపత్రాన్ని పంచుతూ 12 వ వార్డు అభ్యర్థి పులిమామిడి మమత రాజు దంపతులిద్దరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీ అందించగలరని ఓటరు మహాషయులను విజ్ఞప్తిచేశారు. ఇట్టి సందర్భంగా పులి మామిడి రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు అందజేస్తుందని అందువలనే ప్రజలందరూ కాంగ్రెస్ వెనకానే ఉన్నారని, బిఆర్ ఎస్ పార్టీ కనుమరుగై పోతుందని అన్నారు. సంగారెడ్డి మరియు సదాశివపేట రెండు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసు కోబోతుందని వారు మీడియా ముఖంగా తెలియపరిచారు. ఇట్టి కార్యక్రమంలో 12 వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్చందంగా పాల్గొన్నారు. అదేవిధంగా 12 వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వడ్ల బింబాధర్ చారీ, బక్కప్ప, ఫయాజ్, మొయిజ్, రియాజ్, షకీల్, సురేష్, పి. ఎం. ఆర్ యువసేన నాయకులు మాణిక్యం, పరమదాసు, సంగమేష్, అనిల్, అఖిల్, అంజి, రాము, సోమ శంకర్,ఖరీం, అభిమానులు, మహిళలు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...