సంగారెడ్డి, మే 11 (SNM న్యూస్) : విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అనుకూలంగా డిజిటల్ తరగతి గదులు, విశాలమైన క్లాస్‌రూములు, పెద్ద ఆట స్థలం, బాక్స్ క్రికెట్ సదుపాయం కల్పించినట్లు వేదాన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఉపేందర్ తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని గణేష్‌నగర్‌లో కృష్ణ దేవాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన వేదాన్య పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం పాఠశాల అసెంబ్లీ మైదానంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేణు భగవాన్, దామోదర్ రెడ్డి హాజరై మాట్లాడారు. నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు విద్యార్థుల మానసిక ఉల్లాసం కోసం క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. స్నేహపూర్వక అధ్యాపక బృందంతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాల నిర్వహణలో డైరెక్టర్ మనోహర్ గౌడ్, సంజయ్ హాట్కర్, వివేక్ కుమార్ సేవలందిస్తుండగా, కో-డైరెక్టర్లు సంజయ్ సోనాలి, ప్రేమ్ కుమార్, రవితేజ పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థులు, అధ్యాపక బృందం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

No comments:
Post a Comment