Tuesday, September 30, 2025

సంగారెడ్డిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 30 (SNM NEWS): సంగారెడ్డిలోని శివాజీ నగర్ లో శౌర్య యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి పట్టణానికి చెందిన అనుముల సంజన, అనుముల సంతోష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో కల్యాణాన్ని భక్తిశ్రద్ధలతో అంగర వైభవంగా జరిపించారు. అనంతరం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు పిట్టల రమేష్ సభ్యులు ద్వారక రవి శివ, మహేష్ చారి, చారి, రేవంత్, భాను, శేఖర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Monday, September 22, 2025

పట్నం మాణిక్యం జన్మదిన సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): అన్నం పరబ్రహ్మ స్వరూపం, దేవుడు అందరినీ ఒకేలాగా పుట్టించలేదు కానీ ఆకలిని మాత్రం ఒకే విధంగా పుట్టించాడు. ఆకలి అన్నవారికి మనం పట్టెడన్నం పెడదాము, వారి అలసిన కన్నుల్లో ఆనందాన్ని చూద్దాం అంటూ,  పట్నం మాణిక్యం ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తూనే ఉంది. సోమవారం పట్నం మాణిక్యం డిసిసిబి వైస్ చైర్మన్ ఉమ్మడి మెదక్ జిల్లా జన్మదిన సందర్భంగా సంగారెడ్డి పట్టణం ప్రభుత్వాసుపత్రిలోని వందలాది మందికి అన్నదానం, పండ్ల పంపిణీ చేసి తమ ప్రియతమ నాయకునికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన సంగారెడ్డి నియోజకవర్గం పిఎంకె యువసేన నాయకులు. ఈ కార్యక్రమంలోని టిఆర్ఎస్ నాయకులు, పిఎంకె యువసేన నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు.



వాసవి దేవాలయంలో ప్రారంభమైన శరణన్నవరాత్రి వేడుకలు



సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 22 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శరన్నవరాత్రి వేడుకలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి పూజ ఆలయ కమిటీ చైర్మన్ తో పాజి అనంత కిషన్ దంపతుల ఆధ్వర్యంలో జరిగాయి. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక కార్యక్రమాలను చేశారు. మొదటిరోజు అమ్మవారిని దుర్గామాత రూపంలో ప్రత్యేకంగా అలంకరించారు. తొలిరోజు పూజలు ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు బాలూరి శంకర్, తాటికొండ జగదీశ్వర్, కన్నయ్యగారి మనోహర్, మిరియాల లక్ష్మీనారాయణ,  సంతోష్ దంపతులు కూర్చున్నారు. 

ప్రతిరోజు అమ్మవారిని గొప్ప రూపంలో అలంకరిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ తెలిపారు. భక్తులు అమ్మవారిని అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

Saturday, September 20, 2025

దళిత జర్నలిస్టుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా -మంత్రి వివేక్ వెంకటస్వామి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 20 (SNM NEWS): రాష్ట్ర వ్యాప్తంగా నుండి వచ్చిన దళిత జర్నలిస్టులను కలుసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన దళిత జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర మహాసభలో ముఖ్య అతిథిగా కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సోదరుల హక్కులు దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యం అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దళితుల సమస్యలపై ఇప్పటికే చర్చ జరిగినట్లు గుర్తు చేశారు. బడ్జెట్‌లో 18 శాతం నిధులు కేటాయిస్తే దళితుల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ, దళితుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీ సమస్యలను నేను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మంత్రి భరోసా ఇచ్చారు. దళితుల అభ్యున్నతికి తన తండ్రి కాకా వెంకటస్వామి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, నేను కూడా అదే మార్గంలో నడుస్తూ దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా అని స్పష్టం చేశారు. రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు దళితుల భూమి సమస్యపై అన్యాయం జరగకూడదని అప్పుడు కూడా తన కుటుంబం అభిప్రాయం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. దళితుల కోసం నేను ఎల్లప్పుడూ మీతో ఉంటా, మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా అని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపాగు జాన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు రాపాక విజయరాజు, వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు దళిత జర్నలిస్టులు పాల్గొన్నారు.

Friday, September 19, 2025

సంగారెడ్డిలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం

 


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 19 (సిరి న్యూస్):

సంగారెడ్డిలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం శనివారం రోజు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ మిట్టపల్లి రాజేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్. తెలంగాణ సెంట్రల్ జోన్ కమిటీ మెంబర్ సాల్మన్ రాజు పాల్గొంటారని ఆయన సూచించారు. అదేవిధంగా పటాన్చెరువు, సంగారెడ్డి, అందోల్, నర్సాపూర్, మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్, తదితర ప్రాంతాలతో పాటు ప్రజలు కార్యకర్తలు యువకులు మహిళలు పాల్గొనాలని ఆయన సూచించారు. పార్టీ కార్యాలయం ఆఫీసు సాయిబాబా మందిరం పక్కన ఉందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా జిల్లా కార్యకర్తల సమావేశం కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పార్టీ నాయకులు తప్పకుండా హాజరుకావాలని ఆయన సూచించారు.

Thursday, September 18, 2025

సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం మహిళ అక్కడికక్కడే మృతి

సంగారెడ్డి, సెప్టెంబర్ 18 (SNM NEWS): సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో సిగ్నల్ పడ్డా కూడా లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతో లారీని అతివేగంగా నడపడం వలన లారీ ముందు ద్విచక్ర వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఢీకొట్టడం జరిగింది. ఈ ప్రమాదంలో సంఘటన స్థలంలోనే ఒక మహిళ మృతి చెందగా మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరు వ్యక్తులను సంగారెడ్డి రూరల్ పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని సంగారెడ్డి రూరల్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ జామును పునరుద్ధరించారు

Wednesday, September 17, 2025

ఆర్ఆర్ఆర్ భూసేకరణ పనుల వేగవంతం చేయాలి -జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): జిల్లాలో జరుగుతున్న భూసేకరణ పనుల  వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్ పి  ప్రావీణ్య , రెవెన్యూ అధికారులను ఆదేశించారు . బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  రెవెన్యూ అధికారులతో రీజినల్ రింగ్ రోడ్, రోడ్ ఓవర్ బ్రిడ్జీలు  నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ కోసం జరుగుతున్న భూసేకరణ అంశాలను సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణలో ప్రజల న్యాయమైన హక్కులు కాపాడబడేలా, రైతులకు న్యాయం జరుగేలా, అలాగే అభివృద్ధి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెద్దాపూర్, గిర్మాపూర్ శివాంపేట్ మండలాల్లో భూసేకరణ సమస్యలపై సవివర చర్చ జరిపి, వాటికి సాధ్యమైన పరిష్కారాలను సూచించారు. ముఖ్యంగా రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ విషయమై భూముల  సమస్యలు ఉత్పన్నం కాకుండా  చర్యలు చేపట్టాలని అన్నారు . భూసేకరణలో న్యాయం జరిగేలా  విక్రయ విలువలను ఆధారంగా పరిగణించాల్సిందిగా పేర్కొన్నారు. అదేవిధంగా, జహీరాబాద్ పరిధిలో ఏర్పాటు చేయబోతున్న నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ నిమ్జ్ కు సంబంధించిన భూసేకరణ పురోగతిని కూడా కలెక్టర్ సమీక్షించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టి జి ఐ ఐ సి)ల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం మేరకు, నిమ్జ్ లో భాగంగా జహీరాబాద్ స్మార్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి చేయబడనున్నది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక కారిడార్ కోసం అవసరమైన భూముల సేకరణపై అధికారులు సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ మాధురి, రెవెన్యూ అధికారులు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పత్తి కొనుగోలు పై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం


 సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): 2025-26 సీజన్ పత్తి కొనుగోలు,  సంబంధించి బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్  పి.ప్రావీణ్య, సంబంధిత మిల్లర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ  2025-26 సీజన్ జిల్లా వ్యాప్తంగా  3,48,775ఎకరాల్లో పత్తి సాగు చేయగా 2,79,020 మెట్రిక్  టన్నులు దిగుబడి అంచనా వేయడం జరిగిందని. ఇందుకు తగ్గట్టు గా సజావుగా కొనుగోలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. పత్తి కొనుగోలు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఆరు మార్కెటింగ్ యార్డులపరిధిలో 24 జిన్నింగ్ మిల్లుల  నుండి, సి.సి.ఐ. ద్వారా ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం కొనుగోలు  ప్రారంభమయ్యేలా  అధికారులు  చర్యలు  చేపట్టాలని అన్నారు .  సీసీఐకి పత్తి అమ్ముకోవాలంటే ఆధార్ ప్రామాణికత అనేది తప్పనిసరి అని. పత్తి కొనుగోలు  చెల్లింపులను ఆధార్ తో అనుసంధానం అయిన బ్యాంకు ఖాతాలో మాత్రమే జమ చేయడం జరుగుతుందని. జిల్లాలో గల అన్ని జిన్నింగ్ మిల్లులను తనిఖీ చేసి సరిగా ఉండేలా చూడమని కలెక్టర్ ఆదేశించారు. లీగల్ మెట్రాలజీ  శాఖ అధికారులు  జిన్నింగ్ మిల్లులలో  తనిఖీలు నిర్వహించి నిర్వహించాలని అన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జీన్నింగ్ మిల్లుల యాజమాన్యం సరైన జాగ్రత్తలు తీసుకునేలా అగ్నిమాపక శాఖ అధికారి విజిట్ చేసి సూచనలు చేయాలన్నారు.జిన్నింగ్ మిల్లులలో రైతులకు కనీస మౌలిక వసతులైన తాగునీరు, నీడ వంటి సదుపాయాలను కచ్చితంగా కల్పించాలని ఆదేశించారు.జిన్నింగ్ మిల్లులలో కొనుగోలు జరిపేటప్పుడు టోకెన్ సిస్టం అమలు చేసి క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్  మాధురి, జిల్లా మార్కెటింగ్ అధికారి రషీద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి  శివ ప్రసాద్, అగ్నిమాపకశాఖ అధికారులు, జిల్లా రవాణా శాఖ అధికారులు, జీన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.

పిసిపిఎన్డిటి పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు. -అదనపు కలెక్టర్ చంద్రశేఖర్

 


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS):నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన బుధవారం  తన ఛాంబర్  పిసిపి ఎన్ డి టి ఆక్ట్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పూర్తిగా నిషేధితమన్నారు. ఇందుకోసం ప్రభుత్వం పిసిపి ఎన్డిటి యాక్ట్ ను అమల్లోకి తీసుకువచ్చింది అన్నారు.  పి సి పి ఎన్ డి టి గోడప్రతులు ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని అన్నారు. ఎక్కడైనా ముందస్తు గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆ సంస్థలపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల నమోదు స్థితిపై ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సమీక్ష జరిపారు. ఫార్మ్ అఫ్ రికార్డుల నిర్వహణ సమర్పణ సక్రమంగా నింపడంపై పరిశీలించారు.  అక్రమంగా నడుస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలపై సర్వైవల్ ఇన్స్పెక్షన్ చేపట్టి అవసరమైతే యంత్రాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు పెండింగ్ లో ఉన్న కేసులు ఇప్పటికే శిక్ష పడిన కేసుల స్థితిపై అదనపు కలెక్టర్ సమీక్ష జరిపారు. జిల్లాలో బాలికల జనాలను నిష్పత్తి గణాంకాలపై సమీక్షించారు. ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షల నిషేధంపై ప్రజలక అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు గర్భ శిశువులింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ఆరోగ్యశాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు పరస్పరం సమన్వయం చేస్తూ పిసిపిఎన్డిటి చట్టం అమలులో కఠినంగా వ్యవహరించాలన్నారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు  పి సి పి ఎన్ డి టి చట్టం ఉల్లంఘన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశాలు  నిరంతరంగా నిర్వహించేల చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రతినెల తనిఖీలు నిర్వహించడం తనిఖీల సంఖ్యను పెంచడం అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల రికార్డులు పరిశీలించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు ప్రజల్లో ఈ చట్టం పై అవగాహన కోసం గోడపత్రికలు ఏర్పాటు చేయడం మీడియా ద్వారా పాఠశాలలో కళాశాలలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ  నిర్మల, ఎన్ జి ఓ ప్రతినిధులు, పోలీస్ అధికారులు ఆరోగ్యశాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో ఒకే బండిపై కలిసి ప్రయాణించిన జగ్గారెడ్డి దంపతులు

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): సంగారెడ్డి రాజకీయాల్లో జగ్గారెడ్డి అనే పేరు వినగానే వెంటనే ఒక ప్రత్యేకమైన ప్రజా ప్రతిరూపం గుర్తుకు వస్తుంది. తన ప్రజాభిమానానికి పేరుగాంచిన ఆయన, కఠినమైన రాజకీయ లాంఛనాలకు కట్టుబడి ఉండకుండా సాధారణ ప్రజలతో సులభంగా కలిసిపోవడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకుంటూ ఆయన శైలి ఎల్లప్పుడూ ప్రజల హృదయాలను హత్తుకునేలా మసలుకుంటాడు. బుధవారం సంగారెడ్డి పట్టణంలో అరుదైన సన్నివేశంలో, జగ్గారెడ్డి తన భార్య టిజిఐఐసి చైర్‌పర్సన్ నిర్మలతో కలిసి స్థానిక చెరువులను పరిశీలించడానికి స్కూటీ రైడ్‌కు బయలుదేరారు. అధికారిక వాహనాలు, కాన్వాయ్‌లను పక్కనపెట్టి, తన భార్యతో ఒకే ద్విచక్ర వాహనంపై ప్రయాణించడం ద్వారా, ఆయన సంగారెడ్డి ప్రజల మనసును గెలుచుకున్నారు. సంగారెడ్డి పట్టణంలోని చెరువుల సుందరరీకరణ పనులు పరిశీలనలో భాగంగా టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆయన సతీమణి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఒకే స్కూటీపై వెళ్లారు. కంది కిసాన్ చెరువుతోపాటు, చిమ్నాపూర్ చెరువు, దేవుని చెరువులను పరిశీలించారు. కంది నుంచి సంగారెడ్డి వరకు ఐబీ వరకు భర్త జగ్గారెడ్డి స్కూటీ నడిపిస్తుంటే వెనకాల కూర్చున్న నిర్మల నవ్వుతూ ముచ్చట్లు పెట్టారు. ఆ స్కూటీ వెనకాలే పార్టీ నాయకులు, అధికారులు ముందుకు సాగారు. పట్టణ ప్రజలు ఆకస్మిక ప్రయాణాన్ని ఆసక్తిగా తిలకించారు. 40 ఏళ్ల తర్వాత ఇలా ఒకే బండిపై కలిసి ప్రయాణించడం ఎంతో మధురానుభూతిని మిగిల్చిందంటూ జగ్గారెడ్డి దంపతులు మురిసిపోయారు.

ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన ధర్నాను విజయవంతం చేయండి

 


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): అక్టోబర్ నెల 11 న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఎస్సిఎస్ టేట్ జాక్ ఆధ్వర్యంలో అడుక్యేసి రద్దు కొరకు నిర్వహించె ధర్నాను విజయవంతం చేయాలనీ జహీరాబాద్ లో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయులతో సన్నాహక సమావేశం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జహీరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పెద్దాపురం దుర్గయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల కొరకు ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. అలాగే జహీరాబాద్ నుండి పెద్దఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు కదిలి మహా ధర్నాను విజయవంతం చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పవార్ హీరాలల్ మాట్లాడుతూ అందరి సహకారంతో అడుక్యేసి ని రద్దు చేసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చవాన్ సుభాన్ సింగ్ మాట్లాడుతూ గత పడేండ్ల నుండి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల కొరకు పోరాటం చేస్తున్న మన్నారు. అడుక్యేసి వల్ల పదోన్నతులో తీవ్ర మైన అన్యాయం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుర్రి చంద్రశేఖర్, నిమ్మల కిష్టయ్య, రాష్ట్ర కార్యదర్శి అమృత్, పిఆర్టియు సీనియర్ నాయకులు వరాలు, టిబిఈఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసిరామ్ రాథోడ్, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్, టి బి ఈ ఎస్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జున్ చౌహన్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి వసంత్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్, జహీరాబాద్ మండల అధ్యక్షులు దేవిసింగ్, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి యేసయ్య,ఝరాసంగం మండల అధ్యక్షులు పాండు, భాగయ్య, ఆనంద్, తుకారాం, స్వామిదాస్, శివకుమార్ శివశేఖర్, వెంకటేశ్వర్లు, దల్సింగ్, హీరాలల్, జైసింగ్, సంగయ్య, ఇమ్మానుయేల్, రాజేంద్ర ప్రసాద్, హీరాలల్ చౌహన్ దయాకర్, విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పిజిహెచ్ఎం నగేష్ ను సన్మానం చేయడం జరిగింది.

Tuesday, September 16, 2025

దళిత జర్నలిస్టుల హక్కుల కోసం గళమెత్తనున్న మహాసభ

 

-ఘనంగా సంగారెడ్డిలో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ

-సమాజానికి సేవ చేస్తున్న దళిత జర్నలిస్టులకు గౌరవం, భద్రత, ఆర్థిక మద్దతు కల్పించాలని డిమాండ్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (SNM NEWS):

దళిత జర్నలిస్టుల హక్కులను సాధించేందుకు, వారి సంక్షేమానికి సంబంధించిన కీలక సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్రస్థాయి మహాసభను సెప్టెంబర్ 19న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులు భారీగా హాజరై, సమాజంలో సమానత్వాన్ని సాధించేందుకు, వారి అభివృద్ధికి చర్యలు తీసుకునేలా చర్చించనున్నట్లు ఫోరం నాయకులు తెలిపారు. దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు సమగ్రంగా ప్రభుత్వానికి వినతివత్రాన్ని సమర్పించనున్నారు. జర్నలిస్టుల భద్రత, ఆర్థిక సహాయం, అవకాశాల కల్పన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్తూ, సమాజానికి ఆదర్శంగా నిలిచేలా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రతి దళిత జర్నలిస్టుకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలనీ, అభయహస్తంగా రూ.12 లక్షల ఆర్ధిక సహాయం అందించాలనీ, ప్రతి జిల్లాకు అక్రిడేషన్ కమిటీలో స్థానం కల్పించి వారి భాగస్వామ్యాన్ని పెంచాలనీ, పత్రికలను నిర్వహిస్తున్న దళిత జర్నలిస్టులకు ప్రభుత్వ ప్రకటనల ద్వారా ఆదరణ ఇవ్వాలనీ, ప్రతి దళిత జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ, సీనియర్ జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులను కేటాయించాలనీ, అకస్మాత్తుగా మరణించిన జర్నలిస్టులకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలనీ, జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాలనీ, నిరుద్యోగంగా ఉన్న జర్నలిస్టులకు నెలకు రూ. 5,000 నిరుద్యోగ భృతి అందించాలనీ ఫోరం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్లతో సమాజంలోని వెనుకబడిన వర్గాలకు న్యాయమైన అవకాశాలు కల్పించి, వారి వృత్తిని గౌరవంగా కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. సమాజానికి సమాచారం అందించే ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న దళిత జర్నలిస్టులు తగిన భద్రత, ఆర్థిక మద్దతు, వృత్తి అవకాశాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఈ మహాసభను వేదికగా తీసుకుని, రాష్ట్రస్థాయిలో సమన్వయంగా పనిచేయాలని నిర్ణయించారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల దళిత జర్నలిస్టులు హాజరై, సమానత్వం, న్యాయం కోసం తమ గళాన్ని వినిపిస్తారని సంగారెడ్డి జిల్లా కమిటీ తెలిపింది.  ఈనెల 19న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ను జెడ్పి సమావేశం మందిరంలో టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 19న రవీంద్రభారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ ను సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జర్నలిస్టులు సమాజానికి సమాచారాన్ని అందించే గొప్ప పాత్రను పోషిస్తున్నారు. వారి హక్కులు, సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఈ మహాసభ ద్వారా వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారికి ఆర్ధిక సహాయం, భద్రత, గౌరవాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని తెలిపారు. ఈ మహాసభ దళిత జర్నలిస్టుల హక్కుల కోసం గళం విప్పే చారిత్రక సందర్భంగా నిలుస్తుందని, వారి సంక్షేమానికి దారి చూపే చర్యలకు పునాది వేస్తుందని నాయకులు నమ్ముతున్నారు. 

సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు రాపాక విజయరాజు మాట్లాడుతూ సమాజానికి సేవలందిస్తున్న దళిత జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. వారికి తగిన అక్రిడేషన్ సౌకర్యాలు, ఆర్థిక సహాయం, భద్రత కల్పిస్తేనే వారి వృత్తి స్థిరంగా కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాలి. జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు మేము రాష్ట్రవ్యాప్తంగా సంఘటితంగా పోరాడతాం అని అన్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ చేతుల మీదుగా చలో హైదరాబాద్ దళిత జర్నలిస్టుల ఫోరం మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ దళిత జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు తలారి యాదగిరి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల జీవితం సవాళ్లతో నిండినది. సరైన ఆదరణ లేకపోవడం, భద్రత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వారి వృత్తిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఇందిరమ్మ ఇండ్లు, ఎక్స్రేషియా, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయాలి. జర్నలిస్టులపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలి. సమాజానికి నిజాన్ని అందించే జర్నలిస్టులను ప్రభుత్వం ఆదరించాల్సిన సమయం ఇది అని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాల వారీగా సమాచారం ఇప్పటికే అందించగా, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు సమాచారం అందించే పాత్రలో ఉన్న జర్నలిస్టులు తగిన అవకాశాలు, సౌకర్యాలు, ఆర్ధిక భద్రత పొందాలని, అందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. ఈ మహాసభను విజయవంతంగా నిర్వహించి, దళిత జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చర్చలు జరుపు జరుపుతామని, సమాజానికి సమానత్వాన్ని అందించే దిశగా ముందడుగు వేస్తామని ఫోరం నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పాల్గొని, సమాజానికి న్యాయం సాధించేందుకు కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, సీనియర్ జర్నలిస్టులు దేవదాస్, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Monday, September 15, 2025

సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్మిక విభాగ అధ్యక్షునిగా సుదర్శన్ గౌడ్


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 14 (SNM NEWS): 

సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం కార్మిక విభాగ అధ్యక్షునిగా సుదర్శన్ గౌడ్ ను జాతీయ బీ సీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య నియమించినారు. అందుకు సుదర్శన్ గౌడ్  మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులుగా నియమించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నాకు ఈ పదవి రావడానికి కృషి చేసిన రాష్ట్ర కార్య నిర్వాహక అధ్యక్షులు శ్రీ ప్రభు గౌడ్ కి, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్ పాటిల్కి, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నేను ఈ పదవి కి పూర్తి న్యాయం చేస్తానని సంఘ క్షేమం కోసం శ్రేయస్సు కోసం నా పూర్తి  కాలం కేటాయించగలనని తెలిపారు.

Tuesday, September 09, 2025

సంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఫోటో ఎక్స్పో గోడ పత్రిక ఆవిష్కరణ


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 9 (సిరి న్యూస్): ఈ నెలలో నిర్వహించబోయే ఫోటో ఎక్స్పో ఆవిష్కరణ ను 19, 20, 21 టి జి ఐ ఐ సి చైర్మన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి  పై గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది.. ఇట్టి కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ, మండల అధ్యక్షులు సతీష్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్, కార్యదర్శి శ్రీకాంత్, కోశాధికారి పుట్టి బాలరాజు, కుటుంబ భరోసా జిల్లా ఇన్చార్జ్ సాయి, పట్టణ కోశాధికారి మురళి, సీనియర్ ఫోటోగ్రాఫర్లు అప్ప ప్రభాకర్, గోపాల్, సురేష్, యాదగిరి, లక్ష్మణ్, రవికాంత్, మరియు కొండాపూర్ మండలం ఆధ్వర్యంలో అధ్యక్షులు కర్ణం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. అలాగే జిల్లాలోని నాలుగు డివిజన్లో మరియు పట్టణాలు మండలాలలో ఘనంగా గోడ పత్రిక ఆవిష్కరణను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు సుప్పాల శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది. జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు పెద్ద ఎత్తున ఫోటోగ్రాఫర్ల పండుగ కు విచ్చేసి మన వృత్తిలో వచ్చే కొత్త కొత్త మార్పు చేర్పులను, ఎక్స్పోకు వచ్చి, తిలకించి, తమ యొక్క నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని తెలియజేయడం జరిగింది.

Monday, September 08, 2025

జెడ్పీటీసీ, ఎంపీటీసీ తుది ఓటరు జాబితా 10న విడుదల

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (SNM NEWS ): జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు జడ్పీ సీఈఓ జానకి రెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డి.ఆర్.ఓ పద్మజ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జడ్పీ సీఈఓ జానకి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10 వ తుది జాబితా వెలువరిస్తామని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో కూడా పార్టీ ప్రతినిధులను సూచించినట్లు పేర్కొన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు  కాంగ్రెస్ పార్టీ. పాషా. బి ఆర్ ఎస్. తారా సింగ్ . బిజెపి. మాణిక్ రావు . సిపిఎం. అడివయ్యా . సిపిఐ. కృష్ణ. ఎంఐఎం. యాకూబ్  అలీ . టిడిపి. బదయ్య. బీఎస్పీ. డేవిడ్ ,సంబంధిత  అధికారులు పాల్గొన్నారు.

ప్రతి తండాకు రోడ్డు కల్పన లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (SNM NEWS ): జిల్లాలో రహదారుల సౌకర్యం లేని గిరిజన తండాలలో రహదారులకు అనుసంధానమైయేలా ఎస్టీ-ఎస్ డి ఎఫ్ నిధులతో చేపట్టబోయే రహదారి నిర్మాణాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్  పి  ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలోని మినీసమావేశ మందిరంలో గిరిజనశాఖ ,పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ కల్లెక్టర్, పి.ప్రావీణ్య, అదనపు కల్లెక్టర్ ( స్థానిక సంస్థలు ) చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి లు సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భముగా  కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు కనెక్టివిటీ లేని గిరిజన తండాలను గుర్తించి, వాహనాలు కూడా నడవలేని రోడ్లకు,  ముఖ్యంగా పీడబ్ల్యుడి రోడ్ల నిర్మాణానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం ఎస్టీ-ఎస్ డి ఎఫ్ నిధులను వినియోగించాలి. సంబంధిత, గిరిజనశాఖ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే సమగ్ర నివేదికలు సిద్ధం చేసి సమర్పించాలి. టెండర్ ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి, పనులు ప్రారంభించాలి అని ఆదేశించారు. ప్రతి తండాకు అవసరమైన రహదారి పొడవు, అంచనా వ్యయం,సాంకేతిక సమస్యలపై వివరమైన నివేదికలను రెండు వారాల్లోగా సమర్పించాలని ఆదేశించారు. తక్షణం అమలు చర్యలు ప్రారంభించాలని సూచించారు. వర్షాకాలంలో రహదారులు సరిగా లేకపోవడం వలన గిరిజన కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్య సేవలు, విద్య, అత్యవసర సేవలు  సమయానికి అందకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఎస్టీ-ఎస్ డి ఎఫ్ నిధులు వినియోగించి తక్షణమే రహదారుల ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ టి జి ఈ డెబ్ల్యు ఐ డి సి ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను కూడా సమీక్షించారు. అంగన్వాడి కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, కళాశాలలు, పాఠశాలల్లో టాయిలెట్స్, నిర్మాణం వంటి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పాఠశాలలో టాయిలెట్స్ నిర్మాణం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో గిరిజన శాఖ ఇంజనీరింగ్, ఆర్  అండ్ బి ఇంజనీరింగ్ అధికారులు, పంచాయతీ రాజ్, విద్యాశాఖ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.


ఈ నెల 13 వ తేదీన జాతీయ లోక్ అదాలత్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (SNM NEWS): జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, సుప్రీంకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ నెల 13 వ తేదీన (శనివారం) జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గాన కేసులను పరిష్కరించుకొని సత్వర న్యాయం- సమన్యాయం పొందగలరు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టులలో అనగా సంగారెడ్డి ,జహీరాబాద్, జోగిపేట్, నారాయణఖేడ్లలో ఈ జాతీయ లోక అదాలత్ నిర్వహిస్తున్నామని, దీనిని అందరూ ప్రజలు, కక్షిదారులు ఉపయోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్.జి.భవాని చంద్ర కోరనైనది.




Sunday, September 07, 2025

రూ.1 లక్ష రూపాయలు పలికిన మహంకాళి లడ్డూ

సంగారెడ్డి పట్టణంలోని శ్రీనగర్ పాత బస్టాండ్ మహంకాళ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమర్జనం సందర్భంగా లడ్డూ వేలం పాట హోరా హోరీగా సాగింది. భారీ ధర పలికి రూ.1 లక్ష రూపాయలకు వినాయకుని లడ్డూను హెల్పింగ్ యాండ్స్ అసోసియేషన్ సభ్యులు అఖిల్ సొంతం చేశారు. మహంకాళ్ యూత్ , శివ పంతులు అఖిల్ ను సన్మానించారు. యువత సభ్యులు సూరజ్, చిన్న, శ్రీను, శ్యామ్, శ్రీకాంత్, లక్కీ,  నాగరాజ్, సాయి, రాజ్,  వంశీ, విజయ్,  రోహిత్ ఉన్నారు

జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసిన 11వ రోజు గణనాథుని శోభాయాత్ర, నిమ్మజ్జనం

సంగారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 7 (SNM NEWS): తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణపతి ఉత్సవాలు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎంతో సంతోషంగా, ఆనందోత్సాహాల నడుమ కుల మతాలకు అతీతంగా జరిగాయని, 11 రోజులపాటు పూర్తి నిబద్ధతో విధులు నిర్వర్తించి, ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసినందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి అభినందనలు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలియజేసారు. అదేవిధంగా ప్రశాంతంగా గణపతి ఉత్సవాలను పూర్తి చేయడానికి సహకరించిన జిల్లా యువత, గణపతి మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులకు, ఎస్పీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Friday, September 05, 2025

ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచండి -టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి


సంగారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 5 (SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ నూతన భవనాలు, హాస్టల్ బిల్డింగ్స్, క్రిటికల్ కేర్ యూనిట్స్ ప్రారంభోత్సవం సందర్బంగా క్రిటికల్ కేర్ యూనిట్ ని పరిశీలించి, సూపరింటెండెంట్, డాక్టర్స్ తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రిని పది రోజులకోసారి ప్రైవేట్ గా పరిశీలించాలని జగ్గారెడ్డికి  మంత్రి దామోదర్ సూచించారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సదుపాయాలు, ఇంకా అవసరాలు, లోపాలు ఈ అన్ని అంశాల గురించి రిపోర్ట్ సూచనలు ఇవ్వాలన్నారు. 40 ఏళ్ల క్రితం బల్బీర్ సింగ్ యాదవ్ అని సూపరింటెండెంట్ ఎంతో నిబద్దతతో పని చేసే వారని గుర్తు చేశారు. ఆయన ప్రతి రోజూ హాస్పటల్ కి రాగానే ముందుగా టాయిలెట్స్ ని పరిశీలించే వారని చెప్పారు. ఆ తర్వాతే రోగులను పరీక్షించేందుకు వెళ్లేవారని వివరించారు. ఆసుపత్రిలో టాయిలెట్స్ శుభ్రంగా ఉండడంవల్ల రోగులు వారి సహాయకులకు చరిత్ర ఇన్ఫెక్షన్స్ సోకకుండా జాగ్రత్తలు తీసుకునే వారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపీ అయిపోయేదాకా, వార్డుల్లోనే తిరిగేవారన్నారు. ఆ తర్వాతే తన ఆఫీసుకి వెళ్లేవారని తెలిపారు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటిస్తే రోగులకు ప్రయోజనం దక్కుతుందని సూపరింటెండెంట్ తో పాటు డాక్టర్లకు జగ్గారెడ్డి సూచించారు. గతంలో సూపరింటెండెంట్ గా పని చేసిన అనిల్ కుమార్ అలాగే చేసే వారిని ఈ సందర్భంగా డాక్టర్లు జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బల్బీర్ సింగ్ సుపరిండెంట్ గా ఉన్న సమయం లో  ఎన్నో క్రిటికల్ కేసుల ను హైదరాబాద్ పంపకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేసేవాడని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. గతం లో   ఒక వ్యక్తి పై జరిగిన మర్డర్ అటెంప్ట్  లో సదరు వ్యక్తి పేగులు మొత్తం బయటికి వచ్చిన సందర్భం లో నా ప్రోద్భలం తో  డాక్టర్ బల్బిర్ సింగ్  నేతృత్వంలో ఆపరేషన్ చేసి తనను బతికించిన విషయాన్ని డాక్టర్ల తో జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఏదైనా క్రిటికల్ కేసులు ఉన్నప్పుడు  సదరు పేషంట్ల బంధువులు గొడవ చేస్తారని  డాక్టర్లు చికిత్స చేయడానికి భయపడేవారని, ఆ సమయంలో  తనకు సంబంధించిన వ్యక్తులను డాక్టర్ల కు రక్షణ గా ఉంచేవాడినని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు జగ్గారెడ్డి ప్రభుత్వాసుపత్రి నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు సలహాలు అందజేశారు.

Wednesday, September 03, 2025

గణనాథుని శోభాయాత్రకు సర్వం సిద్దం -జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో శనివారం వినాయకుల నిమర్జనాలు జరగనున్న నేపధ్యలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారు 800 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గంలో కరెంట్ వైర్ లేకుండా సంభందిత శాఖలకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని అన్నారు. పలు ప్రధాన కూడళ్లలో, మజీద్లు, దర్గాలలు, చర్చీల పై రంగులు (గులాల్) పడకుండా ఎతైన బారికెట్స్ తో పాలితిన్ కవర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శోభాయాత్రను వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.  నిమర్జనం జరిగే చెరువులు, కుంటల వద్ద నీళ్ళలోనికి దిగకుండా బారికెట్స్ ఏర్పాటు చేయించడం జరిగిందని, విగ్రహాలను నిమర్జనం చేయడానికి క్రేన్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రమాదవశాత్తు అనుకోని ప్రమాదం జరిగిన తక్షణం స్పందించడానికి గజ-ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. సబ్-డివిజన్ల వారీగా డియస్పి లచే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుందని, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు తక్షణం స్పందించి, గుంపును చెదరకొట్టడానికి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టిమ్స్ సిద్దంగా ఉంటాయన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ, మండప నిర్వాహకులు పోలీసు వారితో సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు.

నియోజకవర్గ సమస్యలను పరిష్కరించండి -చింతా ప్రభాకర్ ఎమ్మెల్యే సంగారెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): సంగారెడ్డి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలసి నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలి ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ తో కూడిన వినతి పత్రం అందజేశారు.  నియోజవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రజలు, రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. మొత్తం 20 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ఎమ్మెల్యే కి 40 శాంతం మంజూరు నిమిత్తం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ప్రకారం, ఎమ్మెల్యే ద్వారా పంపిన లబ్ధిదారుల ప్రతిపాదనలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని జిల్లా ఇంచార్జి మంత్రి సూచించిన ఎండర్స్ మెంట్ లేఖను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు అందజేశారు. వెంటనే తగు చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపినారు. మున్సిపాలిటీలలో  టియుఎఫ్ఐడిసి కింద మంజూరు అయినా పనులు వేగవంతంగా చేపట్టుటకు కోరారు. రెండు మున్సిపాలిటీల్లో మొన్న కురిసిన వర్షాలకు అధిత మొత్తంలో రోడ్లు, మురికి కాలువలు, కల్వర్టు దెబ్బతినడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న వాటిని గుర్తించి వెంటనే పనులు చెప్పుటకు అంచనాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. నీటి సమస్యలు రాకుండా చూడాలని, అత్యవసర పరిస్థితిలో నీటి సౌకర్యం ఏర్పాటు కోసం మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు. ఫసల్వాది డబుల్ బెడ్ రూమ్ హౌసింగ్ కాలనీలో అంతర్గత రోడ్ల నిర్మాణమునకు రూ. 81.50 లక్షలతో ప్రతిపాదనలు.. అంతర్గత డ్రైనేజీ వ్యవస్థని కూడా ఏర్పాటు చేయుటకుగాను రూపాయలు కోటి 36 లక్షలతో ప్రతిపాదనలు సమర్పించారు. మల్లెపల్లి నుంచి హరిదాస్ పూర్ కు చేపడుతున్న రోడ్డులో భాగంగా తెర్పోల్ గ్రామంలో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థని ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు సమర్పించారు. సదాశివపేట పట్టణంలోని ఫెయిర్ ప్రైస్ షాపులను రేషనలైజేషన్ చేయుటకు గాను ప్రతిపాదనను సమర్పించారు. ఎందుకనగా ఒక ఫెయిర్ ప్రైస్ షాపులలో 300 మంది ఉంటే ఒక ఫెయిర్ ప్రైస్ లో వెయ్యికి పైగా కార్డు హోల్డర్స్ ఉండడం వలన అధిక పనిబారంతో ప్రజలకు సత్వరమే సేవలందించుటలో జాప్యము జరుగుతున్నందున దీనిని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే ఫెయిర్ ప్రైస్ రేషనలైజేషన్ చేయుటకు గాను ప్రతిపాదించారు. జనాభ దృష్టిలో ఉంచెకొని నూతన ఫెయిర్ ప్రైస్ షాపుల ఏర్పాటుకు ప్రతిపదించారు. కంది మండలం బేగంపేట గ్రామంలో ఫిషర్మెన్ కోపరేటివ్ సొసైటీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి సర్వేనెంబర్ 249 నుండి 1000 గజాలు కేటాయించకుగాను ప్రతిపాదనలు అందజేసినారు. ఎమ్మెల్యే వెంట మాజీ సిడిసి చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆర్.వెంకటేశ్వర్లు, కార్యదర్శి నర్సింలు, అక్బర్ తదితరులు ఉన్నారు.


రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి -ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి సదాశివపేట ఏఓ రమేష్ తో ఫోన్ లో మాట్లాడి యూరియా కొరత పై ఆరా తీశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయాలని సూచించారు. యూరియా స్టాక్ అందుబాటులో ఉంచాలని  రైతులను యూరియా కోసం ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. స్టాక్ ఎంత ఉంది అని అడిగి తెలుసుకున్నారు. యూరియా కోసం రైతులను క్యూ లైన్ లో, చెప్పులు ఉంచకుండా యూరియా సరఫరా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ రత్నాకర్ రెడ్డి ఉన్నారు.


సంగారెడ్డి మున్సిపాలిటీలో సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SMN NEWS):  భవన నిర్మాణ అనుమతుల సమాచారం కోరితే అరకొర సమాచారం ఇస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, మొదటి అప్పీలు విచారణ చేయకుండా కమిషనర్ సంతకం లేకుండా సమాచారం ఇస్తున్న అధికారులు పట్టించుకోని మున్సిపల్ కమిషనర్. సంగారెడ్డి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ఎం శ్రీధర్ సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం లో తేది 19 జూలై 2025 నాడు సంగారెడ్డి బై పాస్ రోడ్డు లో సర్వే నెంబర్ 374 లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో ఇంటి నెంబర్లు లేకుండా నాఖీలి పత్రాలతో ఇంటి నెంబర్లు పొంది నిర్మాణ అనుమతి పొందిన భవన నిర్మాణ అనుమతుల పత్రాల సమాచారం కోరగా భవన నిర్మాణ అనుమతులు థర్డ్ పార్టీ సమాచారం అని ఉద్దేశ పూర్వకంగా సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఇట్టి సమాచారం పై తేది 18 ఆగష్టు  2025 నాడు మున్సిపల్ కమిషనర్ కి మొదటి అప్పీలు చేయగా అప్పీలు పై విచారణ చేయకుండా, నిర్లక్ష్యం చేస్తున్న మున్సిపల్ అధికారులు, కమిషనర్ సంతకం లేకుండా నే దరఖాస్తు దారునికి తప్పుడు అరకొర సమాచారం ఇస్తూ తప్పించుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించు కొని మున్సిపల్ కమిషనర్. ఈ సందర్బంగా దరఖాస్తు దారు ఎం శ్రీధర్ మాట్లాడుతూ సమాచారం హక్కు చట్టం అమలులో కి వచ్చి ఇరవై ఏండ్లు అవుతున్న సంగారెడ్డి మున్సిపాలిటీలో సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం చేస్తున్న అధికార్ల పని తీరు పై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమీక్షా నిర్వహించి సమాచార హక్కు చట్టం సమగ్రంగా అమలు కు చర్య లు తీసుకోని దరఖాస్తు దారులకు పూర్తి సమాచారం ఇచ్చేలా సంబందించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్త ఎం శ్రీధర్ కోరారు.

సంగారెడ్డి మహిళా జూనియర్ కళాశాలలో సరస్వతీ బాయి పూలే విగ్రహావిష్కరణ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి మా ఇల్లు - స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కీ.శే. తోపాజి ఈశ్వరయ్య, పద్మావతి జ్ఞాపకార్థం వారి పుత్రుడు, మా ఇల్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సరస్వతీబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం చాలా సంతోషంగా ఉందని విగ్రహాన్ని ప్రారంభించిన ముఖ్య అతిథి, టిజిఐసిసి చైర్మన్, నిర్మలా జయప్రకాష్ రెడ్డి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ  మాధురి మాట్లాడుతూ విద్యార్థులు ఒక ప్రణాళికా బద్ధంగా చదువుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అందుకు ఐఏఎస్ సెలెక్షన్ లో మొదటి ర్యాంకు రావడానికి కారణమైందని అన్నారు.  ఈ కార్యక్రమంలో మా ఇల్లు అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ ఇంతమంది జూనియర్ కళాశాల విద్యార్థినులకు సరస్వతీబాయి పూలే విగ్రహం ఒక స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. మా ఇల్లు సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్ వివరిస్తూ... గత 17 సంవత్సరాలుగా సంగారెడ్డి పట్టణ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజలకు దాహార్తిని తీర్చడానికి రెండు వాటర్ ట్యాంకర్ల ద్వారా 100 రోజులు మంజీరా నీటినీ ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి కూన వేణుగోపాల్ మాట్లాడుతూ తోపాజి సేవలు అభినందనీయమని అన్నారు. ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవిందరాజు, కళాశాల ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ విగ్రహాన్ని నెలకొల్పడానికి  సంగారెడ్డి మహిళా జూనియర్ కాలేజీనీ ఎంచుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళింగ కృష్ణకుమార్, తోపాజి తేజోవతి, తోపాజి హరీష్,  పట్టణ ప్రముఖులు మ్యాడమ్ రాధాకిషన్, జూలకంటి బుచ్చిలింగం, కటుకం విజయ్, కొంపల్లి విద్యాసాగర్, అనుముల సంతోష్, నామా భాస్కర్, ఇరుకుళ్ళ ప్రదీప్ కుమార్, ఆమేటి మహేందర్, మిరియాల పాండురంగం, రాచర్ల ప్రసాద్, చంద్రిక కరుణాకర్, సుధాకర్, గంగేరి శ్రీహరి, చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రకరణ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయ నూతన భవన సముదాయ ప్రారంభోత్సవం

 


సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): ఇంద్రకరణ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో లామ్ టఫ్ కంపెనీ వారి సౌజన్యంతో నిర్మించబడిన నూతన కంప్యూటర్ ల్యాబ్ మరియు లైబ్రరీ భవన సముదాయం బుధవారం లామ్ టఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ కుమార్ మెహతా, కమలేష్ మెహతా ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా భవన సముదాయాలను రిబ్బన్ కటింగ్ ద్వారా ప్రారంభోత్సవం చేయగా గుర్తుగా అతిధులందరూ మొక్కలు నాటారు. తర్వాత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు చక్కని నృత్యరూపకంతో అతిధులందరికీ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రధాన అంశము కాబోతుంది కావున విద్యార్థులందరూ సాంకేతిక విద్యలో కూడా ముందంజలో ఉండేందుకు కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లైబ్రరీని భవనంతో సహా నిర్మించి ఇచ్చిన లామ్ టఫ్ కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో ఇదే విధంగా అందరూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో తమ వంతు కృషిని అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో లామ్ టఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర కుమార్ మెహతా, కమలేష్ మెహతా చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూస్, స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. విద్యార్థులు అన్ని వసతులను వినియోగించుకొని భవిష్యత్తులో మంచి విజయాలను అందుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ లామ్ టఫ్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులు ఈ సౌకర్యాలను వినియోగించుకొని పాఠశాలకు చక్కని పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి అభివృద్ధి బాటలో నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంద్రకరణ్ ప్రధానోపాధ్యాయులు ఠాకూర్ ఉదయ్ సింగ్ అధ్యక్ష వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథులుగా జిల్లా పారిశ్రామిక కేంద్ర మేనేజింగ్ డైరెక్టర్, కంది మండలం స్పెషల్ ఆఫీసర్ తుల్జా నాయక్ విచ్చేశారు. అతిథులుగా లామ్ టఫ్ జనరల్ మేనేజర్ పి వి ఆర్ శాస్త్రి, కంది మండల  విద్యాశాఖ అధికారి జోగప్ప, డిసిఇబి ఇంచార్జి ఎల్ లింభాజీ, కంది మండల ఎంపీడీవో శ్రీనివాస్, జిల్లా సైన్స్ ఆఫీసర్ సిద్ధారెడ్డి, ఇంద్రకరణ్ గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ భారతమ్మ విచ్చేశారు.


రెండవ విడత సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల


జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబా

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 2 (సిరి న్యూస్):

సంగారెడ్డి జిల్లాలో జరగబోయే గ్రామ పంచాయతీల రెండవ విడత సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తుది ప్రచురణ విడుదల చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి  సాయి బాబా గారు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వివరాలు తెలియజేస్తూ జిల్లాలో మొత్తం మండలాలు  25, గ్రామ పంచాయతీలు  613, మొత్తం వార్డులు  5370, మొత్తం పోలింగ్ స్టేషన్లు  5370, మొత్తం ఓటర్లు  7,44,157, పురుషులు  3,68,270, మహిళలు  3,75,843, ఇతరులు 44,జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రదర్శిస్తారని ఆయన తెలిపారు.

Tuesday, September 02, 2025

రూ.500 కోట్లతో సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య

 మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు త్వరలో ముఖ్యమంత్రితో శంకుస్థాపన
- టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 2 (సిరి న్యూస్): సంగారెడ్డి మహబూబ్ సాగర్ చెరువు సుందరి కరణ పనులను 500 కోట్లతో చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య తెలిపారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టర్  ఛాంబర్ లో టిజిఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, లతో కలిసి మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులపై హెచ్ఎండిఏ, మున్సిపల్ నీటిపారుదల శాఖ, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ సాగర్ చెరువులో చేపట్టబోయే సుందరీకరణ పనులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హెచ్ఎండిఏ అధికారులు ప్రదర్శించారు. రూ . 500 కోట్లతో మెహబూబ్ సాగర్ చెరువును అభివృద్ధి చేసేందుకు ప్రాజెక్టును రూపకల్పన చేసినట్లు కలెక్టర్కు హెచ్ఎండి అధికారులు వివరించారు. సుందరీకరణలో భాగంగా మహబూబ్ సాగర్ చెరువు మధ్యలో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ నేరుగా మహబూబ్ సాగర్ చెరువులోకి కలవకుండా రానున్న 25 సంవత్సరాలకు సరిపోయేలా 23.5 ఎం ఎల్ డి ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేలా డిజైన్ సిద్ధం చేసినట్లు కలెక్టర్కు హెచ్ఎండి అధికారులు వివరించారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సామర్ధ్యాన్ని పెంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచించారు .మహబూబ్ సాగర్ చెరువు నీటి నాణ్యతను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. మహబూబ్ సాగర్ చెరువును టూరిజం, రిక్రియేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నారు. హైవే నుండి ఐఐటి పక్కనుండి మహబూబ్ సాగర్ చెరువు వరకు 100 ఫీట్ల లింక్ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్కు నిర్మలా జగ్గారెడ్డి వివరించారు. ప్రాజెక్టు రెండో దశలో 265 కోట్లతో డిసిల్టింగ్ చేసేలా ప్రణాళిక ఉందని హెచ్ఎండి అధికారులు తెలిపారు. చెరువు మధ్యలో ఉన్న సోమేశ్వరాలయం ను అభివృద్ధి చేయనున్నట్లు మెహబూబ్ సాగర్ కట్ట వెడల్పు సైక్లింగ్ ట్రాక్ రెండు లైన్ల బిటి రోడ్డు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. చెరువు మధ్యలో రూ.20 కోట్లతో భారీ శివుడి విగ్రహం ఏర్పాటు కట్ట నుండి విగ్రహం వరకు కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేయనున్నట్లు చెరువు మధ్యలో వాచ్ టవర్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబ్ సాగర్ చెరువు సమీపంలో ఉన్న సంగమేశ్వర ఆలయం ను రూ.9 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సుందరీకరణలో భాగంగా రెండో దశ పనులలో చెరువులో ఐలాండ్ లు, వాటర్ థీమ్ పార్క్, బోటింగ్ డెక్ ల ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. రూ.9 కోట్ల తో బతుకమ్మ ఘాట్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఏర్పాటుకు ప్రాజెక్టులు రూపకల్పన చేసినట్టు అధికారులు వివరించారు. వికలాంగులు వయోవృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.
 

త్వరలో ముఖ్యమంత్రితో మహబూబ్ సాగర్ సుందరీకరణ పనులకు శంకుస్థాపన
-నిర్మల జగ్గారెడ్డి, టీ జి ఐ సి చైర్మన్

మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.
మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.
మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.
మహబూబ్ సాగర్ చెరువు సుందరీకరణ పనులకు రూ .500 కోట్లతో చేపట్టబోయే త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి తెలిపారు.  ఈ సందర్భంగా  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి  మాట్లాడుతూ --- మహబూబ్ సాగర్ చెరువు అభివృద్ధి కోసం లాండ్ ఆక్విజేషన్ కోసం రైతుల నుండి భూమిని తీసుకునే సమయంలో ప్రైవేట్ మార్కెట్ రేట్ ను పరిగణలోకి తీసుకొని ప్రతి పనులు సిద్ధం చేయాలని సంగారెడ్డి ఆర్డీవోకు సూచించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సాగర్ చెరువును  టిజిఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టి పి సి సి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లు మహబూబ్ సాగర్ చెరువును సందర్శించారు.

ఈ సందర్భంగా కట్టపై తిరుగుతూ కలెక్టర్ కు గతంలో తాను చేసిన అభివృద్ధి పనులను జగ్గారెడ్డి వివరించారు గతంలో నిధులు లేకుంటే తన సొంత నిధులు 50 లక్షల రూపాయలతో మున్సిపల్ డ్రైనేజీ వాటర్ కలవకుండా సోమేశ్వర ఆలయం చేరుకునేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు కలెక్టర్కు జగ్గారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో  సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Monday, September 01, 2025

కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసనలతో పెన్షన్ విద్రోహ దినం

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 1 (SNM NEWS):పెన్షన్ విద్రోహ దినం సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సందర్భంగా సంగారెడ్డిలో భారీ స్థాయిలో ఉద్యోగుల నిరసన కార్యక్రమం జరిగింది. ఉద్యోగుల న్యాయమైన హక్కు అయిన పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జెఎసి నాయకులు గళమెత్తారు. 2004 తర్వాత చేరిన ఉద్యోగులను అన్యాయంగా కొత్త పెన్షన్ పద్ధతిలోకి నెట్టివేసి భవిష్యత్తును అస్థిరతలోకి నెట్టడం అన్యాయం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ వృద్ధాప్యంలో భద్రత లేకుండా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీనికి వ్యతిరేకంగానే పెన్షన్ విద్రోహ దినాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని టి జి ఈ జె ఎ సి చైర్మన్ మహమ్మద్ జావీద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం మొదలు పెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో వివిధ విభాగాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ దారులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...