సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 20 (SNM NEWS): రాష్ట్ర వ్యాప్తంగా నుండి వచ్చిన దళిత జర్నలిస్టులను కలుసుకోవడం ఆనందంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో శుక్రవారం జరిగిన దళిత జర్నలిస్టుల ఫోరమ్ రాష్ట్ర మహాసభలో ముఖ్య అతిథిగా కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత సోదరుల హక్కులు దక్కించుకోవడమే ప్రధాన లక్ష్యం అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో దళితుల సమస్యలపై ఇప్పటికే చర్చ జరిగినట్లు గుర్తు చేశారు. బడ్జెట్‌లో 18 శాతం నిధులు కేటాయిస్తే దళితుల సమస్యల పరిష్కారం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. గత టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ, దళితుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీ సమస్యలను నేను స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా అని మంత్రి భరోసా ఇచ్చారు. దళితుల అభ్యున్నతికి తన తండ్రి కాకా వెంకటస్వామి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, నేను కూడా అదే మార్గంలో నడుస్తూ దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా అని స్పష్టం చేశారు. రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు దళితుల భూమి సమస్యపై అన్యాయం జరగకూడదని అప్పుడు కూడా తన కుటుంబం అభిప్రాయం వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. దళితుల కోసం నేను ఎల్లప్పుడూ మీతో ఉంటా, మీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా అని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర దళిత జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు కాశపాగు జాన్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్, దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు రాపాక విజయరాజు, వివిధ జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు దళిత జర్నలిస్టులు పాల్గొన్నారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Saturday, September 20, 2025
దళిత జర్నలిస్టుల అభివృద్ధికి కట్టుబడి ఉంటా -మంత్రి వివేక్ వెంకటస్వామి
Subscribe to:
Post Comments (Atom)
అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం
సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...
-
సంగారెడ్డి అక్టోబర్ 22 (ఎస్ఎన్ఎం న్యూస్): సంగారెడ్డి నుంచి తిరుపతి కాణిపాకం అరుణాచలం మీదుగా శబరిమల వరకు మహా పాదయాత్ర వెళ్లిన సాహితీ రాము...

No comments:
Post a Comment