సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS):నిబంధనలకు విరుద్ధంగా ముందస్తు గర్బ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షతన బుధవారం తన ఛాంబర్ పిసిపి ఎన్ డి టి ఆక్ట్ అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పూర్తిగా నిషేధితమన్నారు. ఇందుకోసం ప్రభుత్వం పిసిపి ఎన్డిటి యాక్ట్ ను అమల్లోకి తీసుకువచ్చింది అన్నారు. పి సి పి ఎన్ డి టి గోడప్రతులు ప్రతి ఆసుపత్రిలో ప్రదర్శించాలని అన్నారు. ఎక్కడైనా ముందస్తు గర్భస్థ శిశు నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆ సంస్థలపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అల్ట్రా సౌండ్ స్కానింగ్ కేంద్రాల నమోదు స్థితిపై ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సమీక్ష జరిపారు. ఫార్మ్ అఫ్ రికార్డుల నిర్వహణ సమర్పణ సక్రమంగా నింపడంపై పరిశీలించారు. అక్రమంగా నడుస్తున్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాలపై సర్వైవల్ ఇన్స్పెక్షన్ చేపట్టి అవసరమైతే యంత్రాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కోర్టు పెండింగ్ లో ఉన్న కేసులు ఇప్పటికే శిక్ష పడిన కేసుల స్థితిపై అదనపు కలెక్టర్ సమీక్ష జరిపారు. జిల్లాలో బాలికల జనాలను నిష్పత్తి గణాంకాలపై సమీక్షించారు. ముందస్తు గర్భ నిర్ధారణ పరీక్షల నిషేధంపై ప్రజలక అవగాహన కల్పించాలన్నారు. ముందస్తు గర్భ శిశువులింగ నిర్ధారణ పరీక్షలు నేరమని ఆరోగ్యశాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు పరస్పరం సమన్వయం చేస్తూ పిసిపిఎన్డిటి చట్టం అమలులో కఠినంగా వ్యవహరించాలన్నారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పి సి పి ఎన్ డి టి చట్టం ఉల్లంఘన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశాలు నిరంతరంగా నిర్వహించేల చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రతినెల తనిఖీలు నిర్వహించడం తనిఖీల సంఖ్యను పెంచడం అన్ని అల్ట్రాసౌండ్ స్కానింగ్ కేంద్రాల రికార్డులు పరిశీలించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు ప్రజల్లో ఈ చట్టం పై అవగాహన కోసం గోడపత్రికలు ఏర్పాటు చేయడం మీడియా ద్వారా పాఠశాలలో కళాశాలలో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల, ఎన్ జి ఓ ప్రతినిధులు, పోలీస్ అధికారులు ఆరోగ్యశాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment