Friday, September 05, 2025

ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచండి -టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి


సంగారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్ 5 (SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ నూతన భవనాలు, హాస్టల్ బిల్డింగ్స్, క్రిటికల్ కేర్ యూనిట్స్ ప్రారంభోత్సవం సందర్బంగా క్రిటికల్ కేర్ యూనిట్ ని పరిశీలించి, సూపరింటెండెంట్, డాక్టర్స్ తో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రిని పది రోజులకోసారి ప్రైవేట్ గా పరిశీలించాలని జగ్గారెడ్డికి  మంత్రి దామోదర్ సూచించారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న సదుపాయాలు, ఇంకా అవసరాలు, లోపాలు ఈ అన్ని అంశాల గురించి రిపోర్ట్ సూచనలు ఇవ్వాలన్నారు. 40 ఏళ్ల క్రితం బల్బీర్ సింగ్ యాదవ్ అని సూపరింటెండెంట్ ఎంతో నిబద్దతతో పని చేసే వారని గుర్తు చేశారు. ఆయన ప్రతి రోజూ హాస్పటల్ కి రాగానే ముందుగా టాయిలెట్స్ ని పరిశీలించే వారని చెప్పారు. ఆ తర్వాతే రోగులను పరీక్షించేందుకు వెళ్లేవారని వివరించారు. ఆసుపత్రిలో టాయిలెట్స్ శుభ్రంగా ఉండడంవల్ల రోగులు వారి సహాయకులకు చరిత్ర ఇన్ఫెక్షన్స్ సోకకుండా జాగ్రత్తలు తీసుకునే వారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపీ అయిపోయేదాకా, వార్డుల్లోనే తిరిగేవారన్నారు. ఆ తర్వాతే తన ఆఫీసుకి వెళ్లేవారని తెలిపారు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటిస్తే రోగులకు ప్రయోజనం దక్కుతుందని సూపరింటెండెంట్ తో పాటు డాక్టర్లకు జగ్గారెడ్డి సూచించారు. గతంలో సూపరింటెండెంట్ గా పని చేసిన అనిల్ కుమార్ అలాగే చేసే వారిని ఈ సందర్భంగా డాక్టర్లు జగ్గారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. బల్బీర్ సింగ్ సుపరిండెంట్ గా ఉన్న సమయం లో  ఎన్నో క్రిటికల్ కేసుల ను హైదరాబాద్ పంపకుండా ఇక్కడే ట్రీట్మెంట్ చేసేవాడని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. గతం లో   ఒక వ్యక్తి పై జరిగిన మర్డర్ అటెంప్ట్  లో సదరు వ్యక్తి పేగులు మొత్తం బయటికి వచ్చిన సందర్భం లో నా ప్రోద్భలం తో  డాక్టర్ బల్బిర్ సింగ్  నేతృత్వంలో ఆపరేషన్ చేసి తనను బతికించిన విషయాన్ని డాక్టర్ల తో జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఏదైనా క్రిటికల్ కేసులు ఉన్నప్పుడు  సదరు పేషంట్ల బంధువులు గొడవ చేస్తారని  డాక్టర్లు చికిత్స చేయడానికి భయపడేవారని, ఆ సమయంలో  తనకు సంబంధించిన వ్యక్తులను డాక్టర్ల కు రక్షణ గా ఉంచేవాడినని జగ్గారెడ్డి గుర్తు చేసుకున్నారు. సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ కు జగ్గారెడ్డి ప్రభుత్వాసుపత్రి నిర్వహణకు సంబంధించిన పలు సూచనలు సలహాలు అందజేశారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...