-ఘనంగా సంగారెడ్డిలో మహాసభ పోస్టర్ ఆవిష్కరణ
-సమాజానికి సేవ చేస్తున్న దళిత జర్నలిస్టులకు గౌరవం, భద్రత, ఆర్థిక మద్దతు కల్పించాలని డిమాండ్
సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 16 (SNM NEWS):
దళిత జర్నలిస్టుల హక్కులను సాధించేందుకు, వారి సంక్షేమానికి సంబంధించిన కీలక సమస్యలను ప్రభుత్వానికి చేరవేసేందుకు దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్రస్థాయి మహాసభను సెప్టెంబర్ 19న హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులు భారీగా హాజరై, సమాజంలో సమానత్వాన్ని సాధించేందుకు, వారి అభివృద్ధికి చర్యలు తీసుకునేలా చర్చించనున్నట్లు ఫోరం నాయకులు తెలిపారు. దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు సమగ్రంగా ప్రభుత్వానికి వినతివత్రాన్ని సమర్పించనున్నారు. జర్నలిస్టుల భద్రత, ఆర్థిక సహాయం, అవకాశాల కల్పన వంటి కీలక అంశాలను ముందుకు తీసుకెళ్తూ, సమాజానికి ఆదర్శంగా నిలిచేలా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రతి దళిత జర్నలిస్టుకు అక్రిడేషన్ సౌకర్యం కల్పించాలనీ, అభయహస్తంగా రూ.12 లక్షల ఆర్ధిక సహాయం అందించాలనీ, ప్రతి జిల్లాకు అక్రిడేషన్ కమిటీలో స్థానం కల్పించి వారి భాగస్వామ్యాన్ని పెంచాలనీ, పత్రికలను నిర్వహిస్తున్న దళిత జర్నలిస్టులకు ప్రభుత్వ ప్రకటనల ద్వారా ఆదరణ ఇవ్వాలనీ, ప్రతి దళిత జర్నలిస్టుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలనీ, సీనియర్ జర్నలిస్టులకు నామినేటెడ్ పదవులను కేటాయించాలనీ, అకస్మాత్తుగా మరణించిన జర్నలిస్టులకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలనీ, జర్నలిస్టులపై ఎలాంటి దాడులు జరగకుండా రక్షణ కల్పించాలనీ, నిరుద్యోగంగా ఉన్న జర్నలిస్టులకు నెలకు రూ. 5,000 నిరుద్యోగ భృతి అందించాలనీ ఫోరం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ డిమాండ్లతో సమాజంలోని వెనుకబడిన వర్గాలకు న్యాయమైన అవకాశాలు కల్పించి, వారి వృత్తిని గౌరవంగా కొనసాగించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. సమాజానికి సమాచారం అందించే ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న దళిత జర్నలిస్టులు తగిన భద్రత, ఆర్థిక మద్దతు, వృత్తి అవకాశాలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటిని పరిష్కరించేందుకు ఈ మహాసభను వేదికగా తీసుకుని, రాష్ట్రస్థాయిలో సమన్వయంగా పనిచేయాలని నిర్ణయించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల దళిత జర్నలిస్టులు హాజరై, సమానత్వం, న్యాయం కోసం తమ గళాన్ని వినిపిస్తారని సంగారెడ్డి జిల్లా కమిటీ తెలిపింది. ఈనెల 19న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ను జెడ్పి సమావేశం మందిరంలో టీజీఐసీసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 19న రవీంద్రభారతిలో దళిత జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమ పోస్టర్ ను సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు చింత ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత జర్నలిస్టులు సమాజానికి సమాచారాన్ని అందించే గొప్ప పాత్రను పోషిస్తున్నారు. వారి హక్కులు, సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు వేయాలి. ఈ మహాసభ ద్వారా వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, వారికి ఆర్ధిక సహాయం, భద్రత, గౌరవాన్ని కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అని తెలిపారు. ఈ మహాసభ దళిత జర్నలిస్టుల హక్కుల కోసం గళం విప్పే చారిత్రక సందర్భంగా నిలుస్తుందని, వారి సంక్షేమానికి దారి చూపే చర్యలకు పునాది వేస్తుందని నాయకులు నమ్ముతున్నారు.
సంగారెడ్డి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు రాపాక విజయరాజు మాట్లాడుతూ సమాజానికి సేవలందిస్తున్న దళిత జర్నలిస్టులు ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. వారికి తగిన అక్రిడేషన్ సౌకర్యాలు, ఆర్థిక సహాయం, భద్రత కల్పిస్తేనే వారి వృత్తి స్థిరంగా కొనసాగుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని, వారి సంక్షేమానికి ప్రత్యేకంగా పథకాలు రూపొందించాలి. జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు మేము రాష్ట్రవ్యాప్తంగా సంఘటితంగా పోరాడతాం అని అన్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ పరితోష్ పంకజ్ చేతుల మీదుగా చలో హైదరాబాద్ దళిత జర్నలిస్టుల ఫోరం మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. తెలంగాణ దళిత జర్నలిస్టుల ఫోరం ఉపాధ్యక్షులు తలారి యాదగిరి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల జీవితం సవాళ్లతో నిండినది. సరైన ఆదరణ లేకపోవడం, భద్రత సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు వారి వృత్తిని ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఇందిరమ్మ ఇండ్లు, ఎక్స్రేషియా, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయాలి. జర్నలిస్టులపై దాడులు జరగకుండా భద్రత కల్పించాలి. సమాజానికి నిజాన్ని అందించే జర్నలిస్టులను ప్రభుత్వం ఆదరించాల్సిన సమయం ఇది అని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాల వారీగా సమాచారం ఇప్పటికే అందించగా, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. సమాజంలోని అణగారిన వర్గాలకు సమాచారం అందించే పాత్రలో ఉన్న జర్నలిస్టులు తగిన అవకాశాలు, సౌకర్యాలు, ఆర్ధిక భద్రత పొందాలని, అందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫోరం విజ్ఞప్తి చేసింది. ఈ మహాసభను విజయవంతంగా నిర్వహించి, దళిత జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చర్చలు జరుపు జరుపుతామని, సమాజానికి సమానత్వాన్ని అందించే దిశగా ముందడుగు వేస్తామని ఫోరం నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు పాల్గొని, సమాజానికి న్యాయం సాధించేందుకు కలిసి పనిచేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తలారి యాదగిరి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాపాక విజయరాజు, సీనియర్ జర్నలిస్టులు దేవదాస్, పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.



No comments:
Post a Comment