సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 17 (SNM NEWS): అక్టోబర్ నెల 11 న హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఎస్సిఎస్ టేట్ జాక్ ఆధ్వర్యంలో అడుక్యేసి రద్దు కొరకు నిర్వహించె ధర్నాను విజయవంతం చేయాలనీ జహీరాబాద్ లో అన్ని ఉద్యోగ ఉపాధ్యాయులతో సన్నాహక సమావేశం ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జహీరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు పెద్దాపురం దుర్గయ్య మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల కొరకు ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. అలాగే జహీరాబాద్ నుండి పెద్దఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులు కదిలి మహా ధర్నాను విజయవంతం చేయాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి పవార్ హీరాలల్ మాట్లాడుతూ అందరి సహకారంతో అడుక్యేసి ని రద్దు చేసుకుంటామని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చవాన్ సుభాన్ సింగ్ మాట్లాడుతూ గత పడేండ్ల నుండి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల కొరకు పోరాటం చేస్తున్న మన్నారు. అడుక్యేసి వల్ల పదోన్నతులో తీవ్ర మైన అన్యాయం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కుర్రి చంద్రశేఖర్, నిమ్మల కిష్టయ్య, రాష్ట్ర కార్యదర్శి అమృత్, పిఆర్టియు సీనియర్ నాయకులు వరాలు, టిబిఈఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తులసిరామ్ రాథోడ్, పిఆర్టియు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్, ఎలక్ట్రిసిటీ ఉద్యోగుల ఎస్సీ ఎస్టీ సంఘం జిల్లా అధ్యక్షులు సుధాకర్, టి బి ఈ ఎస్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జున్ చౌహన్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి వసంత్ కుమార్, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీనివాస్, జహీరాబాద్ మండల అధ్యక్షులు దేవిసింగ్, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి యేసయ్య,ఝరాసంగం మండల అధ్యక్షులు పాండు, భాగయ్య, ఆనంద్, తుకారాం, స్వామిదాస్, శివకుమార్ శివశేఖర్, వెంకటేశ్వర్లు, దల్సింగ్, హీరాలల్, జైసింగ్, సంగయ్య, ఇమ్మానుయేల్, రాజేంద్ర ప్రసాద్, హీరాలల్ చౌహన్ దయాకర్, విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పిజిహెచ్ఎం నగేష్ ను సన్మానం చేయడం జరిగింది.

No comments:
Post a Comment