Monday, September 08, 2025

జెడ్పీటీసీ, ఎంపీటీసీ తుది ఓటరు జాబితా 10న విడుదల

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 8 (SNM NEWS ): జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల తుది ఓటరు జాబితాను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు జడ్పీ సీఈఓ జానకి రెడ్డి తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డి.ఆర్.ఓ పద్మజ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జడ్పీ సీఈఓ జానకి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందని అన్నారు. ముసాయిదా జాబితా, పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించారు. వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులు జరిపిన మీదట సెప్టెంబర్ 10 వ తుది జాబితా వెలువరిస్తామని సూచించారు. మండల స్థాయిలో నిర్వహించిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో కూడా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరడం జరిగిందన్నారు. మండల స్థాయిలో నిర్వహించిన సమావేశాల్లో కూడా పార్టీ ప్రతినిధులను సూచించినట్లు పేర్కొన్నారు. తుది ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు  కాంగ్రెస్ పార్టీ. పాషా. బి ఆర్ ఎస్. తారా సింగ్ . బిజెపి. మాణిక్ రావు . సిపిఎం. అడివయ్యా . సిపిఐ. కృష్ణ. ఎంఐఎం. యాకూబ్  అలీ . టిడిపి. బదయ్య. బీఎస్పీ. డేవిడ్ ,సంబంధిత  అధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...