Wednesday, September 03, 2025

సంగారెడ్డి మహిళా జూనియర్ కళాశాలలో సరస్వతీ బాయి పూలే విగ్రహావిష్కరణ

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజలకు ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి మా ఇల్లు - స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కీ.శే. తోపాజి ఈశ్వరయ్య, పద్మావతి జ్ఞాపకార్థం వారి పుత్రుడు, మా ఇల్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ మొట్ట మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సరస్వతీబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరింపజేయడం చాలా సంతోషంగా ఉందని విగ్రహాన్ని ప్రారంభించిన ముఖ్య అతిథి, టిజిఐసిసి చైర్మన్, నిర్మలా జయప్రకాష్ రెడ్డి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్, రెవెన్యూ  మాధురి మాట్లాడుతూ విద్యార్థులు ఒక ప్రణాళికా బద్ధంగా చదువుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అందుకు ఐఏఎస్ సెలెక్షన్ లో మొదటి ర్యాంకు రావడానికి కారణమైందని అన్నారు.  ఈ కార్యక్రమంలో మా ఇల్లు అధ్యక్షులు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ ఇంతమంది జూనియర్ కళాశాల విద్యార్థినులకు సరస్వతీబాయి పూలే విగ్రహం ఒక స్ఫూర్తిని నింపుతుందని అన్నారు. మా ఇల్లు సంస్థ ప్రధాన కార్యదర్శి పుల్లూరి ప్రకాష్ వివరిస్తూ... గత 17 సంవత్సరాలుగా సంగారెడ్డి పట్టణ ప్రాంతంతో పాటు జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజలకు దాహార్తిని తీర్చడానికి రెండు వాటర్ ట్యాంకర్ల ద్వారా 100 రోజులు మంజీరా నీటినీ ఉచితంగా ప్రజలకు పంపిణీ చేశామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన సంఘాల కార్యదర్శి కూన వేణుగోపాల్ మాట్లాడుతూ తోపాజి సేవలు అభినందనీయమని అన్నారు. ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవిందరాజు, కళాశాల ప్రిన్సిపల్ సునీత మాట్లాడుతూ విగ్రహాన్ని నెలకొల్పడానికి  సంగారెడ్డి మహిళా జూనియర్ కాలేజీనీ ఎంచుకోవడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కళింగ కృష్ణకుమార్, తోపాజి తేజోవతి, తోపాజి హరీష్,  పట్టణ ప్రముఖులు మ్యాడమ్ రాధాకిషన్, జూలకంటి బుచ్చిలింగం, కటుకం విజయ్, కొంపల్లి విద్యాసాగర్, అనుముల సంతోష్, నామా భాస్కర్, ఇరుకుళ్ళ ప్రదీప్ కుమార్, ఆమేటి మహేందర్, మిరియాల పాండురంగం, రాచర్ల ప్రసాద్, చంద్రిక కరుణాకర్, సుధాకర్, గంగేరి శ్రీహరి, చంద్ర శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...