సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): ఇంద్రకరణ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో లామ్ టఫ్ కంపెనీ వారి సౌజన్యంతో
నిర్మించబడిన నూతన కంప్యూటర్ ల్యాబ్ మరియు లైబ్రరీ భవన సముదాయం బుధవారం లామ్ టఫ్
మేనేజింగ్ డైరెక్టర్ సురేందర్ కుమార్ మెహతా, కమలేష్ మెహతా ఆధ్వర్యంలో అట్టహాసంగా
ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా భవన సముదాయాలను రిబ్బన్ కటింగ్
ద్వారా ప్రారంభోత్సవం చేయగా గుర్తుగా అతిధులందరూ మొక్కలు నాటారు. తర్వాత పాఠశాల
విద్యార్థిని విద్యార్థులు చక్కని నృత్యరూపకంతో అతిధులందరికీ ఆహ్వానం పలికారు. ఈ
సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాబోయే కాలంలో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రధాన అంశము కాబోతుంది కావున విద్యార్థులందరూ సాంకేతిక
విద్యలో కూడా ముందంజలో ఉండేందుకు కంప్యూటర్ విద్య ఎంతో అవసరమని తెలియజేశారు. ఈ
పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్ లైబ్రరీని
భవనంతో సహా నిర్మించి ఇచ్చిన లామ్ టఫ్ కంపెనీ యాజమాన్యానికి ధన్యవాదాలు
తెలియజేశారు. భవిష్యత్తులో ఇదే విధంగా అందరూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో తమ
వంతు కృషిని అందించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లామ్ టఫ్
కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్ర కుమార్ మెహతా, కమలేష్ మెహతా చేతుల మీదుగా
విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూస్, స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. విద్యార్థులు అన్ని వసతులను వినియోగించుకొని
భవిష్యత్తులో మంచి విజయాలను అందుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పాఠశాల
ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ లామ్ టఫ్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, విద్యార్థులు ఈ సౌకర్యాలను వినియోగించుకొని పాఠశాలకు చక్కని
పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి అభివృద్ధి బాటలో నడవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంద్రకరణ్ ప్రధానోపాధ్యాయులు ఠాకూర్ ఉదయ్ సింగ్ అధ్యక్ష
వహించగా ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.వెంకటేశ్వర్లు, విశిష్ట అతిథులుగా జిల్లా పారిశ్రామిక కేంద్ర మేనేజింగ్
డైరెక్టర్, కంది మండలం స్పెషల్ ఆఫీసర్ తుల్జా నాయక్ విచ్చేశారు. అతిథులుగా లామ్
టఫ్ జనరల్ మేనేజర్ పి వి ఆర్ శాస్త్రి, కంది మండల విద్యాశాఖ అధికారి జోగప్ప, డిసిఇబి ఇంచార్జి ఎల్ లింభాజీ, కంది మండల ఎంపీడీవో శ్రీనివాస్, జిల్లా సైన్స్ ఆఫీసర్ సిద్ధారెడ్డి, ఇంద్రకరణ్ గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ భారతమ్మ విచ్చేశారు.


No comments:
Post a Comment