సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SNM NEWS): జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో శనివారం వినాయకుల నిమర్జనాలు జరగనున్న నేపధ్యలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారు 800 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లను చేసినట్లు జిల్లా ఎస్పీ వివరించారు. గణేష్ శోభాయాత్ర వెళ్ళే మార్గంలో కరెంట్ వైర్ లేకుండా సంభందిత శాఖలకు అధికారులతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని అన్నారు. పలు ప్రధాన కూడళ్లలో, మజీద్లు, దర్గాలలు, చర్చీల పై రంగులు (గులాల్) పడకుండా ఎతైన బారికెట్స్ తో పాలితిన్ కవర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శోభాయాత్రను వీక్షించడానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నిమర్జనం జరిగే చెరువులు, కుంటల వద్ద నీళ్ళలోనికి దిగకుండా బారికెట్స్ ఏర్పాటు చేయించడం జరిగిందని, విగ్రహాలను నిమర్జనం చేయడానికి క్రేన్ లను అందుబాటులో ఉంచడం జరిగిందని, ప్రమాదవశాత్తు అనుకోని ప్రమాదం జరిగిన తక్షణం స్పందించడానికి గజ-ఈతగాళ్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. సబ్-డివిజన్ల వారీగా డియస్పి లచే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతుందని, అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు తక్షణం స్పందించి, గుంపును చెదరకొట్టడానికి స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టిమ్స్ సిద్దంగా ఉంటాయన్నారు. గణేష్ ఉత్సవ కమిటీ, మండప నిర్వాహకులు పోలీసు వారితో సహకరించవలసిందిగా ఎస్పీ సూచించారు.
ప్రాంతీయ నుంచి జాతీయ స్థాయి వరకు తాజా రాజకీయాలు, బ్రేకింగ్ న్యూస్, సమాజం, విద్య, ఉద్యోగాలు, క్రీడలు, ప్రత్యేక కథనాలను నిష్పక్షపాతంగా అందించే విశ్వసనీయ తెలుగు న్యూస్ బ్లాగ్. నిజమైన వార్తలతో ప్రజల గళంగా నిలుస్తుంది.
Wednesday, September 03, 2025
గణనాథుని శోభాయాత్రకు సర్వం సిద్దం -జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్
Subscribe to:
Post Comments (Atom)
గాంధీ విగ్రహానికి జర్నలిస్టుల సమస్యలపై వినతి..!
-ఇంటి స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి డిమాండ్ సంగారెడ్డి అక్టోబర్ 2 (SN...
-
పటాన్చెరు, ఆగస్టు 27 (SNM న్యూస్): కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సోదర–స...
-
సంగారెడ్డి, డిసెంబర్ 21 (SNM NEWS): వికారాబాద్ జిల్లా కోటిపల్లి సర్పంచ్ సంగయ్య స్వామిపై జరిగిన దాడికి సంగారెడ్డిలో ఆదివారంనాడు జంగమ అర్చక ప...
-
సంగారెడ్డి, డిసెంబర్ 18 (SNM NEWS): పటాన్చేరు ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం జీవితాంతం పోరాడిన పర్యావరణ యోధుడు దివంగత డా. అ...

No comments:
Post a Comment