Wednesday, September 03, 2025

సంగారెడ్డి మున్సిపాలిటీలో సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 3 (SMN NEWS):  భవన నిర్మాణ అనుమతుల సమాచారం కోరితే అరకొర సమాచారం ఇస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, మొదటి అప్పీలు విచారణ చేయకుండా కమిషనర్ సంతకం లేకుండా సమాచారం ఇస్తున్న అధికారులు పట్టించుకోని మున్సిపల్ కమిషనర్. సంగారెడ్డి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త ఎం శ్రీధర్ సంగారెడ్డి మున్సిపాలిటీ కార్యాలయం లో తేది 19 జూలై 2025 నాడు సంగారెడ్డి బై పాస్ రోడ్డు లో సర్వే నెంబర్ 374 లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో ఇంటి నెంబర్లు లేకుండా నాఖీలి పత్రాలతో ఇంటి నెంబర్లు పొంది నిర్మాణ అనుమతి పొందిన భవన నిర్మాణ అనుమతుల పత్రాల సమాచారం కోరగా భవన నిర్మాణ అనుమతులు థర్డ్ పార్టీ సమాచారం అని ఉద్దేశ పూర్వకంగా సమాచారం ఇవ్వకుండా తప్పించుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఇట్టి సమాచారం పై తేది 18 ఆగష్టు  2025 నాడు మున్సిపల్ కమిషనర్ కి మొదటి అప్పీలు చేయగా అప్పీలు పై విచారణ చేయకుండా, నిర్లక్ష్యం చేస్తున్న మున్సిపల్ అధికారులు, కమిషనర్ సంతకం లేకుండా నే దరఖాస్తు దారునికి తప్పుడు అరకొర సమాచారం ఇస్తూ తప్పించుకుంటున్న టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించు కొని మున్సిపల్ కమిషనర్. ఈ సందర్బంగా దరఖాస్తు దారు ఎం శ్రీధర్ మాట్లాడుతూ సమాచారం హక్కు చట్టం అమలులో కి వచ్చి ఇరవై ఏండ్లు అవుతున్న సంగారెడ్డి మున్సిపాలిటీలో సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం చేస్తున్న అధికార్ల పని తీరు పై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ సమీక్షా నిర్వహించి సమాచార హక్కు చట్టం సమగ్రంగా అమలు కు చర్య లు తీసుకోని దరఖాస్తు దారులకు పూర్తి సమాచారం ఇచ్చేలా సంబందించిన అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సామాజిక కార్యకర్త ఎం శ్రీధర్ కోరారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...