Monday, September 01, 2025

కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసనలతో పెన్షన్ విద్రోహ దినం

 

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 1 (SNM NEWS):పెన్షన్ విద్రోహ దినం సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సందర్భంగా సంగారెడ్డిలో భారీ స్థాయిలో ఉద్యోగుల నిరసన కార్యక్రమం జరిగింది. ఉద్యోగుల న్యాయమైన హక్కు అయిన పాత పెన్షన్ పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జెఎసి నాయకులు గళమెత్తారు. 2004 తర్వాత చేరిన ఉద్యోగులను అన్యాయంగా కొత్త పెన్షన్ పద్ధతిలోకి నెట్టివేసి భవిష్యత్తును అస్థిరతలోకి నెట్టడం అన్యాయం అని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులు తమ వృద్ధాప్యంలో భద్రత లేకుండా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీనికి వ్యతిరేకంగానే పెన్షన్ విద్రోహ దినాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని టి జి ఈ జె ఎ సి చైర్మన్ మహమ్మద్ జావీద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఉదయం మొదలు పెట్టిన ఈ నిరసన కార్యక్రమంలో వివిధ విభాగాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షన్ దారులు, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment

అభిమానానికి ప్రతిగా అండగా నిలిచిన జగ్గారెడ్డి చెప్పులు కుట్టే కార్మికుడికి రూ.50 వేల ఆర్థిక సహాయం

  సంగారెడ్డి, ఫిబ్రవరి 10 (SNM NEWS): సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. మానవతా విలువలకు ప్రతీకగా నిల...