Friday, February 06, 2026

12 వ వార్డులో గెలుపు ఖాయమన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత

సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 5 (SNM NEWS): సదాశివపేట పట్టణంలోని 12వ వార్డు నందు ఉదయం 10:00 నుండి తమ వార్డు ప్రజలందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిమామిడి మమత రాజు ఇంటింటా తిరుగుతూ గత కాలంలో తాము చేసినటువంటి సేవల గురించి ప్రజలకు తెలియపరుస్తూ తమ ప్రచారాన్ని కొనసాగించారు. రానున్న రోజులలో 12వ వార్డును మరింత అభివృద్ధి చేస్తానని తమ ఓటరరు మహాశయులకు విజ్ఞప్తి చేశారు. అపోజిషన్ వారు గత 20 సంవత్సరాల నుండి పదవిలో ఉన్నా కూడా  వార్డు ప్రజలను పట్టించు కోలేరని ఇప్పటికే ప్రజలు వారిపై విసుగుచెంది మా వెంటే ఉన్నారని తెలియపరిచారు. పులి మామిడి మమత మాట్లాడుతూ మీకందరికి తెలుసు మేము మన వార్డులో ఇప్పటికే ఎన్ని పనులు చేశామో గమనించండి. అప్పుడు మేము అధికారంలో లేనప్పటికి మేము ఎన్నో పనులను చేశామని, ఇప్పుడు మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నదని, అందుకోసమే నన్ను భారీ మెజారిటీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మా నాయకులు తూర్పు నిర్మల జగ్గారెడ్డి గార్ల సహాయ సహకారాలతో మన వార్డును మరింత అభివృద్ధి చేస్తానని పులి మామిడి మమత ప్రజలకు హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ గడీల రాంరెడ్డి, కంది కృష్ణ, 12వ వార్డు ఇంచార్జ్ వడ్ల బింబధర్ చారీ, మైనారిటీ సోదరులు ఎగ్బాల్, చోటు, సత్తార్, ఫయాజ్, జబ్బార్, ఇసుబ్, ఖర్చర్ల హరీష్, నరేష్, రాగం అనిల్, చిన్న, గుణాకర్, ఆంజనేయులు, రాము, ఇహకీల్ ఫహీం, మాణిక్యం, పరమదాసు, అఖిల్, మనోజ్, సోమ శంకర్ మొదలగు వారు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...