సంగారెడ్డి ప్రతినిధి ఫిబ్రవరి 23 (SNM న్యూస్): సదాశివపేట పట్టణంలోని ది మాస్టర్‌మైండ్స్ ఈ-టెక్నో స్కూల్ 1వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారంరోజున బసవసేవ సదన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం సోమ వారం రోజున సాయంత్రం 6:00 గంటలకు ప్రారంభించబడింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, 12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు, 26 వ వార్డు కౌన్సిలర్ అపర్ణ శివరాజ్ పాటిల్, 22 వ వార్డు కౌన్సిలర్ కొత్త గొల్ల సోమశేఖర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులు కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రతిభా ప్రదర్శనలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పిల్లల చేత భగవద్గీత శ్లోకాలు, దేశభక్తి గీతాలు, నాటికలు, విలేజ్ నకు సంబంధించిన లంబాడీ నృత్యాలు, ఫోక్ డాన్సులు వంటి కార్యక్రమాలతో విద్యార్థిని, విద్యార్థులు హోరేత్తిoచారు. ఇట్టి కార్యక్రమంలో తల్లిదండ్రులు, ప్రజలు, నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందులకు స్కూల్ డైరెక్టర్ ఎం.నవనీత సంతోష్ గుప్త లు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియ జేశారు.

No comments:
Post a Comment