Wednesday, June 03, 2026

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా అందరూ సమన్వయం తో పనిచేయాలి


-సదాశివపేట కార్యకర్తల సమావేశం లో సదాశివపేట వ్యవహారాల ఇంచార్జ్ తోపాజి అనంత్ కిషన్

సదాశివపేట జూన్ 3: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు పని చేయాలని టీపిసిసి  ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్ అన్నారు. బుధవారం సదాశివపేట పేట పట్టణం లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సదాశివపేట కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ గా తోపాజి అనంత్ కిషన్ నియామకం అయిన అనంతరం  జరిగిన మొదటి సమావేశం ఇది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తోపాజి అనంత్ కిషన్, సిడిసి చైర్మెన్ రామ్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తోపాజి అనంత్ కిషన్ మాట్లాడుతూ  సదాశివపేట మున్సిపాలిటీ లో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ లు, వార్డ్ ఇంచార్జి లు అందరూ సమన్వయం తో పనిచేయాలన్నారు. ఎవరి వార్డు పరిధి లో వారు పనిచేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలవని వార్డుల్లో వార్డ్ ఇంఛార్జ్ లదే పూర్తి బాధ్యత వహించాలన్నారు. కాంగ్రెసు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కోరారు.  జగ్గారెడ్డి, డిసిసి అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి సారథ్యం లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు మునిపల్లె సత్యనారాయణ, చిరు,  వాసిం,  సిద్దన్న, కంది కృష్ణ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీహరి, పట్నం సుభాష్, చోటు భాయ్,    మున్సిపల్ కౌన్సిలర్లు శంకర్ గౌడ్, అరుణ్ కుమార్, నాగరాజు, నర్సింలు, విష్ణు వర్ధన్ రెడ్డి,  పట్టణ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి జి. శంకరయ్య గౌడ్‌కు ఘనంగా ఉద్యోగ విరమణ సన్మానం

ఎద్దుమైలారం, సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (SNM న్యూస్): ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 41 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవలంది...