Tuesday, March 31, 2026

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం


సంగారెడ్డి, మార్చి 30 (SNM న్యూస్); సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద జ్యువెలరీ సంస్థగా గుర్తింపు పొందిన ఈ సంస్థ తన విస్తరణలో భాగంగా సంగారెడ్డిలో 27వ నూతన స్టోర్ ‌ను సోమవారం ఘనంగా ప్రారంభించింది. ఈ షోరూమ్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. సంగారెడ్డిలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ యజమాన్యాన్ని అభినందిస్తూ, ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ నక్క మంజులత నాగరాజు గౌడ్, కౌన్సిలర్లు కొత్తపల్లి నాని, జలంధర్, జాఫర్, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చక్రపాణి, నక్క నాగరాజ్ గౌడ్, లాడేబాలు తదితరులు పాల్గొన్నారు.

Thursday, March 19, 2026

నవోదయ ఫలితాల్లో వివేకానంద కోచింగ్ సెంటర్ ప్రభంజనం

సంగారెడ్డి, మార్చి 19(SNM న్యూస్):నవోదయ 2026 ఫలితాల్లో వివేకానంద కోచింగ్ సెంటర్ విద్యార్థి ఎం.శరత్ చంద్ర 95.25 మార్కులతో జిల్లాలోనే మొదటి ర్యాంకు సాధించారని సంస్థ కరస్పాండెంట్ అరిగే వీణ శ్రీనివాస్ తెలియజేశారు. సంస్థ నుండి మరో విద్యార్థి 88.75 మార్కులతో నవోదయాలో సీటు సాధించారని తెలియజేశారు. సంస్థ స్థాపించిన నాటి నుండి ప్రతి సంవత్సరం వివేకానంద కోచింగ్ సెంటర్ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నట్లు యాజమాన్యం ఈ సందర్భంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో మంచి అత్యుత్తమ ఫలితాలతో అగ్రగామిగా రాణించాలని కరస్పాండెంట్ తెలియజేశారు. ఈ విజయానికి సహకరించిన అధ్యాపక బృందానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు.

Wednesday, March 18, 2026

రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ నవోదయ రిజల్ట్స్ లో ప్రభంజనం... ప్రభంజనం...ప్రభంజనం...

 

శరత్ చంద్ర విద్యార్థికి శుభాకాంక్షలు తెలియజేసిన డైరెక్టర్ & మోటివేషన్ స్పీకర్ ప్రకాష్

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 17 (SNM న్యూస్): నియోజకవర్గంలో రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ మరియు స్టడీ హాల్ లో కొన్ని సంవత్సరాల నుండి వరుసగా అన్ని రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టిస్తుంది ఈ రోజు విడుదల చేసిన జవహర్ నవోదయ రిజల్ట్స్ లో కూడా శరత్ చంద్ర అనే విద్యార్థికి ఓవర్ఆల్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించి ప్రభంజనం సృష్టించాడు రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మరియు మోటివేషన్ స్పీకర్ ప్రకాష్ , విద్యార్థి శరత్ చంద్ర కు శుభాకాంక్షలు తెలియచేశారు.మరియు వారి తల్లితండ్రులు ఎంతో ఆనందం వ్యక్త పరిచారు.కాబట్టి నవోదయ కోచింగ్ కోసం మా రితిన్స్ అకాడమీ కోచింగ్ సెంటర్ కి వచ్చి రిజల్ట్స్ ప్రభంజనం సృష్టించగలరని డైరెక్టర్ &  మోటివేషన్ స్పీకర్ తెలియచేశారు.

సంగారెడ్డిలో ఘనంగా బేటీ జన్మోత్సవ కార్యక్రమం

 

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 17 (SNM న్యూస్): సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా–శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, మహిళా సాధికారత కేంద్రం సహకారంతో బేటీ జన్మోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆసుపత్రిలో జన్మించిన ఆడ శిశువులను గౌరవిస్తూ బేటీ జన్మోత్సవ కిట్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా మహిళా సంక్షేమాధికారి, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి మాట్లాడుతూ ఆడపిల్లలు, మగపిల్లలను సమానంగా చూడాల్సిన అవసరాన్ని వివరించారు. సమాజంలో ఆడపిల్లల పట్ల గౌరవ భావం పెంపొందించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత అంశాలలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. అలాగే, పుట్టిన శిశువులకు తల్లి పాల ప్రాధాన్యతను వివరిస్తూ మొదటి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లి పాలనే ఇవ్వాలని అవగాహన కల్పించారు. అవసరమైన సందర్భాలలో మహిళా సాధికారత కేంద్రం సేవలను వినియోగించుకోవాలని సూచించారు. బాలికల హక్కుల పరిరక్షణ, పోషణ, విద్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటేనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధికారి డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ నాగనిర్మల, మహిళా సాధికారత కేంద్ర సమన్వయకర్త పల్లవి, ఆసుపత్రి సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఇదే విధంగా పటాన్‌చెరు ప్రాంతీయ ఆసుపత్రిలో కూడా బేటీ జన్మోత్సవ కిట్లను పంపిణీ చేశారు.

తల్లి కిడ్నీ దానం– కొడుకుకు కొత్త జీవితం

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 17 (SNM న్యూస్):: తల్లి ప్రేమకు మరో ఉదాహరణగా నిలిచే ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఓ తల్లి తన కుమారుడికి కిడ్నీ దానం చేసి కొత్త జీవితం ప్రసాదించింది. సంగారెడ్డికి చెందిన సందీప్ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. పలుమార్లు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో చికిత్స కోసం కుటుంబం ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తన కిడ్నీని దానం చేసింది. అనంతరం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో వైద్యులు డాక్టర్ మురళీ నాథ్ నేతృత్వంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం తల్లి, కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు, కిడ్నీ దానం చేసిన తల్లి వివరాలను వెల్లడించారు. తల్లి ప్రేమకు ఇది నిదర్శనమని, అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు.

Sunday, March 15, 2026

ఇసోజిపేటలో సిసి రోడ్డు పనుల ప్రారంభం

సంగారెడ్డి ప్రతినిధి మార్చి 15 (SNM న్యూస్):  పుల్కల్ మండలంలోని ఇసోజీపేట గ్రామంలో 20 లక్షల సిసి రోడ్డు ప్రారంభిస్తున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుర్గారెడ్డి, గ్రామ సర్పంచి విజేందర్ రెడ్డి, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వైద ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు గ్రామ అభివృద్ధి గురించి సిసి రోడ్లు వేయడం జరుగుతుందని అన్నారు, ఈ గ్రామానికి ప్రజలకు సేవ చేసే అదృష్టం నాకు కలిగిందని సర్పంచ్ విజేందర్ రెడ్డి అన్నారు, ఈ కార్యక్రమంలో మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, నాయకుని గోవర్ధన్ సత్తార్ పటేల్  గోపాల్ తాజా మాజీ ఎంపిటిసి నాయకుని రవికుమార్ గ్రామ ఉపసర్పంచి రవికుమార్  వార్డు సభ్యులు బి నరేంద్ర,నాయకులు శివనుల గణపతి తలారి యాదగిరి సుఖేందర్ రెడ్డి లచిరెడ్డి లక్మన్ రెడ్డి మంగలి రాజు పండరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Saturday, March 07, 2026

నేడు జహీరాబాద్‌లో మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్,ఆరోగ్య శిబిరం

 

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 7 (SNM న్యూస్):అం తర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేడు అనగా మార్చి 8 ఆదివారం రోజున జహీరాబాద్‌లో మహిళల కోసం భారీ ఉచిత ఆరోగ్య, క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ఫ్యూయెలింగ్ గ్రోత్ ఫౌండేషన్ ఫౌండర్, ట్రస్టి పైలెట్ బాబి అజ్మీరా ఒక ప్రకటనలో తెలిపారు. స్టార్ హాస్పిటల్స్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరం జహీరాబాద్‌లోని పాస్తాపూర్ రోడ్డులో గల డాక్టర్ ఆర్ ఎల్ ఆర్ స్కూల్, జూనియర్ కాలేజీలో ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు కొనసాగుతుంది. శిబిరం ప్రత్యేకతలు, ముందస్తు గుర్తింపు: రొమ్ము, గర్భాశయ, క్యాన్సర్లను ప్రాథమిక దశలోనే గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు. ఉచిత సేవల వివరాలు అనుభవజ్ఞులైన స్టార్ హాస్పిటల్ వైద్యులచే ఉచిత సంప్రదింపులు, వెల్నెస్ స్క్రీనింగ్ నిర్వహించబడును. ఎవరు హాజరుకావచ్చు: 40 నుండి 65 ఏళ్ల లోపు వయస్సు గల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్క్రీనింగ్ చేయించుకోవాలనుకునే వారు తమ పాత మెడికల్ రిపోర్టులు (ఉంటే) వెంట తీసుకురావాలి. శిబిరంలో ముందుగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇతర వివరాల కోసం మరియు ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం 94900 59175 నంబర్‌ను సంప్రదించగలరు. మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, ఈ ఉచిత శిబిరాన్ని జయప్రదం చేయాలని ఫ్యూయెలింగ్ గ్రోత్ ఫౌండేషన్, స్టార్ హాస్పిటల్స్ బృందం కోరారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలంటే.. యాక్షన్ ప్లాన్ అమలు కీలకం!

 


ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి

సంగారెడ్డి ప్రతినిధి మార్చి 7 (SNM న్యూస్): క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన యాక్షన్ ప్లాన్ అమలు కీలకమని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మెదక్ కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని ఆమె అన్నారు. ప్రతి శాఖ అధికారి సమయపాలన పాటిస్తూ, అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని నిర్మల జగ్గారెడ్డి సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. యాక్షన్ ప్లాన్‌లో నిర్ణయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

-జిల్లా అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలి, ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల్లో పారదర్శకత ఉండాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడంతో పాటు పేద ప్రజలకు అందే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు.అధికారులు గ్రామాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడానికి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేష్ శెట్కార్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్ రావు, సంజీవ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Wednesday, March 04, 2026

హలో జగ్గా జీ..... హౌ ఆర్ యు


టీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కి షేక్ హ్యాండ్ ఇచ్చి   పలకరించిన రాహుల్ గాంధీ

వికారాబాద్ లో నిన్న జరిగిన  కాంగ్రెస్ పిఏసి సమావేశం అనంతరం జరిగిన సన్నివేశం

సంగారెడ్డి ప్రతినిధి మార్చి 3 (SNM న్యూస్): తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్  డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతుల ముగింపు సందర్భంగా ఏఐసిసి అధినాయకుడు రాహుల్ గాంధీ హాజరైన విషయం తెలిసిందే. డిసిసి అధ్యక్షుల సమావేశానికి ముందు కాంగ్రెస్ పిఏసి  కమిటీ సభ్యులతో సమావేశం  జరిగింది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. సమావేశం ముగించుకుని రాహుల్ గాంధీ వెళ్తున్న సందర్భం లో  ఆయన కారు వద్దకు చేరుకోగానే  ఏపిసిసీ  వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ అక్కడే ఉన్న  జగ్గారెడ్డి ని చూసి  రాహుల్ జీ .... జగ్గన్న ఈజ్ హియర్.. అంటూ రాహుల్ గాంధీ కి చెప్పారు. వెంటనే రాహుల్ గాంధీ జగ్గారెడ్డి వైపు చూసి  చేతిని గట్టిగా పట్టుకుని  హాయ్ జగ్గ జీ.. హౌ ఆర్ యు అంటూ  ఆప్యాయంగా పలకరించారు. అనంతరం కార్ లో ఎక్కి వెళ్లిపోయారు.

Tuesday, March 03, 2026

12 వ వార్డు కౌన్సిలర్ పులి మామిడి మమత రాజు దంపతులను ఘనంగా సన్మానించిన ఉషాకిరణ్ యూత్ సభ్యులు

 

సంగారెడ్డి ప్రతినిధి మార్చి 03 (SNM న్యూస్): సదాశివపేట పట్టణంలోని పి.ఎం. ఆర్ క్యాంపు కార్యాలయంలో  సాధారణ మున్సిపల్ ఎన్నికలలో 12 వ వార్డునుండి గెలిచినటు వంటి పులిమామిడి మమత రాజు దంపతులను ఉషాకిరణ్ యూత్ సభ్యులు శాలువాలతో మరియు పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఇట్టి సందర్భంగా బామిని రవి కుమార్ మాట్లాడుతూ మా చిన్నానాటి మిత్రుడు పులిమామిడి రాజు రానున్న రోజుల్లో రాజకీయంగా మరింత ఎత్తుకు యెదగాలని వారు ఇట్టి సందర్భంగా గుర్తు జేశారు. ఇలాంటి మంచి మిత్రుడు మాకందరికి దొరకడం మా పూర్వజన్మ సుకృతమని బామిని రవి  మరియు బుసరెడ్డి పల్లి వెంకటేశం అన్నారు. అదేవిధంగా పులిమామిడి రాజు మాట్లాడుతూ ఇంత చక్కటి మిత్రులు నా వెన్నంటు ఉండి ముందుకు నడిపిస్తున్నందుకు ఉషాకిరణ్ యూత్ సభ్యులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు, సభ్యులు, మరియు పి. ఎం. ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

సీఎం కప్–2025లో మెరిసిన సంగారెడ్డి ఈతగాళ్లు రెహమాన్‌ – ఉజైర్‌కు రజత, కాంస్య పతకాలు

 

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాల ప్రదానం

సంగారెడ్డి, మార్చి 2(SNM న్యూస్): రాష్ట్ర స్థాయి ఈత పోటీల్లో సంగారెడ్డి జిల్లా విద్యార్థులు తమ ప్రతిభను చాటుతూ విశిష్ట విజయాలు సాధించారు. ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో  నిర్వహించిన రాష్ట్ర స్థాయి రెండవ ఎడిషన్ సీఎం కప్–2025 స్విమ్మింగ్ పోటీలలో మహమ్మద్ అబ్దుర్ రెహమాన్, ఉజైర్ పతకాలు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలబెట్టారు.‌ సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్లోకా శ్రీవాణి హై స్కూల్‌కు చెందిన విద్యార్థి ముహమ్మద్ అబ్దుర్ రహమాన్ సిద్ధిఖ్ గ్రూప్–2 విభాగంలో 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ పోటీలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే కరుణ హై స్కూల్‌కు చెందిన విద్యార్థి ఉజైర్ గ్రూప్–3 విభాగంలో బ్రెస్ట్ స్ట్రోక్ పోటీలో రజత పతకం, ఫ్లై ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించి ద్విగుణ విజయాన్ని నమోదు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య విజేతలను అభినందిస్తూ వారి చేతుల మీదుగా మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేశారు. అదనపు కలెక్టర్ మాధురి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి క్రీడాకారులను  అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ స్థాయి క్రీడాకారులను తీర్చిదిద్దడం  సీఎం కప్  యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి అఖిలేష్ రెడ్డి క్రీడాకారులను అభినందిస్తూ, క్రమబద్ధమైన సాధనతో ముందుముందు జాతీయ స్థాయిలోనూ రాణించాలని సూచించారు. కఠినమైన పోటీ వాతావరణంలో శ్రద్ధ, పట్టుదలతో పోటీపడి ఈ విజయాలను అందుకోవడం అభినందనీయమని అన్నారు. జిల్లా స్విమ్మింగ్ ఇంచార్జ్ శేషు కుమార్ కూడా విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.యువ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఇతర జాతీయ స్థాయిలోనూ మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అభిప్రాయపడ్డారు.

Monday, March 02, 2026

వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించిన చిన్నారుల నృత్య ప్రదర్శన

 

150 మంది చిన్నారుల చే తారా డిగ్రీ కళాశాల ప్రాంగణం లో సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 1 (SNM న్యూస్): సంగారెడ్డి జిల్లా కేంద్రం లోని నక్షత్ర స్ఫూర్తి డాన్స్ అకాడమీ నిర్వాహకు రాలు నిర్వాహకురాలు గీతా యజ్ఞశ్రీ శిష్య బృందం నిర్వహించిన 150 మంది కళాకారుల చే కూచిపూడి వైభవం సరస్వతి స్తుతి సామూహిక  కార్యక్రమానికి వండల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించింది. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో  చిన్నారులు సామూహికంగా నృత్యం చేసి ఒక రికార్డును నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి చిన్నారులకు శిక్షణ ఇచ్చిన గీతా యజ్ఞశ్రీ ని వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, కోఆర్డినేటర్ రవి కుమార్  మెడల్‌తోపాటూ ధ్రువీకరణ పత్రం అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వాసవి మా ఇల్లు వ్యవస్థాపక అధ్యక్షులు తోపాజి అనంతకిషన్, పుల్లూరి ప్రకాష్,టి వై యస్ యస్ అధ్యక్షులు కూన వేణు, తదితరులు పాల్గొన్నారు.

Sunday, March 01, 2026

పట్కర్ సమాజ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ లకు సన్మానం ముఖ్య అతిథిగా హాజరైన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి*

 నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ లతో పాటు పలువురు కౌన్సిలర్ లను పట్కర్ సమాజ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సమీపం లోని ఎస్ఎస్ కే భవన్ లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్ పర్సన్ కూన వనితా సంతోష్, వైస్ చైర్మన్ షఫీ హఫీజ్ లతో పాటు నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ లు తోపాజీ వీణా హరీష్, శ్రీకాంత్ గౌడ్, సంగీతా మహేష్ ల ను పట్కర్ సమాజ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, కాంగ్రెస్ నాయకుడు కూన సంతోష్, పట్కర్ సమాజ్ అధ్యక్షుడు కోనేరీ చందర్, మాజీ ప్రధాన కార్యదర్శి చవాన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

12 వ వార్డు కౌన్సిలర్ పులిమామిడిమమత రాజులను సన్మానించిన పోల శ్రీనివాస్ మిత్ర బృందం

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 01 (SNM న్యూస్): సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS అంతము - మన పంతము )ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పోల శ్రీనివాస్,  రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పులిమామిడి రాజు, ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో 12వ వార్డు నుండి గెలిచినటువంటి వారి సతీమణి.పులిమామిడి మమతను కలిసి వారిని శాలువాతో సన్మానించి, హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఇట్టి సందర్భంగా పోల శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న రోజులలో మీరు ఉన్నత స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానని రాజుకి తెలియపరచారు. మీరు చేసిన సేవలను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ మర్చిపోలేరని అన్నారు. అదేవిధంగా సదాశివపేట పట్టణంలో ఉండేటువంటి టీచర్స్ కి మీటింగ్స్ ఏర్పాటు చేసుకొనుటకుగాను ఎటువంటి భవనం లేదని వారికి తెలియపరిచారు. అందుకోసం సదాశివపేట పట్టణంలో ఉండేటటువంటి ఉపాధ్యాయుల కొరకు టీచర్స్  భవనం కట్టుకునేందుకుగాను గవర్నమెంట్ పక్షాన ఒక స్థలాన్ని ఏర్పాటు చేయుటకు కృషి చేయాలని పోల శ్రీనివాస్ పులిమామిడి రాజుకు విజ్ఞప్తి చేశారు. ఇట్టి విషయానికి పులి మామిడిరాజు స్పందించి అవకాశం ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వంతో మాట్లాడి స్థలాన్ని ఇప్పించడానికి కృషి చేస్తానని వారికి తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వారి మిత్రులు విజయ్ కుమార్, సోమ శంకర్ మరియు పి. ఎం. ఆర్ యువసేన నాయకులు పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆయుధ కర్మాగారంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

 

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 01 (SNM న్యూస్): కంది మండలం ఆయుధ కర్మాగారంలో శనివారం ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించారు. తరువాత విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రయోగాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సిహెచ్. విజయభాస్కర్ మాట్లాడుతూ 1928 లో సర్ సివి రామన్ కనుక్కున్న ' రామన్ ఎఫెక్ట్ 'కు గౌరవంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 నాడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సివి రామన్ కు 'రామన్ ఎఫెక్ట్' కనుక్కున్నందుకు 1930 సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. 2026 సైన్స్ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం "సైన్స్ లో స్త్రీలు వికసిత భారత్ కు వారిని ఉత్ప్రేరణ చేయడం" అనే తీముగా నిర్ణయించిందన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ ను అభివృద్ధి చేసి జాతీయ అభివృద్ధికి పాటుపడేటట్లు చేయడం అన్నారు. వివిధ పోటీలలో ప్రతిభా ప్రదర్శించిన విద్యార్థులకు బహుమ తులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఏ. శ్రీనివాసరావు, కె. సంధ్య ,సలోమి తదితరులు పాల్గొన్నారు.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

 

సంగారెడ్డి, మార్చి 01 (SNM న్యూస్): దాదాపు 36 ఏళ్ల తర్వాత తమ స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సందడిగా గడిపారు. చౌటకూర్ మండలం శివంపేట గ్రామం లోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1989-90 సంవత్సరం పదవ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని మల్లేపల్లి లోని ఆర్ ఆర్ ఆర్ కన్వెన్షన్ హాల్లో  ఆదివారం ఘనంగా నిర్వహించారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత తమ స్నేహితులు చదువు చెప్పిన గురువులను చూసి పూర్వ విద్యార్థులు మురిసిపోయారు చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సందడిగా గడిపారు. ఈ సందర్భంగా తమ గురువులను సన్మానించి వారి ఆశీర్వాదాలను పొందారు.  ఉన్నత స్థానాలకు ఎదిగిన తమ పూర్వ విద్యార్థులను చూసి గురువులు ఆనందించారు. జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశీర్వదించారు. తమపై విద్యార్థుల ప్రేమాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. విద్యార్థిని, విద్యార్థులు ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థి దశలో గురువులతో మెలిగిన సందర్భాలను తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజమౌళి, శివప్రసాద్, బాలనాగిరెడ్డి, విద్యార్థులు భాస్కర్ వర్మ, దేవరాజ్, రవి, సుదర్శన్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

మహిళల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది -టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

 

-సదాశివపేట మండలం చందాపూర్ గ్రామం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి మార్చి 01 (SNM న్యూస్): మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యోద్దేశమని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం సదాశివపేట మండలం చందాపూర్ గ్రామం లో ఆమె పర్యటించారు. గ్రామం లో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్, మహిళా సమాఖ్య భవనానికి, స్కూల్ కాంపౌండ్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా గ్రామం లో ఇటీవలే నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే మహిళలకుఉచిత బస్సు అవకాశం కల్పించింది అన్నారు. మహిళలకు పావులా వడ్డీ రుణాలు, మహిళా సంఘాల కు పక్కా భవనాలు, పెట్రోల్ బంక్ లను సైతం ఏర్పాటు చేసిందన్నారు. భవిష్యత్తులో మహిళా సంఘాలకు బస్సులు కేటాయించి మహిళల తో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇలా ప్రతీ విషయంలో మహిళల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది అన్నారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న, గ్రామ సర్పంచ్ పట్లోల్ల మల్లేష్ , ఉప సర్పంచ్ , వార్డు మెంబర్లు , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం

సంగారెడ్డి, మార్చి 30 (SNM న్యూస్); సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ఘనంగా ప్రారంభ...