Sunday, March 01, 2026

మహిళల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది -టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

 

-సదాశివపేట మండలం చందాపూర్ గ్రామం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి మార్చి 01 (SNM న్యూస్): మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యోద్దేశమని టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం సదాశివపేట మండలం చందాపూర్ గ్రామం లో ఆమె పర్యటించారు. గ్రామం లో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్, మహిళా సమాఖ్య భవనానికి, స్కూల్ కాంపౌండ్ నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. అదేవిధంగా గ్రామ ప్రజల కోసం ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ ను నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా గ్రామం లో ఇటీవలే నిర్మించిన రెండు ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే మహిళలకుఉచిత బస్సు అవకాశం కల్పించింది అన్నారు. మహిళలకు పావులా వడ్డీ రుణాలు, మహిళా సంఘాల కు పక్కా భవనాలు, పెట్రోల్ బంక్ లను సైతం ఏర్పాటు చేసిందన్నారు. భవిష్యత్తులో మహిళా సంఘాలకు బస్సులు కేటాయించి మహిళల తో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందన్నారు. ఇలా ప్రతీ విషయంలో మహిళల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది అన్నారు. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్దన్న, గ్రామ సర్పంచ్ పట్లోల్ల మల్లేష్ , ఉప సర్పంచ్ , వార్డు మెంబర్లు , మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఒగ్గు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...