Wednesday, March 18, 2026

తల్లి కిడ్నీ దానం– కొడుకుకు కొత్త జీవితం

సంగారెడ్డి ప్రతినిధి, మార్చి 17 (SNM న్యూస్):: తల్లి ప్రేమకు మరో ఉదాహరణగా నిలిచే ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఓ తల్లి తన కుమారుడికి కిడ్నీ దానం చేసి కొత్త జీవితం ప్రసాదించింది. సంగారెడ్డికి చెందిన సందీప్ గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నాడు. పలుమార్లు డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగుపడలేదు. ఈ క్రమంలో చికిత్స కోసం కుటుంబం ఆర్థికంగా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. తన కుమారుడి ప్రాణాలను కాపాడేందుకు తల్లి ముందుకు వచ్చి స్వచ్ఛందంగా తన కిడ్నీని దానం చేసింది. అనంతరం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌లో వైద్యులు డాక్టర్ మురళీ నాథ్ నేతృత్వంలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శస్త్రచికిత్స అనంతరం తల్లి, కుమారుడు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసుపత్రి వైద్యులు, కిడ్నీ దానం చేసిన తల్లి వివరాలను వెల్లడించారు. తల్లి ప్రేమకు ఇది నిదర్శనమని, అవయవ దానం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచించారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...