Saturday, March 07, 2026

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలంటే.. యాక్షన్ ప్లాన్ అమలు కీలకం!

 


ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచన

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమని వెల్లడి

సంగారెడ్డి ప్రతినిధి మార్చి 7 (SNM న్యూస్): క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన యాక్షన్ ప్లాన్ అమలు కీలకమని టీజీఐఐసీ ఛైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు. మెదక్ కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రభుత్వం రూపొందించిన యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని ఆమె అన్నారు. ప్రతి శాఖ అధికారి సమయపాలన పాటిస్తూ, అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని నిర్మల జగ్గారెడ్డి సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు. యాక్షన్ ప్లాన్‌లో నిర్ణయించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు.

-జిల్లా అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలి, ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషి చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జీ మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవల్లో పారదర్శకత ఉండాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రజా పాలన కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి తక్షణ పరిష్కారం చూపడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. జిల్లాలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడంతో పాటు పేద ప్రజలకు అందే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు.అధికారులు గ్రామాల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావడానికి సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేష్ శెట్కార్, రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్ రావు, సంజీవ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

నూతన డీఈఓ రోహిణికి శుభాకాంక్షలు

  సంగారెడ్డి, జూన్ 10: సంగారెడ్డి జిల్లా నూతన జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)గా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి రోహిణి గారిని తెలంగాణ ప్రదేశ్ రాష్...